Samantha: నేను పాత వార్త అయిపోకూడదు, ఆ భయాన్ని అధిగమించాలి - సమంత
Samantha Ruth Prabhu: ప్రస్తుతం సమంత సినిమా ఆఫర్లు ఏమీ ఒప్పుకోవడం లేదు. అయితే స్క్రీన్‌పై తను కనిపించకపోవడంతో ప్రేక్షకులు తనను మర్చిపోతారేమో అన్న భయం ఇప్పటికీ ఉంటుందని తను బయటపెట్టింది.
Samantha Ruth Prabhu: కొందరు నటీనటులు తమ ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ వల్లే ఎక్కువగా వార్తల్లో నిలుస్తారు. ఎక్కువగా సినిమాలతో అలరించకపోయినా.. సోషల్ మీడియాలో పోస్టుల ద్వారానే హైలెట్ అవుతారు. అలాంటి హీరోయిన్ల లిస్ట్‌లో సమంత పేరు కూడా కచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం సమంత ముందులాగా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో కనిపించడం లేదు. అసలు 2024లో ఒక్క సినిమాతో అయినా ఈ భామ ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో క్లారిటీ లేదు. కానీ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది సామ్. తాజాగా ప్రేక్షకులు తనను మర్చిపోతారేమో అన్న భయం ఎప్పుడూ ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ బ్యూటీ.
మమ్మల్ని మర్చిపోతారు..
‘‘చాలా పాత్రల్లో ప్రాధాన్యత లేకపోయినా నేను నటించాను. ఎందుకంటే ప్రతీ పోస్టర్‌పై నేను ఉండాలని అనుకున్నాను కాబట్టి. అనుకున్నట్టే ఉన్నాను. ప్రతీ నెల నాకొక సినిమా రిలీజ్ ఉండేది. అలాంటప్పుడు మీరు నన్ను పట్టించుకోకుండా ఉండలేరు. అందరూ ప్రతీ నటిలో ఒక ఆలోచనను క్రియేట్ చేస్తారు. హీరోయిన్ అంటే కెరీర్ లైఫ్ తక్కువగా ఉంటుందని ఫిక్స్ అయిపోయేలా చేస్తారు. ఎక్కువగా బ్రేక్స్ తీసుకోలేమని అంటారు, కంటికి కనిపించకపోతే ప్రేక్షకులు మమ్మల్ని మర్చిపోతారని అంటారు’’ అంటూ ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన రోజులను గుర్తుచేసుకొని, అందులో అన్నీ తనకు నచ్చి చేయలేదని బయటపెట్టింది సమంత.
అప్పటివరకు ఎదురుచూస్తాను..
‘‘ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను మంచి ప్రాజెక్ట్ వచ్చేవరకు ఎదురుచూస్తాను, సంవత్సరం పాటు బ్రేక్ తీసుకున్నాను అని చెప్పడం సులభమే. కానీ ప్రేక్షకుల కంటికి కనిపించకపోతే నన్ను మర్చిపోతారేమో అన్న భయం నాలో ఎప్పుడూ ఉంటుంది. నేను ప్రస్తుతం ఎక్కువ నిలకడగా ఉండడం లేదు. అయినా నేను ఈ భయాన్ని అధిగమించాలి. నేను పాత వార్తను అయిపోతానేమో అని భయం వదిలేయాలి. మంచి రోల్ వచ్చే వరకు ఎదురుచూడాలి. ప్రేక్షకుల ఎదురుచూపులకు న్యాయం చేశానని అనిపించాలి. అన్ని అవకాశాలు నా ఎదురుగా వచ్చేవరకు ఎదురుచూస్తాను’’ అని తన భయాలను ఎలా ఎదుర్కునే ప్రయత్నం చేస్తుందో బయటపెట్టింది సమంత.
సంవత్సరం పాటు బ్రేక్..
ప్రస్తుతం సమంత మయసైటీస్ అనే ఆటో ఇమ్యూనిటీ వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధికి పూర్తిగా చికిత్స అనేది లేదు. అందుకే దీని నుండి బయటపడడం కోసం సమంత ఒక సంవత్సరం పాటు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. విజయ్ దేవరకొండతో నటించిన ‘ఖుషి’నే తన చివరి సినిమా. అయితే ‘ఖుషి’ సమయంలో కూడా తను ఎక్కువగా బ్రేక్స్ తీసుకుంటూ షూటింగ్‌ను లేట్ అయ్యేలా చేసింది. అయినా కూడా మూవీ టీమ్ కష్టపడి షూటింగ్‌ను పూర్తిచేశారు. ఆ తర్వాత పూర్తిగా తన ఆరోగ్యంపైనే దృష్టిపెట్టాలని, సినిమాలకు కాస్త దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది సామ్. ఇప్పటికీ అలా బ్రేక్ తీసుకోవడం తనకు తీసుకున్న మంచి నిర్ణయమని చెప్తోంది.