By: ABP Desam | Updated at : 31 Mar 2022 03:38 PM (IST)
రిమీ సేన్
Actress Rimi Sen Gets Cheated Of Over ₹ 4 Crore: మెగాస్టార్ చిరంజీవి సరసన 'అందరివాడు'లో ఓ కథానాయికగా నటించిన రిమీ సేన్ గుర్తు ఉన్నారా? ఆమెకు ఒకరు టోకరా వేశారు. వ్యాపారంలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని ఆశ చూపించడంతో 30 నుంచి 40 శాతం వడ్డీ ఇస్తానని చెప్పి న ఓ వ్యాపారవేత్త 4.14 కోట్ల రూపాయలు కొట్టేశారట. దాంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారామె. అసలు వివరాల్లోకి వెళితే...
ముంబైలోని ఖర్ (వెస్ట్) పోలీస్ స్టేషన్ లో మార్చి 29న రిమీ సేన్ ఓ కంప్లైంట్ చేశారు. అందులో తన అసలు పేరు శుభ మిత్ర సేన్ అని పేర్కొన్నారు. "నాకు 2019లో రౌనక్ జతిన్ వ్యాస్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. మా మధ్య స్నేహం పెరిగింది. తన కుటుంబం కొత్తగా స్టార్ట్ చేస్తున్న ఫోమింగో బీవరేజెస్ కంపెనీలో పెట్టుబడి పెడితే... 30 నుంచి 40 శాతం వడ్డీ ఇస్తానని చెప్పాడు. డబ్బులు ఇచ్చిన కొన్ని రోజులకు అతడు ఎటువంటి కంపెనీ స్టార్ట్ చేయడం లేదని తెలిసింది" అని రిమీ సేన్ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. తనను మోసం చేసిన రౌనక్ జతిన్ వ్యాస్ మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
Also Read: ఓలా క్యాబ్ ఎక్కిన హీరోయిన్, ఏసీ ఆపేసిన డ్రైవర్
Mumbai | Bollywood actress Rimi Sen has filed a police complaint against a Goregaon-based businessman named Raunak Jatin Vyas for allegedly duping her of Rs 4.14 cr in the name of investment. Case registered under IPC sections 420 & 409. Search on to nab the accused: Khar Police
— ANI (@ANI) March 31, 2022
'అందరివాడు' సినిమా తర్వాత తెలుగులో ఆమె మరో సినిమా చేయలేదు. కానీ, పదేళ్ల క్రితం వరకూ హిందీలో సినిమాలు చేశారు. 2011 తర్వాత రిమీ సేన్ నటనకు దూరంగా ఉన్నారు. అయితే... 2016లో 'బుధియా సింగ్ - బోర్న్ టు రన్' సినిమాతో నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హిందీలో సూపర్ హిట్ సినిమా 'ధూమ్', 'ధూమ్ 2', కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన ఓ కథానాయికగా 'క్యూంకీ' సహా డజనుకు పైగా సినిమాల్లో రిమీ సేన్ నటించారు.
Also Read: సన్నీ లియోన్‌తో ఇటువంటి చిత్రమా?
The Gray Man Trailer - ‘ది గ్రే మ్యాన్’ ట్రైలర్: హాలీవుడ్ మూవీలో ధనుష్, మెరుపు తీగలా మాయమయ్యాడంటూ ట్రోల్స్!
Rashmika Mandanna: రష్మికకు అదొక సెంటిమెంట్ - ఆమె ఎప్పుడు బెంగళూరు వెళ్ళినా షెడ్యూల్లో అది కామన్
Mahesh Babu Trivikram Movie Update: మహేష్ బాబు సినిమాకూ త్రివిక్రమ్ 'అ' సెంటిమెంట్‌తో వెళతారా?
Chiranjeevi - Mega 154 Story: విశాఖ నుంచి మలేషియాకు - మెగాస్టార్ 154 కథలో అసలు ట్విస్ట్ అదేనా!?
Venkatesh New Movie: 'ఎఫ్ 3' తర్వాత ఏంటి? దర్శకులను ఫైనలైజ్ చేసే పనిలో పడ్డ వెంకటేష్
Hyderabad: రేపు Hydకి ప్రధాని మోదీ, ఈ రూట్లో ట్రాఫిక్ అనుమతించరు! ప్రత్యామ్నాయ మార్గాలు ఇవీ
Amalapuram: ఇది ఆంధ్రానా? పాకిస్థానా? అంబేడ్కర్‌పై అంత ప్రేమ ఉంటే నవరత్నాలకు పెట్టుకోండి: జీవీఎల్
Karimnagar: టెన్త్ ఎగ్జామ్స్‌కి ఫుల్లుగా తాగొచ్చిన టీచర్, తూలుతూనే ఇన్విజిలేషన్ - బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో రీడింగ్ చూసి అంతా షాక్!
In Pics: పోలీసుల చేతుల్లోకి అమలాపురం, అడుగడుగునా ఖాకీల మోహరింపు - ఫోటోలు