HBD Samantha Ruth Prabhu: సమంత బర్త్ డే స్పెషల్ - ఆమె కూడా మరో సావిత్రేనా? సినిమాల సక్సెస్‌కి, కెరీర్ డౌన్‌ఫాల్‌కి తనే కారణమా?
Happy Birthday Samantha Ruth Prabhu: ఇండస్ట్రీలో అడుగుపెట్టి 14 ఏళ్లు అయినా ఇప్పటికీ ఒక సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కొనసాగుతోంది సమంత. కానీ తన కెరీర్ డౌన్‌ఫాల్‌కు తన పర్సనల్ నిర్ణయాలే కారణమయ్యాయి.
Samantha Ruth Prabhu Birthday Today: హీరోయిన్లకు వెండితెరపై లైఫ్‌స్పాన్ చాలా తక్కువగా ఉంటుందని ఇండస్ట్రీ నిపుణులు అంటుంటారు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రమే ఆ స్టేట్‌మెంట్ తప్పు అని నిరూపించగలరు. అందులో సమంత కూడా ఒకరు. 2010లో నటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది సామ్. ఇప్పటికీ సక్సెస్‌ఫుల్, మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ప్రొఫెషనల్‌గా మాత్రమే కాకుండా.. పర్సనల్‌గా కూడా ఎన్నోసార్లు వార్తల్లో నిలిచింది ఈ భామ. కానీ తనపై ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా వాటన్నింటినీ ఎదుర్కుంటూ ముందుకు వెళ్తూనే ఉంది. ఏప్రిల్ 28న సమంత పుట్టినరోజు కావడంతో తన ఫ్యాన్స్ సోషల్ మీడియాను విషెస్‌తో నింపేశారు.
గోల్డెన్ లెగ్ ట్యాగ్..
టాలీవుడ్ అగ్రనిర్మాత అల్లు అరవింద్.. ఓ సందర్భంలో ఈ జెనరేషన్ హీరోయిన్లలో సమంతను మరో సావిత్రిగా పోల్చారు. తన నటనతో సమంత అంతటి పేరును సంపాదించుకుంది. చాలా తక్కువమంది హీరోయిన్లకు మాత్రమే సమంత లాంటి డెబ్యూ లభిస్తుంది. గౌతమ్ మీనన్ లాంటి దర్శకుడితో ‘ఏమాయ చేశావే’ లాంటి ప్రేమకథతో ప్రేక్షకులకు హీరోయిన్‌కు పరిచయమయ్యింది సామ్. మొదటి సినిమాలోనే జెస్సీగా యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే తనకు స్టార్ హీరోల సరసన అవకాశాలు రావడానికి పెద్దగా సమయం పట్టలేదు. బ్యాక్ టు బ్యాక్ ఎన్‌టీఆర్, మహేశ్ బాబు లాంటి నటులతో జతకట్టి హిట్లు కొడుతూ గోల్డెన్ లెగ్ అనే ట్యాగ్‌ను కూడా దక్కించుకుంది. తెలుగులో మాత్రమే కాదు.. తమిళంలో కూడా సమంత ఒక సక్సెస్‌ఫుల్ కెరీర్‌ను కొనసాగించింది. ఇక ‘ఏమాయ చేశావే’ తర్వాత చాలాకాలం పాటు గౌతమ్ మీనన్ సినిమా అంటే సమంత కచ్చితంగా ఉంటుంది అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు.
ఆ తర్వాతే డౌన్‌ఫాల్..
ప్రొఫెషనల్‌గా సమంత కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే తను నాగచైతన్యను ప్రేమిస్తున్నట్టుగా, పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టుగా ప్రకటించింది. సమంత, నాగచైతన్య నాలుగు సినిమాల్లో కలిసి నటించారు. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. చాలామంది ఈ పెయిర్‌కు ఫ్యాన్స్ అయ్యారు. వీరి పెళ్లి గురించి ప్రకటించినప్పుడు ఫ్యాన్స్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ అదంతా కొంతకాలం వరకే. 2017లో పెళ్లి చేసుకున్న సమంత, నాగచైతన్య.. 2021లో విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఈ వార్త ఒక్కసారిగా ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది. ఆ తర్వాత చాలాకాలం పాటు వీరిద్దరూ మళ్లీ కలుస్తారని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తూనే ఉన్నారు. విడాకుల తర్వాత పర్సనల్‌గా సమంత డౌన్‌ఫాల్ మొదలయ్యింది.
అనాథ పిల్లలకు సాయం..
2021లో విడాకులను ప్రకటించిన తర్వాత 2022లో తాను మాయాసైటీస్ అనే ఇమ్యూనిటీ వ్యాధితో బాధపడుతున్నానని సమంత బయటపెట్టింది. దాని వల్ల పర్సనల్‌గా తను చాలా వీక్ అయిపోయింది. అందుకే తన వద్దకు వచ్చిన సినిమా అవకాశాలను కూడా వదులుకుంది. కేవలం చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ మాత్రమే పూర్తి చేసి ఏడాది పాటు బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించి చికిత్స కోసం అమెరికా వెళ్లిపోయింది. ఇప్పటికీ సామ్.. ఇంకా ఏ పెద్ద ప్రాజెక్ట్‌కు కమిట్ అవ్వలేదు. సమంత జీవితంలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన మరో అంశం ‘ప్రత్యూష ట్రస్ట్’. తన కెరీర్ ప్రారంభంలోనే అనాథ పిల్లలకు సాయం చేయడం కోసం ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి తన జీవితంలోని ప్రతీ స్పెషల్ సందర్భాన్ని ఆ పిల్లలతోనే జరుపుకుంటుంది సామ్.
Also Read: మొహమాటంతో కొన్ని సినిమాలు ఒప్పుకొని తప్పు చేశా: అల్లరి నరేశ్