అన్వేషించండి

Ram Gopal Varma: స్టార్ హీరోల రెమ్యునరేషన్‌పై ఆర్జీవీ కామెంట్స్ - తప్పుదోవ పట్టించేందుకే అంటూ క్లారిటీ

Ram Gopal Varma: ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే రామ్ గోపాల్ వర్మ.. తాజాగా టాలీవుడ్‌లోని స్టార్ హీరోల రెమ్యునరేషన్‌పై కామెంట్స్ చేశారు. అసలు రెమ్యునరేషన్ దేనిపై ఆధారపడి ఉంటుందో క్లారిటీ ఇచ్చారు.

Ram Gopal Varma Comments On Star Heroes Remuneration: తెలుగులో పాన్ ఇండియా సినిమాలు అనేవి రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం దాదాపు తెలుగులోని ప్రతీ స్టార్ హీరోకు పాన్ ఇండియా హీరో అనే ట్యాగ్ ఉంది. దీంతో హీరోలు రెమ్యునరేషన్స్ విపరీతంగా పెంచేస్తున్నారని సినీ పరిశ్రమలో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇది దాదాపుగా నిజమే అని ప్రేక్షకులు కూడా నమ్ముతున్నారు. నిర్మాతలపై హీరోల రెమ్యునరేషన్ అనేది అదనపు భారంగా మారుతుందని మూవీ లవర్స్ చర్చించుకుంటున్నారు. అందుకే సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కూడా అవకాశాలు రావడం లేదని వస్తున్న వార్తలు నిజమేనా అని రామ్ గోపాల్ వర్మకు ప్రశ్న ఎదురవ్వగా ఈ విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

దాన్నిబట్టే రెమ్యునరేషన్..

‘‘హీరోల రెమ్యునరేషన్ గురించి వస్తున్న వార్తలు తప్పుదోవ పట్టించడానికి మాత్రమే. అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే హీరోల రెమ్యునరేషన్ అనేది సినిమా ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. ఆ సినిమాకు హీరోను చూడడానికి ఎంతమంది వస్తారు, రాబడి ఎంత వస్తుంది అనేదానిపైనే రెమ్యునరేషన్ ఆధారపడి ఉంటుంది. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టులకు అవకాశాలు లేవు అనే విషయానికొస్తే.. వారానికి చిన్న, పెద్ద ఏదైనా నాలుగైదు సినిమాలు విడుదల అవుతాయి. అందరికీ అవకాశాలు ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ. ఇక సినిమాల రివ్యూలు అనేవి తనపై ప్రభావం చూపిస్తాయా లేదా అనే విషయంపై కూడా ఆయన మాట్లాడారు.

ప్రేక్షకుల వల్లే..

మేకర్స్ అనేవారు చాలా డబ్బులు ఖర్చుపెట్టి, సమయాన్ని కేటాయించి సినిమాను తెరకెక్కించి ఆడియన్స్ ముందుకు తీసుకొస్తారని, అలా ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత రివ్యూల వల్ల ఆ సినిమా ఏంటని డిసైడ్ చేసేస్తున్నారని రామ్ గోపాల్ వర్మ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సినిమా తీసిన తర్వాత పూర్తిగా ప్రేక్షకులు జోక్యం చేసుకోవడం వల్ల దాని రిజల్టే మారిపోతుందని అన్నారు. అందుకే ఇకపై తాను అలా చేయాలని అనుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఒక మూవీ చూసిన తర్వాత అది ఆడియన్స్‌కు నచ్చకపోతే వారిని వారు తిట్టుకోలేరు కాబట్టి మేకర్స్‌ను తిడుతున్నారని, నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారని ఆర్జీజీ.. తన స్టైల్‌లో స్పందించారు.

యువర్ ఫిల్మ్..

అందరు మేకర్స్.. ఒక దారిలో వెళ్తే.. రామ్ గోపాల్ వర్మ మాత్రం సెపరేట్ రూటును ఫాలో అవుతారు. అందులో భాగంగానే గత కొన్నేళ్లుగా కాంట్రవర్సీలను క్రియేట్ చేసే పొలిటికల్ సినిమాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రేక్షకులే సినిమా తీయాలని, తీస్తారని ‘యువర్ ఫిల్మ్’ అనే కొత్త కాన్సెప్ట్‌ను కనిపెట్టారు. అసలు అది ఏంటో వివరణ ఇవ్వడానికే తాజాగా ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఈ ప్రెస్ మీట్‌లో ఆయనకు పలు ఆసక్తికర ప్రశ్నలు ఎదురవ్వగా హీరోల రెమ్యునరేషన్‌పై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హీరోల రెమ్యునరేషన్ వల్లే నిర్మాతలపై బడ్జెట్ భారం పడుతుంది అనే విషయంపై ఆర్జీవీ క్లారిటీ ఇచ్చారు.

Also Read: 'ఫ్యామిలీ స్టార్‌' క్రింజ్‌ స్టార్‌, వరస్ట్‌ మూవీ - మూవీ క్రిటిక్‌ రివ్యూపై మండిపడుతున్న విజయ్‌ ఫ్యాన్స్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Aadhaar Card Updating: ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Embed widget