Puneeth Rajkumar: పునీత్ చివరి సినిమా 'జేమ్స్' ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
Puneeth Rajkumar's James Movie OTT Release Date: దివంగత పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన చివరి సినిమా 'జేమ్స్' త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. ఈ సినిమా డిజిటల్ తెరపైకి వచ్చేది ఎప్పుడంటే?

James Movie On SonyLive: కన్నడ కథానాయకుడు, దివంగత పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) నటించిన చివరి సినిమా 'జేమ్స్'. త్వరలో ఈ సినిమా డిజిటల్ తెరపైకి రానుంది. ఓ ఆర్మీ అధికారి, దేశంలో డ్రగ్ మాఫియాను ఎలా అంతం చేశాడనే కథతో రూపొందిన చిత్రమిది. ఆర్మీ అధికారిగా, బాడీ గార్డుగా... రెండు షేడ్స్ ఉన్న పాత్రలో పునీత్ నటించారు. కన్నడ ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన అందుకుంది. మిగతా భాషల్లో స్పందన కూడా పర్వాలేదు. ఇప్పుడీ సినిమా డిజిటల్ రైట్స్ సోనీ లివ్ ఓటీటీ (James On SonyLIV) దక్కించుకుంది.
కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 'జేమ్స్' సినిమా మార్చి 17న విడుదల అయ్యింది. విడుదలైన 29 రోజులకు ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యేలా డీల్ కుదిరింది. ఏప్రిల్ 14న (James Movie OTT Release Date) సోనీ లివ్ ఓటీటీలో ఐదు భాషల్లో విడుదల కానుంది.
Also Read: నన్ను డామినేట్ చేస్తే ఊరుకోను - తాప్సీపై చిరు కామెంట్స్
Also Read: సల్మాన్ ఖాన్ బాలీవుడ్ కామాంధుడా? కాంట్రవర్సీలోకి ఐశ్వర్యా రాయ్‌ను లాగే ప్రయత్నం ఏమిటి?
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

