Nitesh Tiwari's Ramayana: అల్లు అరవింద్ షాకింగ్ నిర్ణయం? ఇరకాటంలో సాయిపల్లవి, రణబీర్‌ల ‘రామాయణం’ మూవీ
Nitesh Tiwari's Ramayana: నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ సినిమాకు సంబంధించి షాకింగ్ అప్ డేట్ బయటికి వచ్చింది. సినిమా ప్రొడ్యూసర్లు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట.
Nitesh Tiwari's Ramayana producers step back: నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘రామాయణం’. మూడు పార్ట్ లుగా ఈ సినిమా వస్తుందని మొదటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ అఫీషియల్ గా ఎప్పుడూ బయటికి చెప్పరు మేకర్స్. సినిమాకి సంబంధించి పుకార్లు షికార్లు చేస్తుంటాయి. రణ్ బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. సినిమా ప్రొడ్యూసర్లు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
ప్రాజెక్ట్ నుంచి ఔట్..
ఈ భారీ ప్రాజెక్ట్ ను మూడు భాగాలుగా రిలీజ్ చేయనున్నట్లు మొదటి నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో వాటిని తెరకెక్కిస్తున్నారనే వార్తలు వచ్చాయి. గజినీ ఫేమ్ మధు మంతెన, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితె, ఇప్పుడు ఆ ఇద్దరు ప్రాజెక్ట్ నుంచి బయటికి వచ్చేశారట. డైరెక్టర్, టెక్నికల్ టీమ్ ప్రొడ్యూసర్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, మనస్పర్థల కారణంగానే ఇలా జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
నెక్ట్స్ ఎవరు?
ఇంతటి భారీ ప్రాజెక్ట్ ని ప్రొడ్యూస్ చేయాలంటే బడా ప్రొడ్యూసర్లు కావాలని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో సినిమాని నెక్ట్స్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారో అనే చర్చ జరుగుతుంది. అయితే, ఆస్కార్ విన్నింగ్ ప్రొడ్యూసర్లు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తారనే వార్తలు బయటికి వచ్చాయి. DNEG అనే ఆస్కార్ విన్నింగ్ వీఎఫ్ఎక్స్ కంపెనీ సీఈవో నమిత్ మల్హోత్ర ఈ సినిమాని నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హాలీవుడ్ లో ఇది ఫేమస్ వీఎఫ్ఎక్స్ కంపెనీ. బ్రిటిష్ విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ యానిమేషన్, స్టీరియో కన్వర్షన్ స్టూడియో ఇది. ఈ కంపెనీ వీఎఫ్ఎక్స్ కి 8 ఆస్కార్ అవార్డులు వచ్చాయి. ఇన్సెప్షన్, ఓపెన్ హైమర్, ఈ మకీనా, ఇంటర్ స్టెల్లర్, ఫస్ట్ మ్యాన్, డ్యూనే, బ్లేడ్ రన్నర్ 2049, డ్యూన్ సినిమాలకు గాను అవార్డులు వచ్చాయి.
భారీ స్థాయిలో రూపొందించాలని..
రామాయణం సినిమాని భారీ స్థాయిలో రూపొందించాలని ప్లాన్ చేశారు మేకర్స్. దాంట్లో భాగంగానే ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు పనిచేసిన వారిని ఎంచుకున్నారు. కొత్త, హై-ఆక్టేన్ విజువల్స్‌తో భారీ స్థాయిలో రూపొందించేందుకు ఏర్పాట్లు చేశారు. దాంట్లో భాగంగానే నమిత్, నితేష్ అనే వీఎఫ్ ఎక్స్, గ్రాఫిక్స్ ఎక్స్పర్ట్స్ ను తీసుకున్నారు. వాళ్ల ద్వారా గ్రాండ్‌గా వీఎఫ్‌ఎక్స్ టీమ్, భారీ తారాగణం, మెగా సెట్‌లు వేయాలనేది ప్లాన్. వాళ్లతో రామాయణ ప్రపంచాన్ని సృష్టించాలని నితీష్ ఊహించాడట ఇక ఆ టీమ్ మొత్తం డైరెక్టర్ నితీశ్ అండర్ లో పనిచేయనున్నట్లు టాక్. అయితే, ఈ విషయంలో మధు మంతెన, నమిత్ కి మధ్య విబేధాలు రావడంతో ప్రొడ్యూసర్లుగా వాళ్లు వెనక్కి తగ్గినట్లుగా టాక్ వినిపిస్తోంది.
ఈ విషయాలన్నీ పక్కనపెడితే.. సినిమా కోసం మాత్రం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రాముడిగా రణ్ బీర్ కపూర్ చేస్తుండగా, సీగతా సాయి పల్లవి నటిస్తుండనే టాక్ వినిపించింది. రావణాసురుడిగా యష్ చేస్తుండగా, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీడియోలో, లారా దత్తా తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.
Also Read: ఓటీటీలోకి వచ్చేసిన 'భ్రమయుగం', స్ట్రీమింగ్ ఎక్కడంటే?