అన్వేషించండి

Rayavalasa: అమ్మ దర్శకత్వంలో కొడుకు... 'రాయవలస' లుక్ చూశారా? జానర్ ఏమిటంటే?

Karthik Jayanthi Movie: కార్తీక్ జయంతి హీరోగా రాయ్‌సున్ ప్రొడక్షన్స్ పతాకంపై గోపీకృష్ణ నిర్మాణంలో రాధిక జయంతి దర్శకత్వం వహిస్తున్న సినిమా 'రాయవలస'. హీరో ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చేయడం ఒక మెమరబుల్ మూమెంట్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి చేసే సినిమాలకు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అంతా పని చేస్తారు. ఇటీవల యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఆయన కుమార్తె ఐశ్వర్య 'సీతా పయనం' చేశారు. ఆ తరహాలో మరో సినిమా రాబోతోంది. తల్లి దర్శకత్వంలో తనయుడు సినిమా చేస్తున్నారు. అదే 'రాయవలస'. ఆ సినిమా వివరాల్లోకి వెళితే...  

కార్తీక్ తొలి సినిమాకు తల్లే దర్శకురాలు!
తెలుగు చిత్రసీమకు కార్తీక్ జయంతి (Karthik Jayanthi) కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా 'రాయవలస' (Rayavalasa Movie). రాయ్‌సన్ ప్రొడక్షన్స్ సంస్థపై రూపొందుతున్న మొదటి చిత్రమిది. ఈ చిత్రానికి కార్తీక్ తల్లి రాధికా జయంతి దర్శకురాలు. తాజాగా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 

Also ReadTN 2026 Vijay: వైఎస్ జగన్ అనుకుంటే విజయ్ వచ్చాడు... దళపతి ఫ్యాన్స్‌కు నట్టి 'టీఎన్ 2026' టెన్షన్

'రాయవలస' చిత్రాన్ని గోపీ కృష్ణ జె నిర్మిస్తున్నారు. అమెరికా నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐ రాధిక దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి అయ్యింది. పల్లెటూరి నేపథ్యంలో చక్కటి కథతో సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన కార్తీక్ ఫస్ట్ లుక్ మంచి స్పందన అందుకోవడం సంతోషంగా ఉందని దర్శక నిర్మాతలు తెలిపారు. అమెరికాలో పెరిగిన కార్తీక్, చిన్నతనం నుంచి తెలుగు సినిమాలపై ఇష్టంతో ఎప్పటికైనా సినిమా ఇండస్ట్రీలోకి రావాలని కలలు కన్నాడు. గాయకుడిగా కొన్ని వేదికలపై పెరఫార్మన్స్‌లు ఇచ్చారు. అలాగే... వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్, ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్‌లలో నటించారు. కార్తీక్ నటుడు మాత్రమే కాదు... రైటర్, లిరిసిస్ట్, డ్యాన్సర్‌ కూడా! 

అసలు రాయవలస కథ ఏమిటి?
వాస్తవ ఘటనల ఆధారంగా 'రాయవలస' చిత్రాన్ని రూపొందించామని దర్శక నిర్మాతలు చెప్పారు. కథ విషయానికి వస్తే... రాజు, రైస్ మిల్ యజమాని. అతని జీవితం చుట్టూ తిరుగుతుందీ కథ. కుటుంబం, స్నేహితులతో సరదాగా సాగుతున్న అతని జీవితం... ఓ అమ్మాయి ప్రవేశం తర్వాత అనూహ్య మలుపులు తీసుకుని ముందుకు వెళుతుంది. ఎమోషన్స్, యాక్షన్, సంగీతం మేళవించి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. 

Also ReadSuriya - Tovino Thomas: సూర్య మార్చాడు... టోవినో థామస్ మార్చే ఛాన్స్ లేనట్టే!

కార్తీక్ జయంతి సరసన శ్రీషా నూలు నటించిన 'రాయవలస'లో అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవి వర్మ, కాశీ విశ్వనాథ్, త్రినాధ్ రావు, సుహాస్, కంచరపాలెం రాజు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కథ - మాటలు: రాఖీ ఏ, ఛాయాగ్రహణం: వీఆర్కే నాయుడు (కిట్టు),సంగీతం: అర్జున్ బాలా (కెనడా), సాహిత్యం: పూర్ణ చారి - కార్తీక్ జయంతి - తరుణ్ సైదులు, గాయకులు: రాహుల్ సిప్లిగంజ్ - ధనుంజయ్ - రోహిత్ పరిటాల - రమ్య బెహరా - సాహితి చాగంటి - సౌజన్య భాగవతుల - వాగ్దేవి - అర్జున్ - కార్తీక్ జయంతి,  స్క్రీన్‌ ప్లే - దర్శకత్వం: రాధిక జయంతి, నిర్మాత: గోపీ కృష్ణ జే.

Also Read: Meghamsh Srihari: క్లీంకార సెల్యులాయిడ్స్‌లో మేఘాంశ్‌ శ్రీహరి హీరోగా సినిమా... టైటిల్, జానర్ డీటెయిల్స్ తెల్సా?

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget