RC16 : రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమాకి ఊహించని టైటిల్, ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా?
RC16 : రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకి 'పెద్ది' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం.
'RC 16' Movie Titile : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ని వైజాగ్‌లో ప్లాన్ చేశారు. ఈరోజు నుంచి మార్చి 19 వరకు సుమారు ఐదు రోజుల పాటు వైజాగ్ లో 'గేమ్ ఛేంజర్' షూటింగ్ జరగనుంది. వైజాగ్ షెడ్యూల్ పూర్తయిన వెంటనే చరణ్ తన తదుపరి ప్రాజెక్టు లాంచింగ్ కోసం హైదరాబాద్ రానున్నాడు. 'గేమ్ చేంజర్' తర్వాత రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబుతో చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ నెల 20న 'RC16' లాంచింగ్ ఈవెంట్
రామ్ చరణ్ మార్చ్ 19న 'గేమ్ చేంజర్' వైజాగ్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని వెంటనే హైదరాబాద్‌కు రానున్నాడు. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాని ఈనెల 20న హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు. ఈ లాంచింగ్ ఈవెంట్ కి పలువురు సినీ ప్రముఖులు సైతం హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 'RC16' అనే పేరుతో తో పిలవబడుతున్న ఈ సినిమా టైటిల్ ని సైతం అదే రోజు అనౌన్స్ చేయనున్నట్లు ఇన్ సైడ్ వర్గాల సమాచారం.
రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమాకి ఊహించని టైటిల్
బుచ్చిబాబు - రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా రూరల్ విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగనుంది. సినిమాలో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యువకుడిగా కనిపించనున్నారు. అతని స్లాంగ్ నుంచి గెటప్ వరకూ అంతా కొత్తగా ఉండబోతోంది. కాగా కథకి అనుగుణంగా ఈ సినిమాకి 'పెద్ది' అనే టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తాజా సమాచారం. ఈ నెల 20 న టైటిల్ ని సైతం అఫీషియల్ గా అనౌన్స్ చేనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ 'పెద్ది' అనే టైటిల్ ని రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంత వరకు యాక్సెప్ట్ చేస్తారనేది చూడాలి. కొంతమంది ఫ్యాన్స్ అయితే 'పెద్ది' అనే టైటిల్ కి పాన్ ఇండియా అప్పీల్ లేదని కామెంట్స్ చేస్తున్నారు. మరి తెలుగులో ఈ టైటిల్ పెట్టి ఇతర భాషల్లో వేరే టైటిల్ పెడతారా? లేక ఇదే టైటిల్ ని అన్ని భాషల్లో ఫిక్స్ చేస్తారా? అనేది తెలియాలంటే మార్చ్ 20 వరకు ఆగాల్సిందే.
రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్
రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తోంది. రీసెంట్ గా జాన్వి బర్త్డే సందర్భంగా ఈ విషయాన్ని మూవీ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఎన్టీఆర్ 'దేవర' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న జాన్వి కపూర్ ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే రామ్ చరణ్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ రెండు సినిమాలు కనుక సక్సెస్ అయితే టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ స్టార్ స్టేటస్ అందుకోవడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.
Also Read : అన్న మరణంపై స్పందించిన సీరియల్ నటి సుజిత - గుండె బరువెక్కిస్తోన్న ఎమోషనల్ పోస్ట్