Saif Ali Khan: నా కుమారుడికి 'ఆదిపురుష్' చూపించి సారీ చెప్పా - క్లారిటీ ఇచ్చిన 'దేవర' విలన్
Adipurush: తన కుమారుడికి 'ఆదిపురుష్' సినిమా చూపించి సారీ చెప్పానన్న సైఫ్ అలీ ఖాన్ కామెంట్స్ వైరల్ కాగా తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో హీరోగా నటించనందుకే క్షమాపణ చెప్పానని అన్నారు.

Saif Ali Khan Clarifies About Recent Comments On Adipurush: తన కుమారుడు తైమూర్‌కు 'ఆదిపురుష్' (Adipurush) మూవీ చూపించి అతని ఎక్స్‌ప్రెషన్స్‌కు సారీ చెప్పానని.. ఇటీవల బాలీవుడ్ సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) అనడం వైరల్‌గా మారింది. దీనిపై ఆయన తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో హీరోగా నటించనందుకు మాత్రమే సారీ చెప్పానని అన్నారు.
విలన్‌గా నటించినందుకే..
తాను 'ఆదిపురుష్'లో (Adipurush) విలన్‌గా నటించానని.. కేకలు వేస్తూ అందరిపై యుద్ధం చేస్తూ ఉంటానని సైఫ్ చెప్పారు. 'ఈ సినిమా చూసి నా కుమారుడు ఈసారి ఇలాంటి సినిమాలో హీరోగా చేయాలని కోరాడు. దీంతో ఓకే చెప్పాను. ఇందులో విలన్‌గా నటించినందుకు మాత్రమే అతనికి సారీ చెప్పాను. నేను యాక్ట్ చేసిన అన్నీ సినిమాలను ఎలా గౌరవిస్తానో 'ఆదిపురుష్' కూడా అలానే చూస్తాను. మూవీస్ అన్నింటికీ నా సపోర్ట్ ఒకేలా ఉంటుంది.' అని చెప్పారు. దీంతో ఆయన సారీ కామెంట్స్‌పై వస్తోన్న రూమర్లకు ఫుల్ చెక్ పడినట్లయింది.
Also Read: కన్నీళ్లు పెట్టుకున్న బాలీవుడ్ యాక్టర్ కుమారుడు - మేమంతా పిచ్చోళ్లమా అంటూ 'బేబీ' డైరెక్టర్ రియాక్షన్
అసలేం జరిగిందంటే?
'నెట్ ఫ్లిక్స్' ఇండియా యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'మీ పిల్లలు మీ సినిమాలు చూస్తారా?' అని అడిగిన ప్రశ్నకు సైఫ్ స్పందించారు. తన కుమారుడు తైమూర్ గురించి మాట్లాడుతూ.. 'నేను మూవీస్‌లో ఎన్నో డిఫరెంట్ రోల్స్ చేస్తుంటాను. అవి చూసి నా కుమారుడు 'నువ్వు హీరోవా.. విలనా' అని అడిగాడు. 3 గంటల నిడివి ఉన్న ఆదిపురుష్ సినిమాను తైమూర్‌కు చూపించాను. అది చూసి వాడి నుంచి ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ లేవు. కాసేపటి తర్వాత నన్ను అదోలా చూశాడు. ఆ చూపుతోనే నాకు అర్థమైంది. వెంటనే నేను తైమూర్‌కు సారీ చెప్పాను. ఇట్స్ ఓకేలే అంటూ నన్ను క్షమించేశాడు.' అంటూ సైఫ్ చెప్పారు. ఈ కామెంట్స్ వైరల్ కాగా తాజాగా ఆయన వివరణ ఇచ్చారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'ఆదిపురుష్'. 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కృతిసనన్ జానకిగా.. సైఫ్ రావణుడిగా నటించారు. హేమమాలిని, సన్నీ సింగ్ కీలక పాత్రలు పోషించారు. ప్రభాస్ లుక్, వీఎఫ్ఎక్స్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ సాగింది. రావణుడిగా సైఫ్‌కు ముందు 5 తలలు, దానికి పైన 5 తలలు పెట్టడంపై విమర్శలు వచ్చాయి.
ఇక సినిమాల విషయానికొస్తే.. సైఫ్ అలీ ఖాన్ తాజాగా యాక్షన్ థ్రిల్లర్ 'జ్యుయెల్ థీఫ్' (Jewel Thief)లో నటించారు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో ఏప్రిల్ 25 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో జైదీప్ అహ్లావత్, కునాల్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన 'దేవర'లో విలన్‌గా నటించారు సైఫ్. ఈ సినిమాతో ఆయన టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'దేవర 2' సైతం రానుంది.





















