అన్వేషించండి

Idli Kottu OTT: ఓటీటీలోకి ధనుష్ 'ఇడ్లీ కొట్టు' - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఇట్స్ అఫీషియల్

Idli Kottu OTT Platform: కోలీవుడ్ స్టార్ ధనుష్ లేటెస్ట్ మూవీ 'ఇడ్లీ కడై' నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.

Dhanush's Idli Kottu Movie OTT Release Date: కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తూనే స్వీయ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'ఇడ్లీ కడై' తెలుగులో 'ఇడ్లీ కొట్టు'గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నెల 1న రిలీజ్ అయిన మూవీ మంచి టాక్ సొంతం చేసుకోగా... నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. 

ఆ రోజే ఓటీటీలోకి!

'ఇడ్లీ కొట్టు' డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా ఈ నెల 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. 'గెట్ రెడీ టు హేవ్ బ్లాక్ బస్టర్ బ్రేక్ ఫాస్ట్ విత్ ఇడ్లీ కడై' అంటూ రాసుకొచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ధనుష్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్‌‌గా నటించారు. వీరితో పాటు అరుణ్ విజయ్, సత్యరాజ్, రాజ్ కిరణ్, షాలిని పాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు. ధనుష్, ఆకాష్ భాస్కరన్ నిర్మించగా... జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు. తెలుగులో మూవీని వేదాక్షర మూవీస్ బ్యానర్‌పై రామారావు చింతపల్లి రిలీజ్ చేశారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

Also Read: పవన్ 'OG' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

స్టోరీ ఏంటంటే?

శంకరాపురంలో శివకేశవులు (రాజ్ కిరణ్) ఇడ్లీ కొట్టు అంటే ఎంతో ఫేమస్. చుట్టుపక్కల గ్రామాల వారు అక్కడికే వచ్చి ఇడ్లీలు తింటారు. అయితే, ఈ బిజినెస్ కేవలం ఊరికే పరిమితం చేయకుండా అంతటా విస్తరించాలని అనుకుంటాడు శివకేశవులు కొడుకు మురళి (ధనుష్). దీన్ని ఫ్రాంచైజీలా డెవలప్ చేసి ఇతర చోట్ల హోటల్స్ పెట్టి డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేస్తాడు. దీనికి తండ్రి మాత్రం అంగీకరించడు. దీంతో ఊరు, కన్నవాళ్లను వదిలేసి పట్నం వచ్చేస్తాడు మురళి. హోటల్ మేనేజ్మెంట్ చేసిన అతను... ఎన్నో ప్రయత్నాల తర్వాత బ్యాంకాక్‌లో పాపులర్ రెస్టారెంట్ చైన్ ఏఎఫ్‌సీ అధినేత విష్ణువర్దన్ (సత్యరాజ్) దగ్గర ఉద్యోగిగా మంచి స్థానంలో ఉంటాడు.

మురళికి మంచి ఉద్యోగం ఇవ్వడమే కాకుండా తన కుమార్తె మీరా (షాలినీ పాండే)ను ఇచ్చి పెళ్లి జరిపించాలనుకుంటాడు విష్ణువర్దన్. సరిగ్గా పెళ్లికి 2 వారాలు ఉందనగా మురళి తండ్రి శివకేశవులు చనిపోతాడు. తండ్రిని చివరిసారిగా చూసేందుకు సొంతూరికి వచ్చిన మురళి.. తండ్రి చివరి కోరిక మేరకు ఇడ్లీ కొట్టు చూసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు ఏం జరిగింది? విష్ణు వర్దన్ కొడుకు అశ్విన్ (అరుణ్ విజయ్) ఇడ్లీ కొట్టుు ఎందుకు నాశనం చేయాలనుకున్నాడు? కల్యాణి (నిత్యామీనన్) ఎవరు? కల్యాణికి మురళికి సంబంధం ఏంటి? మురళికి ఊరి ప్రజలు ఎలా మద్దతు పలికారు? మురళి అనుకున్నది సాధించాడా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
I Nobody OTT : ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget