By: ABP Desam | Updated at : 24 Mar 2022 01:45 PM (IST)
రామ్ చరణ్, ఎన్టీఆర్, విజయేంద్ర ప్రసాద్
కళకు, కళాకారులకు కులం లేదు... సినిమాకు కులంతో సంబంధం లేదు. ఇది ముక్త కంఠంతో చెప్పే మాట. కాస్ట్ ఫీలింగ్ హీరోలకు, దర్శకులకు, సినిమా జనాలకు లేదు. కథానాయకుల్లో చాలా మంది కులాంతర వివాహాలు చేసుకున్నారు. అఫ్ కోర్స్... కులాంతర వివాహాలు చేసుకున్న సామాన్యులూ ఉన్నాయి. అయితే... సినిమా విడుదల సమయాల్లో అభిమానుల మధ్య కొన్నిసార్లు కులాల ప్రస్తావన వస్తోంది. దానిని సినిమా సెలబ్రిటీలు పట్టించుకోవడం లేదు. పబ్లిక్‌గా మాట్లాడిన దాఖలాలు లేవు. అయితే... 'ఆర్ఆర్ఆర్' (RRR) విడుదలకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దగ్గర కులాల ప్రస్తావన వచ్చింది. ఆయన హుందాగా స్పందించారు.
'ఆర్ఆర్ఆర్' విడుదలకు కొన్ని గంటల ముందు ఒక ఛానల్‌కు విజయేంద్ర ప్రసాద్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోనూ కులం ప్రస్తావన వచ్చింది. కొంత మంది ఫ్యాన్స్ అడిగిన ప్రశ్న అంటూ "రెండు సామజిక వర్గాలను తీసుకొచ్చారు. ఇలా స్టార్ట్ చేసి ఏమైనా పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారా?" అని అడిగారు. అప్పుడు విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ "నాది లవ్ మ్యారేజ్. ఆమెది విశాఖ. నాది కమ్మ కులం. ఆ అమ్మాయిది కమ్మ కులం కాదని తెలుసు. కానీ, ఎప్పుడూ అడగలేదు. 1966లో పెళ్లైంది. 84లో 'ఖైదీ' సినిమా వచ్చింది. 'మా చిరంజీవి' అన్నది. అడిగితే 'మా కాపులు కదండీ' అని చెప్పింది. మా ఇంట్లో రెండు కులాలు ఉన్నాయి. కులం అనే పట్టింపు నాకు లేదు. మా ఇంట్లోనూ లేదు. మా అమ్మాయి మలయాళీ అబ్బాయిని చేసుకుంది. మా అన్నయ్యగారి అమ్మాయి కూడా మలయాళీ అబ్బాయిని చేసుకుంది. మా అన్నయ్యగారి అబ్బాయి కాపుల అమ్మాయిని చేసుకున్నారు. ఇంకో అమ్మాయి రెడ్ల అబ్బాయిని చేసుకుంది. కులం అనేది మేం నమ్మనప్పుడు... కులం పేరు చెప్పుకొని వెళ్లడం రెడిక్యులెస్" అని సమాధానం ఇచ్చారు. గతంలో 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలోనూ ఈ విషయాన్ని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.
రాజమౌళిది ఏ సామాజిక వర్గం? ఎన్టీఆర్, రామ్ చరణ్... ఇద్దరిలో ఎవరికి ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఉంటారు? వంటి చర్చ కూడా కొందరు చేస్తున్నారనేది నిజం! ఇప్పటికీ సోషల్ మీడియాలో కొంత మంది ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య వార్ కూడా జరుగుతోంది. తమకు క్యాస్ట్ ఫీలింగ్ లేదని విజయేంద్ర ప్రసాద్ చెప్పడం ద్వారా పుకార్లకు చెక్ పడుతుందని చెప్పవచ్చు.
Also Read: సినిమా కంటే ముందు 'ఆర్ఆర్ఆర్' టికెట్ రేట్స్ - బడ్జెట్ - టూర్స్ మీద వచ్చిన మీమ్స్ చూడాల్సిందే
ఎన్టీఆర్, రామ్ చరణ్‌లది ఒక సామజిక వర్గం కాదు. వాళ్ళిద్దరి మధ్య స్నేహానికి కులం అడ్డుకోలేదు. ఈ సినిమాతో అభిమానులు కూడా అలాగే ఒక్కటి అవుతారని ఇండస్ట్రీలో కొంత మంది ఆశిస్తున్నారు. కులాల కంచెను దాటి ప్రేక్షకులు సినిమా చూసినప్పుడు మరిన్ని మల్టీస్టారర్స్ వస్తాయని... మిగతా స్టార్ హీరోలూ మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ముందుకు వస్తారని దర్శక నిర్మాతల ఆశ.
Also Read: లేటు వయసులో 'లా' - పుస్తకాలు పట్టిన పూజా హెగ్డే తల్లి
NTR31: ఫ్యాన్స్ కు ఐఫీస్ట్ - ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ లుక్
Ram Charan-NTR: నీతో నా బంధాన్ని మాటల్లో చెప్పలేను - రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్
NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు
Elon Musk: ఎలన్ మస్క్ ఆ యువతిని లైంగికంగా వేధించారా? 2.5 లక్షల డాలర్లు చెల్లించారా?
TTD Darshan Tickets For July, August : జూలై, ఆగస్టులో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా ? అయితే మీ కోసమే ఈ సమాచారం
Breaking News Live Updates : దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు హైకోర్టుకు బదిలీ, సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
CM KCR Appreciates Nikat Zareen : విశ్వ విజేతగా నిలిచిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్, సీఎం కేసీఆర్ హర్షం