అన్వేషించండి

Sai Dharam Tej: ఏటీఎం ద‌గ్గ‌ర కూర్చుని ఏడ్చేశా, అప్పుడే అమ్మ ప్రేమ అర్థ‌మైంది: సాయి ధ‌ర‌మ్ తేజ్

Sai Dharam Tej: సాయి ధ‌ర‌మ్ తేజ్ మెగా కాంపౌండ్ నుంచి వ‌చ్చిన హీరో. అలాంటిది ఆయ‌న కూడా డ‌బ్బుల‌కు ఇబ్బంది ప‌డ్డాడ‌ట‌. ఆ విష‌యాల‌న్నీ 'నిఖిల్ తో నాట‌కాలు పాడ్ కాస్ట్' లో పంచుకున్నాడు.

Sai Dharam Tej About His Financial Status: సాయి ధ‌ర‌మ్ తేజ్ మెగా కాంపౌండ్ నుంచి వ‌చ్చిన హీరో. చేసింది కొన్ని సినిమాలే అయినా ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు ఆయ‌న‌. ఇక ఇప్పుడు సంపత్ నందితో కలిసి ‘గాంజా శంకర్’ అనే మూవీ చేస్తున్నాడు. అయితే,  య్యూట్యూబ‌ర్, సోష‌ల్ మీడియా ఇన్ ఫ్లూయ‌న్స‌ర్ నిఖిల్ తో క‌లిసి చేసిన పాడ్ కాస్ట్ లో ఆయ‌న చాలా విష‌యాలు పంచుకున్నాడు. త‌ను ప‌డ్డ క‌ష్టాలు చెప్పాడు. ఏటీఎం ద‌గ్గ‌ర ఏడ్చేశాను అని అన్నాడు. అమ్మ గొప్ప‌త‌నం లాంటి ఎన్నో విష‌యాలు పంచుకున్నాడు. 

ఏటీఎం ద‌గ్గ‌ర ఏడ్చేశాను.. 

నిఖిల్ చేసి పాడ్ కాస్ట్ లో పాల్గొన్న సాయి ధ‌ర‌మ్ తేజ్ ఎన్నో విష‌యాలు చెప్పారు. దాంట్లో.. "ప్ర‌తి మ‌నిషి జీవితంలో ఏదో ఒక పాయింట్ లో అన్నీ కొలాప్స్ అయిపోతాయి, మ‌న సామ్రాజ్యం మొత్తం కూలిపోతుంది అలా ఎప్పుడైనా జ‌రిగిందా?" అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పారు సాయి ధ‌ర‌మ్ తేజ్. "2009 అప్పుడే యాక్టింగ్ ఫీల్డ్ లోకి వ‌స్తున్నాను. 2010లో యాక్టింగ్ కోర్సు అయిపోయి వ‌చ్చాను. 2011-12లో ‘రేస్’ సినిమా ఓపెన్ అయిపోయింది. ఫైనాన్సియ‌ల్ గా చాలా లోగా ఉన్నాను. మీటింగ్ కి వెళ్లాలి. డ‌బ్బులు లేవు. కారులో డీజిల్ కొట్టించాలి. అప్ప‌ట్లో ప్రిపెయిడ్ ఫోన్ దాంట్లో బ్యాలెన్స్ లేదు. పెట్రోల్ కొట్టించాలంటే రూ.500 కావాలి. రూ.450 పెట్రోల్ కొట్టించాలి. రూ.50 తో రీఛార్జ్ చేయించుకోవాలి అనుకున్నాను. పెట్రోల్ కొట్టించాను. రూ.50 డ్రా చేయ‌లేం. మినిమ‌మ్ ఉండాలి. ఎలాగో ట్రై చేశాను. బ్యాలెన్స్ చూస్తే రూ. ల‌క్ష నుంచి రూ.రెండు ల‌క్ష‌లు ఉన్నాయి. అర్థంకాలేదు. వెంట‌నే అమ్మ‌కి ఫోన్ చేశాను. "రాత్రి నువ్వు అన్నావు క‌దా డ‌బ్బులు లేవ‌ని, అందుకే వేశాను. ఈ నెల గ‌డిచిపోతుంది క‌దా" అన్నారు. ఏటిఎం నుంచి బ‌య‌టికి వ‌చ్చి ఏడ్చేశాను. అది అమ్మ ప‌వ‌ర్ అంటే. ఎప్పుడు ఏం ఇవ్వాలో అమ్మ‌కి క‌చ్చితంగా తెలుస్తుంది. అదే అమ్మ గొప్ప‌త‌నం అని  చెప్పాడు సాయిధ‌ర‌మ్ తేజ్.

యాక్సిడెంట్ తర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ తో న‌టించిన 'బ్రో' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు సాయి ధ‌ర‌మ్ తేజ్. ఇక ప్ర‌స్తుతం సాయి ధ‌ర‌మ్ తేజ్, సంప‌త్ నంది కాంబినేష‌న్ లో ‘గాంజా శంక‌ర్’తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ లుక్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్ర‌స్తుతం ఈ సినిమా టైటిల్ పై వివాదం న‌డుస్తోంది. సినిమా టైటిల్ మార్చాల‌ని మూవీ టీమ్ కి నోటీసులు పంపారు. ఇక ఈ సినిమాని నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తుండ‌గా.. పూజా హెగ్డే ఈ సినిమాలో సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. 

ఇక ఈ సినిమాకి సంబంధించి సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్రీ లుక్ ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఆ లుక్కులో హీరో మెడ మీద త్రిశూలం, దాని కింద డమరుకం టాటూ ఉంది. అలాగే, చెవికి పోగు కూడా ఉంది. సినిమాలో గంజాయి అమ్మే యువకుడిగా హీరో పాత్ర ఉంటుందని ఫిల్మ్ నగర్ లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అందుకని, ఆ టైటిల్ అని సమాచారం. తెలుగు ప్రేక్షకులకు మాంచి థ్రిల్, యాక్షన్, ఎమోషన్స్ ఇచ్చే కథను సంపత్ నంది రెడీ చేశారట. 

Also Read: నా భర్త నాతో ఉండడు - పాపం వంటలక్కకి రియల్‌ లైఫ్‌లో కూడా కష్టాలే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Australia vs India 1st Test : టీమిండియా గ్రేట్‌ కమ్‌ బ్యాక్‌ - ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులో గ్రాండ్ విక్టరీ
టీమిండియా గ్రేట్‌ కమ్‌ బ్యాక్‌ - ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులో గ్రాండ్ విక్టరీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Australia vs India 1st Test : టీమిండియా గ్రేట్‌ కమ్‌ బ్యాక్‌ - ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులో గ్రాండ్ విక్టరీ
టీమిండియా గ్రేట్‌ కమ్‌ బ్యాక్‌ - ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులో గ్రాండ్ విక్టరీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Embed widget