Sai Pallavi Weight: సాయి పల్లవి వెయిట్ తెలుసా? హీరోయిన్ ఎన్ని కిలోల బరువు ఉందో బయట పడింది
Sai Pallavi Weight 2025: సాధారణంగా హీరోయిన్స్ వెయిట్ ఎంత? అనేది రివీల్ చేయరు. కానీ సాయి పల్లవి మాత్రం తన బరువు ఎంతో వీడియోలో చూపించింది.

Sai Pallavi Height Weight: హీరోయిన్ సాయి పల్లవి హైట్ ఎంతో అందరికీ తెలుసు. ఆవిడ పబ్లిక్ మీటింగులు, ప్రెస్ మీట్‌లకు హాజరు అయ్యారు కనుక ఆమె హైట్ ఎంత? అనేది ఆడియన్స్ అందరికీ అర్థం అయ్యింది. మరి, సాయి పల్లవి బరువు ఎంత? ఎంత వెయిట్ ఉన్నారు? అనేది ఇప్పుడు రివీల్ అయ్యింది.
ఫోటోలకు క్లారిటీ ఇస్తే బరువు బయట పడింది!
రీసెంట్‌గా సాయి పల్లవి ఫేక్ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆవిడ బికినీ ధరించి ఫారిన్ కంట్రీలో షికారు చేసిందని సోషల్ మీడియాలో కొందరు గగ్గోలు పెట్టారు. హీరోయిన్లలో సాయి పల్లవికి మంచి ఇమేజ్ ఉంది. పద్ధతిగా ఉంటుందని పేరు ఉంది. అటువంటి సాయి పల్లవి ఎలా బికినీల్లో తిరుగుతుందో చూడమని కొంత మంది కామెంట్లు చేశారు. అసలు నిజం ఏమిటనేది అందరికీ తెలుసు.
ఫ్యామిలీతో కలిసి సాయి పల్లవి ఫారిన్ వెళ్ళింది. అక్కడ నుంచి ఆమె చెల్లెలు పూజా కణ్ణన్ ఫోటోలు షేర్ చేసింది. ఏఐ ద్వారా సాయి పల్లవి బికినీ ఫోటోలు జనరేట్ చేసిన కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ ఫేక్ ఫోటోలకు చెక్ పెట్టేలా ఒరిజినల్ ఫోటోలు, వీడియోలు విడుదల చేసింది సాయి పల్లవి. ఆ వీడియో చూస్తే ఆవిడ బరువు ఎంత అనేది బయట పడింది. సాయి పల్లవి 60.6 కిలోలు ఉన్నారు. అదీ సంగతి. ఫేక్ బికినీ ఫోటోలకు చెక్ పెట్టే క్రమంలో సాయి పల్లవి షేర్ చేసిన వీడియో వల్ల బరువు సంగతి అందరికీ తెలిసింది.
Also Read: ఏఐ ఫోటోలు కాదు... ఒరిజినల్స్ ఇవిగో, షాక్ ఇచ్చిన సాయి పల్లవి
View this post on Instagram
సినిమాల్లో మాత్రమే కాదు... నిజ జీవితంలో బయట కూడా సాయి పల్లవి చాలా పద్ధతిగా దుస్తులు ధరిస్తారు. ఆమె నటనతో పాటు వ్యక్తిత్వానికి సైతం ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆవిడ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'రామాయణ్'లో సీత పాత్రలో నటిస్తున్నారు. ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన మరో సినిమా చేస్తున్నారు.





















