అన్వేషించండి

Sai Pallavi: సీతగా సాయి పల్లవి, దట్‌ ఈజ్‌ నేచురల్‌ బ్యూటీ - అందరి హీరోయిన్‌లా కాదు.. సో స్పెషల్‌

Sai Pallavi as Ramayan Sita:నితీష్‌ రామాయణంలో సీతగా సాయి పల్లవి కన్‌ఫాం అయినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం.

Sai Pallavi official announcement on Ramayan This week: మైథలాజికల్‌ మూవీ అనగానే ఆడియన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ మొదలవుతాయి. ఇప్పటికే పౌరాణిక గాథలు ఎన్నో వచ్చినా ఎప్పటికప్పుడు వాటిపై కొత్తగా అంచనాలు మొదలవుతున్నాయి. ఇప్పుడు భారీ అంచాలతో రాబోతున్న మరో పౌరాణిక చిత్రం 'రామాయణ్'. రామాయణానికి సంబంధించిన గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఈసారి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ రామయణం రాబోతుంది. బాలీవుడ్‌ డైరెక్టర్‌ నితీష్‌ తివారి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన ఈ 'రామయణం' ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికీ దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా ఈ సినిమా వస్తుందనేది మాత్రం ఫిక్స్‌.

ఇందులో బాలీవుడ్ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌, నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవిలు లీడ్‌ పాత్రలు చేయబోతున్నారు. రేపు(ఏప్రిల్‌ 17) శ్రీరామ నవమి సందర్భంగా ఈ చిత్రంపై ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం, అప్‌డేట్స్‌ ప్రకారం నితీస్‌ రామయణ్‌లో సాయి పల్లవి సీతగా నటించబోతుంది. నిజానికి రామయణ్‌ లాంటి మైథలాజికల్‌ చిత్రాల్లో నటీనటుల ఎంపీకి అనేది చాలా ముఖ్యం. పవిత్ర దేవతల పాత్రల్లో నటించారు వారు ఆ పాత్రకు అర్హులై ఉండాలనేది హిందు ప్రేక్షకులు అభిప్రాయం. గతంలో సీతరాముడి పాత్రల్లో నటించే నటీనటుల విషయంలో వ్యతిరేకతలు కూడా వచ్చాయి.

సాయి పల్లవి.. వారిలా కాదు

ఓంరౌత్‌ 'ఆదిపురుష్‌' సినిమాలో కృతి సనన్ ను సీతగా ప్రకటించగానే చాలామంది దీన్ని వ్యతిరేకించారు. వెండితెరపై గ్లామరస్‌ పాత్రలు చేసిన ఆమె సీత పాత్రకు అర్హురాలు కాదంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ, సాయి పల్లవి విషయంలో ఇప్పటి వరకు ఒక్క నెగిటివి టాక్‌ కూడా వినిపించలేదు. 'రామాయం'లో సీత పాత్రకు సాయి పల్లవి పేరు  వినగానే అంతా నితీష్‌ నిర్ణయాన్ని స్వాగతించినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సాయి పల్లవిపై రోల్స్‌ విషయంలో ఎలాంటి నెగిటివిటీ లేదు. తెరపై కూడా ఆమె ఎప్పుడు గ్లామర్‌ షో కానీ, గ్లామరస్‌ రోల్స్‌ చేయలేదు. మితిమిరిన పాత్రల్లోనూ కనిపించలేదు. పైగా డ్రెస్సింగ్‌, పాత్ర విషయంలో తనకంటూ ఓ కండిషన్‌ పెట్టుకుంది. గ్లామర్‌ షో అంటే నో చెబుతూనే వచ్చింది. అలాంటి సాయి పల్లవి సీత పాత్ర చేయడం సరైనా నిర్ణయం అంటూ నెటిజన్లు, మూవీ లవర్స్ నుంచి అభిప్రాయాలు వస్తున్నాయి. తెరపైనే కాదు బయట కూడా సాయి పల్లవి చాలా పద్దతిగా ఉంటుంది. ఇంకా మేకప్‌ కూడా పెద్దగా యూజ్‌ చేయదు.

సాయి పల్లవే పర్పెక్ట్ ఛాయిస్

అందుకే ఆమెకు నేచురల్‌ బ్యూటీ అనే పేరు కూడా ఉంది. ఈ విషయంలో ఆమె ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీ అవుతున్నారు. దట్‌ ఈజ్‌ సాయి పల్లవి అంటూ ఆమె ఫ్యాన్స్‌ అంతా కాలర్‌ ఎగిరేస్తున్నారు. సీత ఎంపికలో నితీష్‌ తివారి చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, ఫైనల్‌గా సరైన నటిని రామయణ్‌కి ఎంచుకున్నారంటూ అంతా ఆయనను ప్రశంసిస్తున్నారు. రామాయణంలో సీతకు నేటి హీరోయిన్లలో సాయి పల్లవి తప్ప ఎవరూ అర్హుల కాదంటున్నారు. అలా సాయి పల్లవి  ప్రత్యేకమైన నటి అని మరోసారి ప్రూవ్‌ అయ్యింది. కాగా దర్శకుడు నితీష్ తివారి రామాయణంను మూడు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. ఇక ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్ నటిస్తుండగా.. రావణుడి పాత్రకు కన్నడ రాక్‌ స్టార్‌ యష్‌ పేరు వినిపించింది. అయితే లేటెస్ట్‌ అప్‌డేట్‌ ప్రకారం యష్‌ ఈ చిత్రం నిర్మాతల్లో ఒకరిన తేలింది. కానీ, యష్‌ ఈ రామయణంకు నిర్మాతగాను వ్యవహరిస్తూనే రావణుడిగా నటిస్తున్నాడని ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌.

Also Read: కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ - ఏపీ, తెలంగాణలో నయా రికార్డ్స్, ప్రభాస్ డబుల్ సెంచరీ కొడతాడా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Embed widget