News
News
వీడియోలు ఆటలు
X

NTR 30: ‘ఎన్టీఆర్ 30’ కోసం ఫిజికల్ ట్రెయినింగ్ స్టార్ట్ చేసిన తారక్

కొరటాల డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ చిత్రం 'ఎన్టీఆర్ 30' షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ కోసం తారక్ ఫిజికల్ ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. కాగా జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

FOLLOW US: 
Share:

NTR 30: దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ వచ్చిన ఆనందంలో ఉన్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్... నెక్ట్స్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. 'ఎన్టీఆర్ 30' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తారక్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా... అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా సెట్ లోకి చేరిన జూనియర్ ఎన్టీఆర్.. యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరణ కోసం కసరత్తులు చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన 'ఫిజికల్‌ ట్రైనింగ్‌' స్టార్ట్‌ చేసినట్టు తెలుస్తోంది.

సెలబ్రెటీలన్నాక తమ అందాన్ని కాపాడుకోవడం కోసం ఎంత జాగ్రత్తగా ఉంటారో... ఆ సెలబ్రెటీ స్థానానికి చేరుకోవడానికి అంతకు మించిన కసరత్తులు కూడా చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి డూప్ లు లేకుండానే యాక్షన్ సీన్స్ చేయాల్సి ఉంటుంది. గడ్డ కట్టే చలిలో పనిచేయాల్సి ఉంటుంది. సినిమాకు తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ ను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలా అన్నీ చేస్తేనే హీరోలు గానీ హీరోయిన్ లు గానీ స్టార్ హోదా దక్కించుకుంటారు. అలాంటి వాళ్లలో ముందుండే నటుడు జూనియర్ ఎన్టీఆర్. మొదటి సినిమా నుంచి తన టాలెంట్ ను చూపిస్తూ.. ఈ రోజు 'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. 

'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ అవార్డు వచ్చిందంటే కారణం అది ఏ ఒక్కరి ఘనతో కాదు. దాని వెనకాల కథను తయారుచేసిన రాజమౌళి కృషి ఎంత ఉందో.. సినిమా అంతటి భారీ విజయానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల నటన కూడా అంతే కారణం. వారిద్దరే కాదు పాత్రకు తగ్గట్టుగా వారంతా తమ బాడీ లాంగ్వేజ్ ను సెట్ చేసుకున్నారు కాబట్టే ఈనాడు ఆ సినిమా అంతటి హిట్ ను సొంతం చేసుకుంది. అలా ఆర్ఆర్ఆర్ ఒక్కటే కాదు. ఏ సినిమాకైనా పాత్రకు తగ్గట్టు నటుల బాడీ లాంగ్వేజ్ లేకపోతే.. పాత్రకు ప్రాణం లేనట్టే.

ఇచ్చిన పాత్రకు 100శాతం న్యాయం చేయదగ్గ నటుల్లో ఎన్టీఆర్ ఒకరు.'ఆర్ఆర్ఆర్' కోసం తమ శరీరాకృతిని మార్చుకున్నాడో.. ఇప్పుడు తాను చేయబోయే నెక్ట్స్ చిత్రం 'ఎన్టీఆర్ 30'కోసం కూడా అదే మాదిరిగా తయారు కాబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ  సినిమాలోని కొన్ని యాక్షన్ సీన్స్ చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఫిజికల్ ట్రెయినింగ్ స్టార్ట్ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా.. ఈ మూవీలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. తాను కూడా షూటింగ్ లో పాల్గొనబోతున్నాననంటూ రీసెంట్ గా తారక్ ఓ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు కూడా. ఇక ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ సంస్థలు పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తుండగా సైఫ్ ఆలీఖాన్, మురళి శర్మ, ప్రకాష్ రాజ్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు చేస్తున్నారు. స్టార్టింగ్ నుండి ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Also Read : సల్మాన్, వెంకీతో రామ్ చరణ్ లుంగీ డ్యాన్స్ - కుమ్మేశారంతే!

ఇక యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై రాబోతోన్న 'ఎన్టీఆర్ 30' సినిమాను తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్నడ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏప్రిల్ 5, 2024న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కాగా 'ఆర్ఆర్ఆర్' కోసం తన కెరీర్ లోనే అత్యుత్తమైన లుక్ తో ఫిట్ గా కనిపించిన ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా కోసం కూడా అంతకంటే పర్ఫెక్ట్ ఫిట్ గా కనిపించబోతున్నాడంటూ ఆయన ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. 

Also Read : నేనెప్పుడు అన్నాను? - శోభితతో చైతూ డేటింగ్ మీద సమంత క్లారిటీ

Published at : 04 Apr 2023 01:07 PM (IST) Tags: Koratala siva Jhanvi Kapoor Junior NTR NTR 30

సంబంధిత కథనాలు

OTT Releases in June: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లలో రిలీజయ్యే మూవీస్ ఇవే

OTT Releases in June: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లలో రిలీజయ్యే మూవీస్ ఇవే

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!

PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!

మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!

మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!

టాప్ స్టోరీస్

CPI Narayana : సీఎం జగన్‌కు పదవిలో ఉండే అర్హత లేదు - రాజీనామా చేయాలన్న సీపీఐ నారాయణ !

CPI Narayana :   సీఎం జగన్‌కు పదవిలో ఉండే అర్హత లేదు - రాజీనామా చేయాలన్న సీపీఐ నారాయణ !

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

Partner Swapping Case: భార్యల మార్పిడి కేసులో సంచలనం, విషం తాగిన నిందితుడు - మృతి

Partner Swapping Case: భార్యల మార్పిడి కేసులో సంచలనం, విషం తాగిన నిందితుడు - మృతి