RRR Funny Video: ఫన్నీ వీడియో, వైన్ షాప్‌లో RRR - వాటర్, క్వార్టర్, లైటర్, ఇది చూస్తే జక్కన్న ఏమైపోతారో!
RRRలో నీరు, నిప్పును ఇలా వాడేస్తారని మీరు ఎప్పుడైనా ఊహించి ఉంటారా? అయితే, మీరు ఈ వీడియోను తప్పకుండా చూడాల్సిందే.
RRR in Wine Shop | రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR చిత్రం మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమ సత్తాను చాటిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై ఇప్పటికే అనేక మీమ్స్, జోక్స్, ట్రోల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై చిత్ర యూనిట్ కూడా పాజిటివ్‌గానే స్పందిస్తోంది. తాజాగా ఇంటర్నెట్‌లో మరో వీడియో జోరుగా షికారు చేస్తోంది. అదే ‘wateR, QuarteR, LighteR’.
వీడియో విషయానికి వస్తే.. ఓ మందుబాబు బార్‌కు వెళ్తాడు. అయితే, అక్కడ అతడికి మందులో కలుపుకోడానికి నీళ్లు దొరకవు. అదే సమయంలో మరో మందుబాబు సిగరెట్ కాల్చడానికి ప్రయత్నిస్తాడు. కానీ, అతడికి లైటర్ దొరకదు. దీంతో ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. మొదటి మందుబాబు వద్ద లైటర్ ఉంటుంది. రెండో మందుబాబు వద్ద వాటర్ ఉంటుంది. RRR సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ పలకరించుకున్నట్లుగా చేతులు ఊపుతారు. మొదటి మందుబాబుకు మందులోకి నీళ్లు దొరుకుతాయి. రెండో మందుబాబుకు సిగరెట్ కాల్చేందుకు నిప్పు దొరుకుతుంది. అలా వారి దోస్తీ మొదలవుతుంది.
Also Read: చిరంజీవి హీరోయిన్‌కు టోకరా, నాలుగు కోట్లు కొట్టేసిన కేటుగాడు!
ఈ ఫన్నీ వీడియోను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ పోస్ట్ చేశాడు. ‘బాహుబలి’తోపాటు ‘RRR’ సినిమాకు ఈయనే సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ వీడియోను చూసిన తర్వాత ఆయన షేర్ చేయకుండా ఉండలేకపోయారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియో చూసేయండి మరి.
Also Read: పునర్నవి కావాలని చేసిందా? పొరపాటు జరిగిందా?
#RRR Wine Shop.....😂😅🤣😂😅🤣😂😅🤣😂 https://t.co/K1BR3Tu5wJ
— KK Senthil Kumar ISC (@DOPSenthilKumar) April 1, 2022
Whatever appricate their work 😆
— san (@Santoshgp46) April 1, 2022
— Srikar (@Srikarponnada) April 1, 2022
రేయ్ ఏందిరా ఇది నేనెప్పుడూ చూడలేదు....😀 @RRRMovie
— ప్రసాద్ రెడ్డి (@reddy4all) April 1, 2022
wateR, quarteR, fiRe🤣🤣🤣
— Anonymous_Indian🇮🇳 (@AnonymousSALAAR) April 1, 2022
🤣🤣🤣😄😄😄😄 Show this video to Rajagaru 😆😆
— Arjun Vikshya 🐎🏹💧🔥 (@Arjunnn_i) April 1, 2022