Quotation Gang First Look: సన్నీ లియోన్‌తో ఇటువంటి చిత్రమా?
Sunny Leone, Priyamani, Jackie Shroff - Quotation Gang Movie First Looks: సన్నీ లియోన్, ప్రియమణి, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'కొటేషన్ గ్యాంగ్'లో మెయిన్ లీడ్స్ ఫస్ట్ లుక్స్ విడుదల చేశారు.

సన్నీ లియోన్ అంటే సెక్సీ లేడీ. ఫర్ ద ఫస్ట్ టైమ్... తన ఇమేజ్‌కు భిన్నమైన రోల్ ఆమె చేస్తున్నట్టు ఉన్నారు. ఆమెతో ఇటువంటి చిత్రమా? అని ప్రేక్షక లోకం అంతా ఆశ్చర్యపోయేలా సినిమా తీస్తున్నది తమిళ దర్శకుడు వివేక్ కుమార్ కణ్ణన్. సన్నీ లియోన్‌ను పూర్తిగా డీ - గ్లామర్ రోల్‌లో చూపిస్తూ... ఆయన తీస్తున్నారు. ఇంతకీ, ఈ సినిమా టైటిల్ ఏంటో తెలుసా? 'కొటేషన్ గ్యాంగ్'. ఇందులో సన్నీ లియోన్‌తో పాటు ప్రియమణి, జాకీ ష్రాఫ్, సారా ఇతర ప్రధాన తారాగణం.
'కొటేషన్ గ్యాంగ్' ఫస్ట్ లుక్స్ విడుదల చేశారు. సన్నీ లియోన్ ఫస్ట్ లుక్ షాక్ ఇస్తే... ప్రియమణి ఫస్ట్ లుక్ డబుల్ షాక్ ఇచ్చింది. ఒక కన్ను లేకుండా, ముఖం మీద గాయాలతో, రక్తం కారుతుంటే... ప్రియమణి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ గగుర్పాటుకు గురి చేసేలా ఉంది. సినిమాలో ఆమె కాంట్రాక్ట్ కిల్లర్ పాత్రలో కనిపించనున్నారు. సన్నీ లియోన్, ఇతర తారాగణం కూడా కిల్లర్ రోల్స్ చేస్తున్నారు.
Also Read: పునీత్ చివరి సినిమా 'జేమ్స్' ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
కేరళలోని ఓ ముఠా స్ఫూర్తితో 'కొటేషన్ గ్యాంగ్' తెరకెక్కించినట్టు టాక్. కొంత మంది ఒక ముఠాగా ఏర్పడి చాలా తక్కువ అమౌంట్ కోసం హత్యలు చేసిన ఉదంతం ఒక సమయంలో కలకలం సృష్టించింది. ఆ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. అరుణ్ విజయ్ హీరోగా 'బాక్సర్' తర్వాత దర్శకుడు వివేక్ తీసిన చిత్రమిది.
Also Read: నన్ను డామినేట్ చేస్తే ఊరుకోను - తాప్సీపై చిరు కామెంట్స్
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
Before You Go
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
ట్రెండింగ్ వార్తలు






















