Samanta on Liger poster: వాటిని కూడా బ్రేక్ చేయగలడు - విజయ్ దేవరకొండ ‘లైగర్’ పోస్టర్‌పై సమంత కామెంట్
లైగర్ సినిమా నుంచి విడులైన రౌడీ బాయ్ పోస్టర్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఒంటి మీద నూలు పోగు కూడా
లైగర్ సినిమా నుంచి విడులైన రౌడీ బాయ్ పోస్టర్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా రోజా పూల బొకేని అడ్డుపెట్టుకుని సినిమా ప్రోమోషన్స్ కోసం విడుదల చేసిన ఈ పోస్టర్ పై ఓ వైపు మీమ్స్ వస్తుంటే మరో వైపు అతని ధైర్యాన్ని మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా రౌడీ బెస్ట్ ఫ్రెండ్ సమంత స్పందించింది.
ఈ పోస్టర్ పై సమంత ఇన్ స్టా స్టోరీస్ లో కామెంట్ చేసింది. “అతనికి నియమ నిబంధనలు తెలుసు. అందుకే వాటిని బ్రేక్ కూడా చెయ్యగలడు. ధైర్యం, కీర్తి అతనికే సొంతం” అంటూ రాసుకొచ్చారు. దానికి విజయదేవరకొండ రిప్లై ఇచ్చారు. “సామీ బెస్ట్.. ఆగస్ట్ 25 న రాబోతున్న” అని ఇన్ స్టా స్టోరీస్ రాసుకొచ్చారు. ప్రస్తుతం విజయ్, సమంత కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్నారు. రాశిఖన్నా, అనుష్క శెట్టి, పూజ హెగ్డే, జాన్వి కపూర్, రష్మిక మందన్నా, కేతిక శర్మతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు విజయ్ ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
విజయ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రమిది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 25న విడుదల కానుంది. విజయ్ సరసన అనన్య పాండే నటిస్తుంది. ఈ పోస్టర్ విడుదలైన 4 గంటల్లోనే ఒక మిలియన్ లైక్స్ సొంతం చేసుకుంది. ఇక విజయ్, సామ్ కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్నారు.
View this post on Instagram