'Game Changer' Release Date: 'గేమ్ ఛేంజర్', 'ఇండియన్ 2' సినిమాల రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్న శంకర్? - ఎప్పుడెప్పుడంటే!
Director Shankar: మెగా డైరెక్టర్ శంకర్ 'ఇండియన్ 2', 'గేమ్ ఛేంజర్' సినిమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్‌లను ఫిక్స్ చేసుకున్నట్టు సమాచారం.
Shankar Locks Game Changer and Indian 2 Release Dates: మెగా డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. కమల్ హాసన్ 'ఇండియన్ 2', మరోకటి రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' చిత్రాలు. ఈ రెండు పాన్ ఇండియా సినిమాలే. పైగా అందులో ఒకటి గ్లోబర్ స్టార్ మోస్ట్ అవైయిటెడ్ ప్రాజెక్ట్స్. నిజానికి ఒక పెద్ద ప్రాజెక్ట్‌ని తెరకెక్కించడమే డైరెక్టర్స్‌కి కత్తి మీద సాము లాంటింది. ఎందుకంటే ఇటూ ఫ్యాన్స్, అటూ మూవీ టీం నిరాశ పరచకుండ షూటింగ్ చేయాలి. చెప్పిన తేదీలకి విడుదల చేయాలి.. మధ్య మధ్యలో అప్‌డేట్స్ ఇవ్వాలి. ఇవి ఒక్క సినిమాకే కష్టం. అలాంటి శంకర్ ఒకేసారి రెండు భారీ చిత్రాలు చేస్తున్నాడు. నిజానికి 'ఇండియన్ 2' ఆగిపోవాల్సిన సినిమా.. కానీ, నిర్మాతలే పట్టుబట్టి శంకర్‌తో సినిమాని కంటిన్యూ చేయిస్తున్నారు.
ఎన్నికల హడావుడి తర్వాత 'ఇండియన్ 2'?
దాంతో ఇటూ 'గేమ్ ఛేంజర్', అటూ 'ఇండియన్ 2' షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తున్నాయి. ఎప్పుడు సెట్స్‌పైకి వచ్చిన గేమ్ ఛేంజర్ షూటింగ్, ఇండియన్ 2 వల్లే స్లో స్లోగా ముందకు వెళుతుంది. దీంతో ఎప్పుడే థియేటర్లోకి రావాల్సిన ఈ సినిమా ఇంకా సెట్స్‌పైనే ఉంది. షూటింగ్ మొదలై రెండేళ్లు అవుతున్నా ఇంకా రిలీజ్ డేట్‌పై క్లారిటీ. ముందుగా కొన్ని డేట్స్ అనుకున్న అవి వర్క్ అవుట్ కాలేదు. దీంతో గేమ్ ఛేంజర్, ఇండియన్ 2 సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడనేది క్లారిటీ లేదు. కనీసం రిలీజ్ డేట్స్‌పై అంచనాలు అయినా ఉంటాయి. కానీ ఈ రెండు సినిమా విషయం అదీ లేదు.
దీంతో 'గేమ్ ఛేంజర్', 'ఇండియన్ 2' చిత్రాలు రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్ అంతా. ఈ క్రమంలో శంకర్ ఈ రెండు సినిమాల రిలీజ్ ఏప్పుడు చేయాలో ఓ నిర్ణయానికి వచ్చాడట. ఇండియా వైడ్‌గా ఎలక్షన్స్ హడావుడి కొనసాగుతుంది. ఎన్నికల ప్రచారాలు, ఓటింగ్ ప్రక్రియ అయిపోయాక 'ఇండియన్ 2' మూవీని రిలీజ్ చేయాలని తన టీం చెప్పారట. అంటే జూన్‌లో మూవీ రిలీజ్ చేయాలని, త్వరత్వరగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయాలని తన టీంతో చర్చించినట్టు ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్.
దసరాకి 'గేమ్ ఛేంజర్'?
ఇప్పటికే 'ఇండియన్ 2' మూవీ షూటింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే. శంకర్ అర్డర్‌తో ఆయన టీం ఇడియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసే పనిలో పడ్డారట. ఇదే నిజం అయితే ఇక ఇండియన్ 2 జూన్‌లో రిలీజ్‌కు వచ్చేస్తున్నట్టు. ఇక గేమ్ ఛేంజర్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇంకా 15 నుంచి 20 రోజుల షూటింగ్ వర్క్ మిగిలి ఉందట. షూటింగ్ అయిపోగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేసి దసరా కానుక థియేటర్లోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాడట. అప్పుడే జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది.
చరణ్ సినిమాను కూడా అప్పుడు రిలీజ్‌కు తీసుకురావాలని అనుకుంటున్నాడట. ఆలోగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి చేసి అక్టోబర్ మొదటి వారంలో 'గేమ్ ఛేంజర్' రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడట. దీనిపై తన టీం చర్చించి ఆ దిశగా శరవేగంగా పనులు చేయిస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఈ సినిమాలు రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా పడ్డాయి. మరి ఇవి కూడా వాటిలాగే వార్తలకు పరిమితం అవుతుందా, నిజమై రిలీజ్‌కు వచ్చేస్తాయో చూడాలి!