Ram Charan Jr NTR New Looks : హాలీవుడ్ హీరోలకు ధీటుగా తారక్, చరణ్ - ఆస్కార్ ప్రమోషన్స్‌లో స్టైల్‌గా మన స్టార్స్
ఆస్కార్ అవార్డ్స్ కోసం అమెరికా వెళ్లిన మన హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లుక్స్ పరంగా హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోవడం లేదు.
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' (RRR)లో 'నాటు నాటు...' పాటకు ఆస్కార్ వస్తుందా? రాదా? అని అభిమానుల్లో అనే టెన్షన్ పెరిగిపోతోంది. అవార్డు రావడం ఖాయమని అందరూ ధీమాగా ఉన్నప్పటికీ... మనసులో ఏదో ఒక మూల చిన్న టెన్షన్. ఆస్కార్ వేడుకకు అమెరికాకు వెళ్లిన 'ఆర్ఆర్ఆర్' టీమ్... తమ సినిమాతో పాటు తమను కూడా సరికొత్తగా హాలీవుడ్‌లో ప్రమోట్ చేసుకునే పనిలో ఉంది.
ఆల్రెడీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) అమెరికాకు చేరుకున్నారు. హాలీవుడ్ మీడియాకు అనేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే, ఇంకా ఇద్దరూ కలిసినట్లు లేరు. ఒక్క ఫ్రేములో ఇద్దరూ ఉన్న ఫోటో ఇప్పటి వరకు బయటకు రాలేదు. కానీ, ఇద్దరూ వేర్వేరుగా దిగుతున్న ఫోటో షూట్స్ మాత్రం అభిమానులకు పిచ్చెక్కిస్తున్నాయని చెప్పాలి.
ఎన్టీఆర్ కంటే ముందే అమెరికాకు వెళ్లిన రామ్ చరణ్ ఎంటర్టైన్మెంట్ టునైట్, ఈజీ టాక్, ఇంకా హాలీవుడ్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆస్కార్ వైల్డ్ యాన్యువల్ వేడుకకు కూడా సతీమణి ఉపాసన (Upasana)తో కలిసి వెళ్లాడు. వాళ్లిద్దరూ సరదాగా ఔటింగుకు కూడా వెళ్లారు. ఆ టైములో వచ్చిన రామ్ చరణ్ ఫోటోలు అభిమానులకు పండుగే అని చెప్పాలి. శంకర్ సినిమా కోసమే ఓ స్టైలిష్ లుక్ లోకి మారిన రామ్ చరణ్... అమెరికాలో ఆ స్టైల్ డోస్ మరింత పెంచుతూ అదిరిపోయే లుక్స్ తో అదరగొట్టాడు. కాస్య్టూమ్స్ కూడా చాలా రిచ్ గా లుక్ ను మరింత ఎలివేట్ చేసేలా జాగ్రత్తలు తీసుకున్నాడు.
నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆ కార్యక్రమాల కోసం కుటుంబంతో ఉండిపోయిన జూనియర్ ఎన్టీఆర్ కాస్త ఆలస్యంగా అమెరికాకు వెళ్లాడు. తనదైన మాస్ స్టైల్ తో 'వావ్' అనిపిస్తున్నాడు. తన బాడీ లాగ్వేంజ్ కు సూట్ అయ్యేలా... అలాగే హాలీవుడ్ టేస్ట్ & స్టైల్ ను మ్యాచ్ చేసేలా తనను స్టైల్ గా ప్రెజెంట్ చేసుకుంటున్నాడు తారక్. రామ్ చరణ్ లానే ఎంటర్టైన్మెంట్ టునైట్ తో పాటు కొన్ని హాలీవుడ్ మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చాడు తారక్. ఆ తర్వాత ప్రీ ఆస్కార్ పార్టీస్ లో పాల్గొని బాలీవుడ్ సెలబ్రెటీలతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read : గుండెల్లో దేశాన్ని నింపుకొని, భారతీయుడిగా ఆస్కార్స్ రెడ్ కార్పెట్ మీద నడుస్తా - ఎన్టీఆర్
ఆస్కార్ సంగతి పక్కన పెడితే తమ అభిమాన హీరోలు ఇద్దరూ ఇలా స్టైలిష్ లుక్స్ తో ఫోటో షూట్స్ చేయించుకుంటూ ఫ్యాన్స్ కు మాత్రం ఫుల్ మీల్స్ పెడుతున్నారు. ఇక ఆ ఆస్కార్ కూడా వచ్చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా? ఇండియా అంతా దద్దరిల్లిపోతుంది అంతే!
ఆస్కార్స్ వేడుక కోసం సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ సైతం అమెరికా చేరుకున్నారు. అలాగే, గేయ రచయిత చంద్రబోస్ కూడా! దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఆల్రెడీ అమెరికాలో ఉన్నారు. ఈ సోమవారం ఉదయం జరగనున్న ఆస్కార్స్ వేడుకలో వీళ్ళందరూ సందడి చేయనున్నారు.
Also Read : వింతైన ప్రేమాయణం, త్వరలో ప్రెస్‌మీట్ పెట్టి అన్నీ చెబుతా - పెళ్లి ప్రశ్నలపై నరేష్