సింప్లిసిటీ అంటే ఏంటో తెలియాలంటే సాయి పల్లవిని ఫాలో అవ్వాల్సిందే అని చాలామంది యూత్ అనుకుంటూ ఉంటారు. ఏ ఈవెంట్ అయినా సింపుల్‌గా ఒక చీరతో అందరినీ ఆకట్టుకోవడం ఈ నటి స్పెషాలిటీ. సాయి పల్లవి ఏ చీరపైన అయినా సింపుల్ బ్లౌజ్ డిజైనే ప్రిఫర్ చేస్తుంది. ప్లెయిన్ చీరలపై చిన్న పువ్వుల ప్రింట్‌తో బ్లౌజ్ ఎంత బాగుంటుందో సాయి పల్లవిని చూస్తే అర్థమవుతుంది. హెవీ బోర్డర్ ఉన్న ఫ్యాన్సీ చీరపైన కూడా ప్లెయిన్ స్లీవ్ లెస్ బ్లౌజ్ బాగా సెట్ అయిపోతుంది. పట్టుచీరపై కూడా ఎలాంటి హడావిడి లేకుండా ఇలా స్లీవ్ లెస్ ప్లెయిన్ బ్లౌజ్ ట్రై చేసి చూడండి. గోల్డ్ కలర్ బోర్డర్ ఉన్న చీరలపై.. బ్లౌజ్ కూడా చిన్న గోల్డ్ ప్రింట్స్‌తో మ్యాచ్ చేస్తే బాగుంటుంది. All Images Credit: Sai Pallavi/Instagram