'సలార్' ట్రైలర్ కి టైమ్ ఫిక్స్ - రాబోయే అప్డేట్స్ పై మేకర్స్ సాలిడ్ అనౌన్స్ మెంట్!
ప్రభాస్ 'సలార్' టీజర్ కు 100 మిలియన్ల వ్యూస్ తగ్గడంతో మూవీ టీం సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. తాజాగా సోషల్ మీడియాలో ఓ స్పెషల్ నోట్ రిలీజ్ చేసింది.
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'సలార్' టీజర్ కి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ రావడంతో దీనిపై చిత్ర యూనిట్ తాజాగా స్పందిస్తూ ఓ స్పెషల్ నోట్ ని విడుదల చేసింది. ఈ క్రమంలోనే 'సలార్' టీజర్ ని మించి ట్రైలర్ ఉండబోతుందని ప్రకటించింది. జులై 6, గురువారం విడుదలైన సలార్ టీజర్ ఏకంగా 100 మిలియన్ వ్యూస్ రాబట్టి సరికొత్త ప్రభంజనం సృష్టించింది. హైయెస్ట్ వ్యూస్ సాధించిన ఇండియన్ టీజర్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఇక టీజర్ తో సినిమాపై ఉన్న అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. ఈ టీజర్ కి అమేజింగ్ రెస్పాన్స్ రావడంతో మూవీ టీం ఆనందంలో మునిగితేలుతూ 'సలార్' ట్రైలర్ ని ఆగస్టులో రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా విడుదల చేసిన స్పెషల్ నోట్లో వెల్లడించింది.
ఈ మేరకు 'సలార్' నిర్మాణ సంస్థ స్పెషల్ నోట్లో పేర్కొంటూ.. " ప్రేక్షకులు చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. సలార్ టీజర్ సృష్టించిన ప్రభంజనంలో మీరంతా భాగస్వాములై మాపై మీరు చూపిన అపారమైన ప్రేమ, అభిమానం మరియు మద్దతుకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాము. భారతీయ సినిమా పరాక్రమానికి ఇది ఒక ప్రతీక. ఇండియన్ సినిమా 'సలార్' టీజర్ 100 మిలియన్ల వ్యూస్ ను సాధించి దూసుకెళ్తోంది. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ అచంచలమైన మద్దతు మా అభిరుచిని మరింత పెంచి అసామాన్యమైన సినిమాను మీకు అందించాలనే మా కోరిక మరింత బలపడింది. మీ క్యాలెండర్లో ఆగస్టు నెలను మార్క్ చేసి పెట్టుకోండి. భారతీయ సినిమా వైభవాన్ని చాటి చెప్పే అత్యంత ఆసక్తికరమైన ట్రైలర్ మీకోసం వస్తోంది. మీకు మరపురాని అనుభవాన్ని కలిగించే మరిన్ని అప్డేట్స్ కోసం సిద్ధంగా ఉండండి. మన ఇండియన్ సినిమా శక్తిని చాటి చెప్పే ఈ ఆనందకరమైన ప్రయాణాన్ని కలిసి కొనసాగిద్దాం" అని తెలుపుతూ #SALAARREVOLUTION, #100MILLIONVIEWS అనే హ్యాష్ ట్యాగ్స్ ని జోడించింది.
దీంతో సలార నిర్మాణ సంస్థ రిలీజ్ చేసిన ఈ స్పెషల్ నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని మాఫియా, గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ సరసన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలో శృతిహాసన్ 'ఆధ్య' అనే జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగంధూర్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మిస్తున్నారు. రవి బాస్రూర్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు, మలయాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ కుమార్ విలన్ పాత్రలు పోషిస్తున్నారు. ఇక రెండు భాగాలుగా 'సలార్' మూవీ రాబోతుందని తాజాగా విడుదల చేసిన టీజర్ లో స్పష్టం చేశారు మేకర్స్. 'సలార్' పార్ట్ -1 ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 28 న అత్యధిక థియేటర్స్ లో గ్రాండ్గా విడుదల కానుంది.
100 Million Views and we're feeling dino-mite!
— Salaar (@SalaarTheSaga) July 8, 2023
Thank you all for being part of this incredible milestone. Your support means the world to us 🙏🏻#SalaarTeaser100MViews#SalaarCeaseFire ▶️ https://t.co/AhH86b1cQS#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan… pic.twitter.com/QXOS6vscJi
Also Read : దుబాయ్ లో గ్రాండ్ గా సైమా 2023 వేడుకలు - ఎప్పుడంటే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial