RGV - Sagileti Katha : మునుపేరుగని మాయే జరిగినదే - వర్మ డెన్‌లో రవితేజ సినిమా పాట విడుదల
Sagileti Katha Movie Updates : నవదీప్ సి స్పేస్ సమర్పణలో యూట్యూబర్ రవితేజ మహాదాస్యం హీరోగా రూపొందిన సినిమా 'సగిలేటి కథ'. ఇందులో ఓ పాటను రామ్ గోపాల్ వర్మ డెన్‌లో విడుదల చేశారు.
యూట్యూబర్ రవితేజ మహాదాస్యం (Ravi Teja Mahadasyam) హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'సగిలేటి కథ' (Sagileti Katha Movie). ఇందులో విషిక కోట కథానాయిక. రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించడంతో పాటు రచన, కూర్పు, ఛాయాగ్రహణం బాధ్యతలు నిర్వర్తించారు. హీరో నవదీప్ సి స్పేస్ సమర్పణలో అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రమిది. అశోక్ మిట్టపల్లి, దేవి ప్రసాద్ బలివాడ నిర్మాతలు. ఈ సినిమాలో 'ఏదో జరిగినే...' పాటను రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు.
'ఏదో జరిగే... ఏదో జరిగే...
మునుపేరుగని మాయే జరిగినదే
ఏంటో తెలిసే... ఏంటో తెలిసే...
నీపైన ప్రేమే తెలిసినదే!''
అంటూ సాగిన ఈ గీతాన్ని పవన్ కుందని, రాజశేఖర్ సుద్మూన్ రాశారు. కీర్తనా శేష్, కనకవ్వ ఆలపించారు. ఈ చిత్రానికి జశ్వంత్ పసుపులేటి సంగీత దర్శకుడు.
'ఏదో జరిగే...' పాటను విడుదల చేసిన అనంతరం రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ''సగిలేటి కథ' ట్రైలర్ చూశాక... చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. అద్భుతంగా పాడటంతో పాటు లిరికల్ వీడియోలో ఆడిపాడి కవ్వించిన కీర్తనా శేష్ (Keertana Sesh)కు ఆల్ ది బెస్ట్. సినిమాను విజయవంతంగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న దర్శకుడు రాజశేఖర్ సుద్మూన్, నిర్మాతలకు కూడా! ఈ సినిమా సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది'' అని చెప్పారు.
Also Read : స్ట్రాంగ్‌గా ఉండాలనుకున్నా కానీ - వెక్కివెక్కి ఏడ్చిన అనసూయ
నిర్మాత దేవి ప్రసాద్ బలివాడ మాట్లాడుతూ ''నేను పుట్టిన సంవత్సరం, రామ్ గోపాల్ వర్మ గారు సినిమాల్లో వచ్చిన సంవత్సరం ఒక్కటే. నాకు రెండేళ్ళ వయసు ఉన్నప్పుడు ఆయన 'శివ' చిత్రానికి దర్శకత్వం వహించారు. నాకు ఊహ తెలియని వయసులో ఆ సినిమా చూసి డైలాగ్స్ చెప్పా. అప్పట్నుంచి మా పేరెంట్స్ నన్ను ముద్దుగా 'శివ' అని పిలిచేవారు. నాకు తెలియకుండానే ఆర్జీవీ గారు నా చిన్నప్పటి నుంచి నన్ను ప్రభావితం చేస్తూ వస్తున్నారు. నేను సినిమాల్లోకి రావడానికి ఒక బీజం నాటారు. నేను నిర్మించిన 'కనుబడుటలేదు' నుంచి ఈ 'సగిలేటి కథ' వరకు ప్రత్యేక్షంగా, పరోక్షంగా మా చిత్రాలకు ఆయన సహాయం చేస్తున్నారు'' అని చెప్పారు.
Also Read : అత్తారింట అల్లు అర్జున్‌కు గ్రాండ్ వెల్కమ్ - మామగారి ఫంక్షన్ హాల్ ఓపెనింగ్‌లో...
'ఏదో జరిగే...' పాటను విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మకు చిత్ర బృందం థాంక్స్ చెప్పింది. 'సగిలేటి కథ' ట్రైలర్ చూస్తే... రాయలసీమ సంస్కృతి, ఆచార వ్యవహారాల నేపథ్యంలో తెరకెక్కినట్లు అర్థమవుతోంది. 'కనబడుటలేదు' తర్వాత షేడ్ స్టూడియోస్ సంస్థ నుంచి వస్తున్న చిత్రమిది. ఆ సినిమాలో ఎలా అయితే కొత్త నటీనటులకు అవకాశం ఇచ్చారో... ఈ సినిమాలోనూ అదే విధంగా కొత్త తారలకు అవకాశం ఇచ్చారు. గ్రామీణ నేపథ్యంలో వచ్చే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని షేడ్ స్టూడియోస్ సంస్థ తెలిపింది.
'సగిలేటి కథ' సినిమాలో రవితేజ మహాదాస్యం, విషిక కోట జంటగా నటించిన ఈ చిత్రానికి రచన, కూర్పు, ఛాయాగ్రహణం, దర్శకత్వం బాధ్యతలు రాజశేఖర్ సుద్ మూన్ చూసుకున్నారు. అశోక్ మిట్టపల్లి, దేవి ప్రసాద్ బలివాడ నిర్మించారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత : నరేష్ బాబు మాదినేని, స్వరాలు : జశ్వంత్ పసుపులేటి, నేపథ్య సంగీతం సనల్ వాసుదేవ్, సాహిత్యం : వరికుప్పల యాదగిరి, రాజశేఖర్ సుద్మూన్, శశికాంత్ బిల్లపాటి, పవన్ కుందని.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial