Ola Cab - Bad Experience: ఓలా క్యాబ్ ఎక్కిన హీరోయిన్, ఏసీ ఆపేసిన డ్రైవర్

హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ఓలా క్యాబ్ లో ప్రయాణం చేశారు. అప్పుడు తనకు ఎదురైన పరిస్థితిని ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.

FOLLOW US: 

Shraddha Srinath: కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్ ఉన్నారు కదా! 'జెర్సీ'లో నానికి జంటగా నటించారు. రీసెంట్‌గా ఆమె ఓలా క్యాబ్‌లో జర్నీ చేశారు. సాధారణంగా కొంత మంది హీరోయిన్లు క్యాబ్ జర్నీ చేస్తారు. అయితే... శ్రద్ధా శ్రీనాథ్‌కు ఓలా జర్నీలో వింత అనుభవం ఎదురు అయ్యింది. ఆమె అలా క్యాబ్ ఎక్కారు. కానీ, ఏసీ ఆన్‌లో లేదు. ఆఫ్‌లో ఉందని గమనించిన శ్రద్ధా శ్రీనాథ్... ఆన్ చేయమని అడిగితే చేయడానికి డ్రైవర్ నిరాకరించాడని ఆమె తెలిపారు.

"పెట్రోల్ / డీజిల్ రేట్లు పెరగడం వల్ల నా క్యాబ్ డ్రైవర్ ఏసీ ఆన్ చేయడానికి నిరాకరించాడు.  కొంత డబ్బు అయినా ఆదా చేయాలని అనుకుంటున్న డ్రైవర్ ను నేను నిందించడం లేదు. ఓలా క్యాబ్ వాళ్ళ సంపాదనను దోచుకుంటోంది" అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో శ్రద్ధా శ్రీనాథ్ పోస్ట్ చేశారు. అంతకు ముందు ఎయిర్ పోర్ట్‌లో ఎదురైన వింత అనుభవాన్ని కూడా ఆమె నెటిజన్స్‌తో షేర్ చేసుకున్నారు.

ఎయిర్ పోర్ట్‌లో శ్రద్దా శ్రీనాథ్‌ను చూసిన ఒక మహిళ 'జెర్సీ'లో హీరోయిన్ అని గుర్తు పట్టారట. అయితే... ఆమె పేరు ఆమెకు గుర్తు లేదట. దాంతో శ్రద్ధా దాస్ అనడంతో  అవాక్కవడం శ్రద్ధా శ్రీనాథ్ వంతు అయ్యింది. "ఎయిర్ ఇండియా చెక్ ఇన్ కౌంటర్ దగ్గర ఒక మహిళ నన్ను చూసి గుర్తు పట్టారు. కానీ, నా పేరు పలకలేకపోయారు. ఆవిడతో 'శ్రద్ధా' అని చెప్పాను. 'అవును. శ్రద్ధా! శ్రద్ధా దాస్' అని అనడంతో 'కాదు. ఆమె (శ్రద్ధా దాస్) వేరే నటి. నేను శ్రద్ధా శ్రీనాథ్' అని చెప్పాను. అప్పుడు 'ఎస్. ఆఫ్ కోర్స్. నిన్ను ఎలా మరిచిపోగలను' అన్నారు. ఓకే. కూల్" అని శ్రద్ధా శ్రీనాథ్ పోస్ట్ చేశారు.  ఇంకొక ప్యాసింజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో తనను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేయమని ఇబ్బంది పెట్టారట. 

Also Read: ఓటీటీలో విడుదలకు సూర్య 'ఈటి - ఎవరికీ తలవంచడు' రెడీ - స్ట్రీమింగ్ ఎప్పట్నించి అంటే?

ప్రస్తుతం రెండు కన్నడ సినిమాల్లో శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు. ఓ తెలుగు సినిమా కూడా చేస్తున్నారు. ఆ సినిమాకు ఆమె తెలుగులో డబ్బింగ్ చెప్పారు. "ఇక నుంచి తెలుగులో నేను నటించే సినిమాల్లో నా గొంతు వినడానికి రెడీగా ఉండండి" అని శ్రద్ధా శ్రీనాథ్ తెలిపారు. 'జెర్సీ' తర్వాత 'కృష్ణ అండ్ హిజ్ లీల' సినిమా తెలుగులో శ్రద్ధా శ్రీనాథ్ కు మంచి పేరు తెచ్చింది. 

Also Read: సమంత చెప్పింది విన్నారా? ఆమెకు కేక్ తినిపిస్తున్న నయన్! ఎందుకంటే?

Published at : 31 Mar 2022 02:46 PM (IST) Tags: Shraddha Srinath Ola Cab Ola Driver Turned Off AC Ola Driver Wired Things Shraddha Srinath Blames OLA Shraddha Srinath Ola Experience

సంబంధిత కథనాలు

Brahmastra: 'బ్రహ్మాస్త్ర' సాంగ్ - ప్రోమో రిలీజ్ చేసిన రాజమౌళి

Brahmastra: 'బ్రహ్మాస్త్ర' సాంగ్ - ప్రోమో రిలీజ్ చేసిన రాజమౌళి

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Nayanthara Wedding Date: నయనతార, విఘ్నేష్ ల పెళ్లి డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

Nayanthara Wedding Date: నయనతార, విఘ్నేష్ ల పెళ్లి డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

Ashoka Vanamlo Arjuna Kalyanam: 'అశోకవనంలో అర్జున కళ్యాణం' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Ashoka Vanamlo Arjuna Kalyanam: 'అశోకవనంలో అర్జున కళ్యాణం' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Bigg Boss Sunny New Movie: 'సన్నాఫ్ ఇండియా' దర్శకుడితో 'బిగ్ బాస్' విన్నర్ సన్నీ హీరోగా సినిమా

Bigg Boss Sunny New Movie: 'సన్నాఫ్ ఇండియా' దర్శకుడితో 'బిగ్ బాస్' విన్నర్ సన్నీ హీరోగా సినిమా

టాప్ స్టోరీస్

Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 28th May 2022:  ఈ రాశులవారు తమ పనిని  పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!