Family Star Negative Reviews:'ఫ్యామిలీ స్టార్' క్రింజ్ స్టార్, వరస్ట్ సినిమా - తమిళ్ క్రిటిక్ రివ్యూపై మండిపడుతున్న విజయ్ ఫ్యాన్స్
Family Star: 'ఫ్యామిలీ స్టార్'పై నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. తమిళ్ ఆడియన్స్ అయితే దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ కింజ్ స్టార్ అంటూ నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు ఓ క్రిటిక్
Negative reviews on Family Star Movie: 'రౌడీ' హీరో విజమ్ దేవరకొండ, 'సితారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించి చిత్రం 'ఫ్యామిలీ స్టార్' చిత్రం. పరశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్న ఏప్రిల్ 5న థియేటర్లోకి వచ్చింది. ఆరేళ్ల క్రితం వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'గీతా గోవిందం' బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అవ్వడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పిస్తున్న ఈ చిత్రం యూత్‌ని, మాస్ ఆడియన్స్‌ని పెద్దగా ఆకట్టుకోలేకపోయిందట.
కథ మొత్తం సిల్లి సీన్సే..
దీంతో ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం అయ్యింది. అయితే ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగులో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఫ్యామిలీ స్టార్ తమిళ ఆడియన్స్‌ని కూడా పెద్దగా ఆకట్టుకోలేదట. ఈ సినిమా చూసిన తమిళ్ ఆడియన్స్ నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఇక ఓ మూవీ క్రిటిక్ అయితే ఫ్యామిలీ స్టార్‌పై దారుణంగా కామెంట్స్ చేశాడు. క్రిస్టోఫర్ కనగరాజ్ అనే క్రిటిక్ ట్వీట్ చేస్తూ.. "ఫ్యామిలీ స్టార్.. క్రింజ్ స్టార్(విసిగించడం). ఇది పూర్తి అవుట్ డేటెడ్ మూవీ. 80's స్టైల్లో ఉంది. ఇది మెగా బోరింగ్ మూవీ. కథలో మొత్తం సిల్లి సీన్సే ఉన్నాయి. విజయ్ దేవరకొండ, మృణాల్ మధ్య అసలు కెమిస్ట్రే లేదు. ఈ సినిమా మొత్తంలో రెండు పాటలు, ఇంటర్వేల్ బ్లాక్, కొన్ని కామెడీ సీన్స్ మాత్రమే బాగున్నాయి. మిగతా మూడు గంటల సినిమా అంతా బోర్ కొట్టించింది.
#FamilyStar - CRINGE Star!🙏
— Christopher Kanagaraj (@Chrissuccess) April 4, 2024
Highly outdated 80s style of story & Mega Boring narration with Silly Scenes. VD-Mrunal No Chemistry. 2 Songs, Interval block & couple of fun scenes r gud in this close to 3Hrs running lengthy film. Zero Emotional Connect. WORST!
ఇక ఎమోషన్స్ అసలే పండలేదు. వరస్ట్ మూవీ" అంటూ రివ్యూ ఇచ్చాడు. ఇక ఇది చూసి విజయ్ ఫ్యాన్స్ అంతా అతడిపై మండిపడుతున్నారు. సినిమా చూసే రివ్యూ ఇచ్చావారా? అంటూ అతడి ట్వీట్‌కు స్పందిస్తున్నారు. ఇక మరికొందరైతే తెలుగు సినిమాలపై ఎందుకంత అసూయ అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం అతడి ట్వీట్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్ అవుతుంది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఇక మూవ ఈప్రమోషన్స్‌లో ఇది పూర్తిగా ఫ్యామిలీ స్టార్ మూవీ అని, 90 శాతం ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా ఎంజాయ్ చేస్తారంటూ నిర్మాత దిల్ రాజు చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమా ప్రిమియర్ చూసి ఆయన భార్య తేజస్వీని కూడా కొట్టేశారండి అని చెప్పిందట.
Also Read: ప్రభాస్ 'కల్కి 2898 AD' మళ్లీ వాయిదా? - కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?