Richa Chadha, Ali Fazal: తండ్రి కాబోతున్న ‘మిర్జాపూర్’ హీరో అలీ ఫజల్, 1+1=3 అంటూ హింట్ ఇచ్చిన రిచా చద్దా
Richa Chadha, Ali Fazal: బాలీవుడ్ జంట రిచా చద్దా, అలీ ఫజల్ తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ గుడ్ న్యూస్ చెప్తూ వాళ్లు ఇన్ స్టాలో పెట్టిన వెరైటీ పోస్ట్ వైరల్ అవుతోంది.
Richa Chadha, Ali Fazal Welcoming First Baby: బాలీవుడ్ స్టార్ కపుల్ రిచా చద్దా, అలీ ఫజల్ తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాము త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది ఈ జంట. ఇన్ స్టాలో క్రియేటివ్ గా పోస్ట్ పెట్టారు. దీంతో ఇప్పుడు ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
1 + 1 = 3 అంటూ..
రిచా చద్దా, అలీ ఫజల్ ఇద్దరు కలిసి ఈ పోస్ట్ పెట్టారు. దాంట్లో 1 + 1 = 3 అని రాశారు. దాంతో పాటుగా.. ఇద్దరు ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటున్న ఫొటోను కూడా షేర్ చేశారు. అలీ కలర్ ఫుల్ షర్ట్, వైట్ కోట్ తో ఉంటే.. రిచా బ్లాక్ కలర్ డ్రెస్ లో క్యూట్ గా ఉంది ఆ ఫొటోలో. ఇక ఆ ఫొటో కింద ఒక ప్రెగ్నెసీ ఎమోజీని కూడా ఉంచింది ఆ జంట. "ఒక చిన్న గుండె చప్పుడు.. మా ప్రపంచంలో చాలా అందమైన శబ్దం" అంటూ క్యాప్షన్ రాశారు.
View this post on Instagram
సెలబ్రిటీల శుభాకాంక్షలు
ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపట్లోనే అది కాస్తా వైరల్ గా మారింది. ఇక ఇది చూసిన వాళ్లంతా రిచా, అలీకి విషెస్ చెప్తున్నారు. శ్వేత బసూ ప్రసాద్, సయామీ ఖేర్, శ్రీయ తదితరలు విషెస్ చెప్పారు. అభిమానులు కూడా కంగ్రాంట్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, రిచా – అలీ ఫజల్ జంట నాలుగేళ్లుగా డేటింగ్ ఉంది. అక్టోబర్ 2022లో పెళ్లితో ఒకటయ్యారు. ఇక ఇప్పుడు ఏడాదిన్నర తర్వాత.. తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకునున్నారు.
ఫక్రీ సెట్స్ లో కలిసిన రిచా, అలీ ప్రేమలో పడ్డారు. ఇక ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ‘కాల్ మై ఏజెంట్’ షోలో కూడా కలిసి నటించారు ఇద్దరు. ఈ మధ్యే ఒక ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టారు. ‘గర్ల్స్ విల్ బీ గర్ల్స్’ అనే సినిమా ప్రొడ్యూస్ చేయగా.. దానికి అవార్డులు కూడా వచ్చాయి. ప్రొడక్షన్ హౌస్ గురించి మాట్లాడుతూ.. "అలీతో వర్క్ చేయడం అంత ఈజీ కాదు. ఇప్పుడు ఆయన్ను చూస్తే నాకు వర్కే గుర్తొస్తుంది. మెయిల్ చేయాలి, డెడ్ లైన్స్ ఉన్నాయి, కాల్స్ చేయాలి ఫాలో అప్ చేయాలనే విషయాలే గుర్తొస్తాయి. ఏదేమైనా ఆయనతో కలిసి పనిచేయడం చాలా బాగా అనిపిస్తుంది" అంటూ తన అనుభవాలు షేర్ చేసుకున్నారు రిచా.
అలీ ఫర్జల్.. ‘మిర్జాపూర్’ వెబ్ సీరిస్ ద్వారా తెలుగువారికి కూడా పరిచయమే. త్వరలోనే ఆయన నటించిన ‘మిర్జాపూర్’ సీజన్ 3 అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది. రిచా చెద్దా గతంలో చాలాసార్లు వార్తల్లో నిలిచారు. గాల్వాన్ ఘటనకు సంబంధించి వివాదాస్పద కామెంట్స్ చేసిన ఆమె.. ఎంతోమంది నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ప్రభుత్వం ఆదేశిస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను చేజిక్కించుకునేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉన్నట్లు నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ఆ ప్రకటనపై రిచా స్పందిస్తూ ఓ ట్వీట్ చేసింది. 'గల్వాన్ హాయ్ చెబుతోంది' అంటూ కామెంట్ చేసింది. ఆ వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద దుమారం రేగింది. రిచా చేసిన కామెంట్‌పై ఎంతోమంది మండిపడ్డారు. భారతీయ ఆర్మీని చాలా చులకన చేసి మాట్లాడిందని అప్పట్లో ఆమెపై ఫైర్ అయ్యారు.
Also Read: టీవీ చానల్స్‌లో భగవంత్ కేసరి, స్కంద - ఫ్లాప్ సినిమాకే ఎక్కువ టీఆర్పీ, ఇదేం మాస్ రియాక్షన్ బాసు!