Surya Kiran Sister Sujitha: అన్న మరణంపై స్పందించిన సీరియల్ నటి సుజిత - గుండె బరువెక్కిస్తోన్న ఎమోషనల్ పోస్ట్
Sujitha Dhanush: టాలీవుడ్ డైరెక్టర్ సూర్య కిరణ్.. ఇటీవల పచ్చ కామెర్ల కారణంగా మరణించారు. కొన్నిరోజుల పాటు సైలెంట్‌గా ఉన్న తన చెల్లెలు సుజిత.. ఫైనల్‌గా ఈ మరణంపై స్పందించారు.
Sujitha about Brother Surya Kiran Death: ఇటీవల దర్శకుడు సూర్య కిరణ్ హఠాన్మరణం అందరినీ ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. తెలుగులో ‘సత్యం’ లాంటి సూపర్ హిట్‌ను తెరకెక్కించారు ఈ దర్శకుడు. ఇప్పటికీ సూర్య కిరణ్ పేరు చెప్తే చాలామంది ప్రేక్షకులకు ‘సత్యం’ సినిమానే గుర్తొస్తుంది. అలాంటి దర్శకుడు ఇక లేరు అనే విషయం తెలియగానే చాలామంది సినీ ప్రముఖులు స్పందించారు. తన మృతికి సంతాపం తెలియజేశారు. కానీ తన సోదరి అయిన సుజిత మాత్రం మీడియా ముందుగానీ, సోషల్ మీడియలో గానీ స్పందించలేదు. దీంతో కొందరు విమర్శలు చేయడంతో సుజిత.. తన అన్న సూర్య కిరణ్ మరణంపై స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.
ఎవరి లైఫ్ వాళ్లదే..
ఎన్నో సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటిస్తూ మంచి గుర్తింపును సాధించుకున్నారు సుజిత. తన అన్న సూర్య కిరణ్ పెద్ద దర్శకుడే అయినా ఎవరి కెరీర్‌లో వారు బిజీగా ఉంటూ.. పెద్దగా ఒకరి ప్రొఫెషనల్ లైఫ్‌లో మరొకరు జోక్యం చేసుకునేవారు కాదు. అందుకే వీరిద్దరూ అన్నా చెల్లళ్లు అనే విషయం కూడా చాలామందికి తెలియదు. కానీ సూర్య కిరణ్ మరణించారని తన కుటుంబ సభ్యులు ప్రకటించిన తర్వాత కూడా సుజిత ఈ విషయంపై స్పందించలేదని తెలిసిన నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఎందుకు సుజిత స్పందించడానికి ముందుకు రావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. ఫైనల్‌గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది.
ఎప్పటికీ అభిమానిస్తూనే ఉంటాను..
సూర్య కిరణ్‌తో కలిసి దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సుజిత. ‘‘అన్నయ్య. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నువ్వు నా అన్నవి మాత్రమే కాదు.. నా తండ్రి, నా హీరో. నీ టాలెంట్‌ను, మాటలను ఎప్పటికీ అభిమానిస్తూనే ఉంటాను. ఎన్నో విధాలుగా నీ ఉనికిని చాటే వెళ్లావు. పునర్జన్మ అనేది నిజమే అయితే మళ్లీ పుట్టి నీ కలలు, ఆశయాలు నిజం కావాలని కోరుకుంటున్నాను’’ అని ఎమోషనల్ క్యాప్షన్‌ను షేర్ చేశారు. సుజిత, సూర్య కిరణ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి అడుగుపెట్టారు. చిరంజీవి నటించిన ‘పసివాడి ప్రాణం’ మూవీతో ఆమెకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఆమె సినిమాల్లో నటించలేదు. సీరియల్స్‌లోనే ఎక్కువగా నటిస్తున్నారు.
View this post on Instagram
కమర్షియల్ హిట్లు లేవు..
దర్శకుడు సూర్య కిరణ్ ఇటీవల పచ్చ కామెర్ల కోసం చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పటల్‌లో చికిత్స తీసుకుంటూ మరణించారు. దర్శకుడిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు సూర్య కిరణ్. ‘సత్యం’తో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. మళ్లీ సుమన్‌తోనే ‘ధన 51’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ ఆయన తెరకెక్కించిన సినిమాలు ఏవీ కమర్షియల్‌గా హిట్‌ను అందుకోలేదు. అందుకే ఎక్కువగా డైరెక్షన్‌లో నిలవలేకపోయాడు. చాలాకాలం ఇండస్ట్రీ నుండి బ్రేక్ తీసుకున్న తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. కానీ ఆ షో ద్వారా కూడా ప్రేక్షకులను మెప్పించలేక కొన్నిరోజుల్లోనే ఎలిమినేట్ అయ్యారు.
Also Read: అల్లు అరవింద్ షాకింగ్ నిర్ణయం? ఇరకాటంలో సాయిపల్లవి, రణబీర్‌ల ‘రామాయణం’ మూవీ