Mass Jathara: RPF ఆఫీసర్ రవితేజ... సైన్స్ టీచర్ శ్రీలీల - మాస్ ఎంటర్‌టైనర్ 'మాస్ జాతర' టీం లేటెస్ట్ ఇంటర్వ్యూ
Raviteja: మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ మూవీ 'మాస్ జాతర' ఈ నెల 31న థియేటర్లలోకి రానుంది. ప్రమోషన్లలో భాగంగా తాజా ఇంటర్వ్యూలో మూవీ టీం ఇంట్రెస్టింగ్ విషయాలలు

Raviteja About Mass Jathara Movie: తన మూవీ కెరీర్‌లో 'మాస్ జాతర'లో పోలీస్ ఆఫీసర్ రోల్ చాలా స్పెషల్ అని మాస్ మహారాజ రవితేజ అన్నారు. రవితేజ, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ అవెయిటెడ్ మాస్ ఎంటర్‌టైనర్ 'మాస్ జాతర' ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. భాను భోగవరపు దర్శకత్వం వహించగా ప్రస్తుతం మూవీ టీం ప్రమోషన్లలో బిజీగా ఉంది. తాజా ఇంటర్వ్యూలో రవితేజ, శ్రీలీల, భాను భోగవరపు మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.
మాస్... కామెడీ... ఎమోషన్
ఈ సినిమాలో తాను ఆర్పీఎఫ్ అధికారిగా కనిపించనున్నట్లు రవితేజ తెలిపారు. 'నా సినీ ప్రయాణంలో మాస్ జాతరలో RPF రోల్ చాలా స్పెషల్. డైరెక్టర్ భాను వెరీ టాలెంటెడ్. ప్రతీ సీన్ అద్భుతంగా మలిచారు. ఏ సీన్ అయినా వేగంగా మార్పులు చేయగలరు. భీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. వినోదం, మాస్ అంశాలతో పాటు హృదయపూర్వక కుటుంబ భావోద్వేగాలతో నిండి ఉంటుంది.' అని చెప్పారు.
సైన్స్ టీచర్‌గా శ్రీలీల
రవితేజతో మరోసారి కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని శ్రీలీల అన్నారు. 'రవితేజ గారితో వర్క్ చేయడం చాలా సులభం. అత్యంత ఆహ్లాదకరమైన సహ నటుల్లో ఆయన ఒకరు. ఎంతో డెడికేషన్‌తో ఆయన వర్క్ పూర్తి చేస్తారు. గాయంతో బాధ పడుతున్నప్పటికీ ఆయన ఆస్పత్రికి వెళ్లే ముందు 'తూ మేరా లవర్' పాటను పూర్తి చేసి వెళ్లారు. మాస్ జాతరలో నేను సైన్స్ టీచర్‌గా, శ్రీకాకుళం యాసలో మాట్లాడే ఉల్లాస భరితమైన పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తా. ఇంతకు ముందు చేసిన రోల్స్ కంటే ఇది పూర్తి డిఫరెంట్. స్క్రిప్ట్ చదివినప్పుడే చాలా ఎంజాయ్ చేశాను. ఇక సెట్‌లో దాన్ని ప్రెజెంట్ చేసే సమయంలో ఆ నవ్వులు రెట్టింపయ్యాయి.' అని తెలిపారు.
Also Read: 'మహిళా మండలి' వల్లే 'మిత్ర మండలి' స్మాష్ - మీమ్స్ నుంచి డైలాగ్స్ వరకూ ట్రైలర్ వేరే లెవల్
'ఓలే ఓలే' సాంగ్‌పై...
ఈ మూవీ షూటింగ్ స్టార్టింగ్ నుంచి తనలో ఆత్మవిశ్వాసం పెరిగేలా మాస్ మహారాజ రవితేజ చేశారని డైరెక్టర్ భాను భోగవరపు తెలిపారు. 'గతంలో సామజవరగమన, వాల్తేరు వీరయ్య చిత్రాలకు రచయితగా వర్క్ చేశా. కామెడీ ఎంటర్‌టైన్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే రవితేజ గారితో మాస్ జాతర మూవీని చేశా. టైటిల్ ఆలోచన రవితేజ గారి నుంచే వచ్చింది. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ వినోదభరితమైన పాత్రలో కనిపిస్తారు. ఓలే ఓలే సాంగ్‌లో లిరిక్స్ కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. పాట రెండో పార్ట్ పూర్తిగా పాజిటివ్ వైబ్ కలిగి ఉంటుంది.' అని క్లారిటీ ఇచ్చారు.
ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, లుక్స్ అదిరిపోయాయి. ఈ మూవీతో రవితేజ కమ్ బ్యాక్ కావాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.





















