![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Salaar Teaser Talk : ప్రభాస్ 'సలార్' - టీజర్‌తో రెండు విషయాల్లో క్లారిటీ!
'సలార్' టీజర్ విడుదలైంది. దీంతో రెండు విషయాల్లో ప్రభాస్ అభిమానులకు, 'కె.జి.యఫ్' వరల్డ్ & ప్రశాంత్ నీల్ అభిమానులకు రెండు విషయాల్లో క్లారిటీ వచ్చింది. ఆ రెండూ ఏమిటంటే?
![Salaar Teaser Talk : ప్రభాస్ 'సలార్' - టీజర్‌తో రెండు విషయాల్లో క్లారిటీ! Salaar makers gives clarity on Second part KGF 2 reference with teaser, Deets Inside Salaar Teaser Talk : ప్రభాస్ 'సలార్' - టీజర్‌తో రెండు విషయాల్లో క్లారిటీ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/06/a3090a274606ab6be59819b4b3856fea1688614803250313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'సలార్' ఒక్క సినిమాగా మాత్రమే ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేదంటే రెండు భాగాలుగా విడుదల చేస్తారా? ఈ ఉదయం వరకు ఉన్న ప్రేక్షకుల మదిలో ఉన్న సందేహం! ఆ ప్రశ్నలకు 'సలార్' టీజర్ (Salaar Teaser)తో క్లారిటీ ఇచ్చారు.
రెండు భాగాలుగా 'సలార్'
Salaar Movie Two Parts : 'సలార్' రెండు భాగాలుగా థియేటర్లలోకి రానుంది. ఈ రోజు విడుదల చేసిన టీజర్ చివరిలో 'పార్ట్ 1 : సీస్ ఫైర్' అని పేర్కొన్నారు. దాని అర్థం ఏమిటి? ఇంకో పార్ట్ ఉందని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ చేయాలని అనుకుంటే మూడో పార్ట్ కూడా చేయవచ్చు. ప్రస్తుతానికి అయితే రెండు పార్టులు ఉన్నాయని ఘంటాపథంగా చెప్పవచ్చు.
ఇది ప్రశాంత్ నీల్ యూనివర్స్...
'కె.జి.యఫ్'తో 'సలార్'కు లింక్!
'సలార్' సినిమా (Salaar Movie) మొదలైనప్పటి నుంచి ఓ మాట వినబడుతోంది. 'కె.జి.యఫ్'లో రాకీ భాయ్ పాత్రలో యశ్ కనిపించారు. బంగారు గనుల్లో బానిస బతుకులకు అలవాటు పడిన ప్రజల్లో జీవితంపై కొత్త ఆశలు కలిగించిన పాత్ర అది. రాకీ భాయ్ సైన్యంలో 'సలార్' (ఈశ్వరీ రావు) కుమారుడు చేరతాడు. అయితే... అధీరా (సంజయ్ దత్)ను ఎదుర్కొనే క్రమంలో 'సలార్' గాయపడినట్లు చూపిస్తారు. ఆ తర్వాత అతడు కనిపించడు. ఆ సలారే ప్రభాస్ అని టాక్. ఆ విషయంలో టీజర్ స్పష్టత ఇవ్వలేదు.
ప్రశాంత్ నీల్ ఎపిక్ యూనివర్స్ 'సలార్' అని టీజర్ విడుదల చేశాక... పేర్కొన్నారు. యూనివర్స్ అంటే... ఇంతకు ముందు ప్రశాంత్ నీల్ తీసిన 'కె.జి.యఫ్' కథతో ఈ 'సలార్' కథకు సంబంధం ఉంటుందని పరోక్షంగా చెప్పారు.
ఇంకో విషయంలో కూడా 'సలార్' టీజర్ ఓ క్లారిటీ ఇచ్చింది. సుమారు 400 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో సినిమా రూపొందుతోందని చిత్ర బృందం పేర్కొంది. అదీ సంగతి!
Also Read : గుడిలో విజయ్ దేవరకొండ, సమంత - 'ఖుషి' కోసం యాగం, వైరల్ వీడియో
కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్... 'మిర్చి'లో ప్రభాస్ చెప్పిన డైలాగ్. 'సలార్' టీజర్ చూసిన తర్వాత ఆ మాట మరోసారి గుర్తుకు వస్తుంది. మాఫియాకు బాస్, బడా గ్యాంగ్‌స్టర్ పాత్రకు ప్రభాస్ కంటే పర్ఫెక్ట్ ఎవరు ఉంటారు? కనీసం ఆయన ముఖం చూపించకపోయినా ఆ ఫైట్స్ ఎలా ఉంటాయో ఫ్యాన్స్, ఆడియన్స్ ఫీల్ అవుతున్నారంటే కారణం ఆయన కటౌట్. 'సలార్' టీజర్ స్టార్టింగులో... హీరోకి ఒక రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు. లయన్, చీతా, టైగర్, ఎలిఫాంట్ వెరీ డేంజరస్. అయితే... జురాసిక్ పార్క్ లో కాదు. ఎందుకంటే... ఆ పార్క్ లో సలార్ ఉన్నాడని అర్థం వచ్చేలా రెబల్ స్టార్ ప్రభాస్ ను చూపించారు. ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ యాక్షన్ టీజర్ అంతటా కనిపించింది. రెబల్ స్టార్ అభిమానులు కోరుకునే మాస్ యాక్షన్ సినిమా 'సలార్' అని, ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా కిక్ ఇస్తుందని చెప్పేలా టీజర్ వచ్చింది.
Also Read : మహేష్ బాబు మీద భారీ యాక్షన్ సీన్ - బీహెచ్ఈఎల్‌లో...
ప్రభాస్ జోడీగా శృతి హాసన్!
'సలార్' సినిమాలో శృతి హాసన్ కథానాయిక. ఆద్య పాత్రలో ఆమె కనిపిస్తారు. ఇందులో ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు నటిస్తున్నారు. వరదరాజ మన్నార్ పాత్రలో మలయాళ కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్, రాజ మన్నార్ పాత్రలో ప్రముఖ తెలుగు నటుడు జగపతి బాబు కనిపించనున్నారు. 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి, కన్నడ నటుడు మధు గురుస్వామి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 28న తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రాఫర్, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)