అన్వేషించండి

RGV Your Film: ఓట్ల ద్వారా నటీనటులు, టెక్నీషియన్ల ఎంపిక - ఆర్జీవీ కొత్త ప్రయోగం, ఇదేదో కొత్తగా ఉందే!

RGV Your Film: తాజాగా ‘యువర్ ఫిల్మ్’ అనే కాన్సెప్ట్‌తో ప్రేక్షకులే సినిమా తీస్తారు అంటూ రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. అసలు ఈ ‘యువర్ ఫిల్మ్’ అనేది ఏంటి అని ఒక ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు.

What Is Your Film Of RGV: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. తాజాగా తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ‘యువర్ ఫిల్మ్’ అనే పేరుతో ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఇది చూసిన నెటిజన్లు.. ఆయన కొత్త సినిమా టైటిల్ ఏమో అనుకున్నారు. కానీ దానికి సంబంధించి ఆయన విడుదల చేసిన మరిన్ని పోస్టర్స్ చూసిన తర్వాత ప్రేక్షకుల్లో కూడా అనుమానం మొదలయ్యింది. ‘ఆడియన్స్ సినిమాను హిట్ చేయగలిగినప్పుడు. వారే సినిమాను ఎందుకు చేయలేరు’ అంటూ కొత్త కోట్స్‌తో పోస్టర్లను షేర్ చేశారు. ఇక శనివారం రోజు ‘యువర్ ఫిల్మ్’ అంటే ఏంటి అనేదానిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. 

‘యువర్ ఫిల్మ్’..

‘యువర్ ఫిల్మ్’ గురించి స్పష్టత ఇవ్వడం కోసం ఆర్జీవీ డెన్‌లో ఒక ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు రామ్ గోపాల్ వర్మ, ముందుగా సినిమా అనేది ఎంత పెద్ద ప్రపంచంగా మారిపోయిందో వివరిస్తూ.. ‘యువర్ ఫిల్మ్’ ద్వారా సినిమాల్లో పనిచేయాలి అనుకుంటున్న ప్రతీ ఒక్కరికి అవకాశం ఇస్తునట్టు స్పష్టం చేశారు. ప్రేక్షకులే సినిమా హిట్, ఫ్లాప్ నిర్ణయిస్తారు కాబట్టి ఆ ప్రేక్షకులే సినిమాకు సంబంధించిన హీరో, హీరోయిన్, డైరక్టర్, సినిమాటోగ్రాఫర్.. ఇలా అందరు టెక్నీషియన్స్‌ను RGV వెబ్సైట్ ద్వారా ఓటింగ్ పద్దతిలో, ప్రజలే ఎన్నుకుని, అందులో ముందంజలో ఉన్న వారితో సినిమా చిత్రీకరణ చేయిస్తానని క్లారిటీ ఇచ్చారు. ఆ సినిమాను ఆర్జీవీ డెన్ నిర్మిస్తుందని తెలిపారు.

వెబ్సైట్ ద్వారా సెలక్షన్..

అలా ప్రేక్షకుల్లో నుండి పుట్టిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో చేసే సినిమాను ఆరు నెలల్లో నిర్మించి విడుదల చేస్తామని రామ్ గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చారు. ఉదాహరణకు RGV వెబ్‌సైట్‌ (rgvden.com) ఓపెన్ చేసి, అందులో తమ కథను ఒకట్రెండు లైన్లలో పెడితే ప్రేక్షకులు.. ఏ కథ బాగుందో ఓట్లు వేసుకోవచ్చు. ఒక నటీనటుల విషయానికొస్తే.. ఒక 1000 మంది అప్లై చేస్తే అందులో నుండి ఒక 50 మందిని RGV డెన్ టీమ్ షార్ట్ లిస్ట్ చేసి వెబ్సైట్‌లో పెడతారు. ఎప్పటికప్పుడు వారికి ఆడిషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఆ ఆడిషన్స్ వీడియోలను కూడా ఆ వెబ్సైట్‌లో అప్లోడ్ చేస్తుండగా.. ప్రేక్షకులు తమకు నచ్చినవారిని ఎంపిక చేసుకోవచ్చు. అలా ఎవరికి ఎక్కువ ఓట్లు పడతాయో వారే యాక్టర్లు, టెక్నీషియన్లుగా సెలక్ట్ అవుతారు. వారితోనే సినిమా కూడా తెరకెక్కుతుంది.

ప్రజాస్వామ్యం లాంటిదే..

ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం ఎన్నుకున్నదే ప్రజాస్వామ్యం. అలాగే ప్రేక్షకుల చేత, ప్రేక్షకుల కొరకు, ప్రేక్షకుల కోసం చేసే సినిమాలే ఈ ‘యువర్ ఫిల్మ్’ ఐడియా. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో ఈ ‘యువర్ ఫిల్మ్’ ప్రయోగం జరుగుతుందని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. అయితే ఇలాంటి ఐడియాతో దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఎవరూ సినిమా తీయలేదని గర్వంగా తెలిపారు. సినిమాల్లోకి రావాలనే ఆశ అందరికీ ఉన్నా.. ఇతరుల కంటే వారు ఎంత బెటర్ తెలుసుకోవడానికి కూడా ఈ ఆలోచన ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఆసక్తి ఉన్నవారికి యాక్సెస్ లేదని, అదే ఆర్జీవీ డెన్ కలిగిస్తుందని అన్నారు. ‘యువర్ ఫిల్మ్’ అనేది తొలి అడుగు మాత్రమే అని చెప్పారు.

Also Read: స్టార్ హీరోల రెమ్యునరేషన్‌పై ఆర్జీవీ కామెంట్స్ - తప్పుదోవ పట్టించేందుకే అంటూ క్లారిటీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget