Kalki 2898 AD New Release Date: ప్రభాస్ 'కల్కి 2898 AD' మళ్లీ వాయిదా? - కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
Kalki Movie: ప్రభాస్ 'కల్కి 2898 AD' మూవీ కొత్త రిలీజ్ డేట్ ఇదేనంటూ ఓ అప్‌డేట్ బయటకు వచ్చింది. కాగా ఎన్నికల కారణంగా మే 9న రిలీజ్ అవ్వాల్సిన కల్కి చిత్రం వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Kalki 2898 AD New Release Date Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ 'కల్కి 2989 ఏడీ'. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై విపరీతమైన బజ్ నెలకొంది. ఈ సినిమా నుంచి వస్తున్న అప్‌డేట్స్, లీక్స్ మూవీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో మూవీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు ఆడియన్స్‌కి తరచూ నిరాశే ఎదురైంది. ఈ చిత్రం తరచూ వాయిదా పడుతూ వస్తుంది. చివరకు మే 9న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది మూవీ టీం. ఇదే ఫిక్స్ అయిపోయారు అంతా. కానీ, మే నెలలోనే ఎన్నికలు వచ్చి పడటం సినిమాను వాయిదా వేయక తప్పలేదు. వైజయంతీ బ్యానర్‌కు సెంటిమెంట్ డేట్ మే 9. ఎందుకంటే ఈ బ్యానర్లో వచ్చిన సినిమాలు 'జగదేకవీరుడు అతిలోక సుందరి', 'మహానటి' చిత్రాలు అదే రోజు విడుదలై బ్లాకబస్టర్ హట్ కొట్టాయి.
మే 30కి వాయిదా?
Kalki New Release Date: ఇక కల్కిని కూడా మే 9న రిలీజ్ చేసి తమ సెంటిమెంట్‌ను క్యారీ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ ఎన్నికల కారణంగా మూవీ వాయిదా వేయకతప్పుదు. ఇక కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడా అని ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో 'కల్కి 2989 ఏడీ' కొత్త రిలీజ్ డేట్ ఇదేనంటూ ఓ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. 'కల్కి'కొత్త రిలీజ్ డేట్‌ని మే 30కి అనుకుంటుందట మూవీ టీం. మూవీని మరి ఎక్కువ రోజులు వాయిదా వేయకండి మే చివరిలోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ఆ దిశ చర్చలు జరగుతున్నాయట. ప్రస్తుతం నిర్మాతలు మే 30ని 'కల్కి' కొత్త రిలీజ్ డేట్ అనుకుంటున్నట్టు ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్. అయితే దీనిపై ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇంకా రాలేదు. త్వరలోనే దీనిపై మూవీ టీం నుంచి అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందట.
Also Read: 'గేమ్ ఛేంజర్', 'ఇండియన్ 2' సినిమాల రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్న శంకర్? - ఎప్పుడెప్పుడంటే!
కాగా 'కల్కి 2989 ఏడీ' చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ అండ్ ఫాంటసీ యాక్షన్ డ్రామాను దాదాపు రూ. 400 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిస్తున్నట్లు టాక్. అయితే మొదట 'కల్కి'ని సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, అప్పటికి ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. దీంతొ 'కల్కి' వాయిదా పడింది. దాని నుంచి మే 9కి వచ్చిన ఈ సినిమా ఎలక్షన్ కారణంగా మళ్లీ వాయిదా పడింది. ఇప్పుడు మే 30 అనే టాక్ వినిపిస్తుంది. మరి ఇదైన నిజం అయ్యి ఈ సమ్మర్‌కు వస్తుందా? లేదా మరింత వెనక్కి వెళుతుందా? చూడాలి. అయితే, ఈ సినిమా ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, ఇక మరో బాలీవుడ్ భామ దిశా పటానీ సెకండ్ హీరోయిన్‌గా ఓ కీలక పాత్ర చేస్తుందని టాక్. భారతీయ చిత్ర పరిశ్రమలో లెజెండరీ హీరోలు బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్ సైతం 'కల్కి 2989 ఏడీ' సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్ హాసన్ విలన్ రోల్ చేస్తున్నారని సమాచారం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

