Mithra Mandali Trailer: 'మహిళా మండలి' వల్లే 'మిత్ర మండలి' స్మాష్ - మీమ్స్ నుంచి డైలాగ్స్ వరకూ ట్రైలర్ వేరే లెవల్
Mithra Mandali Trailer Reaction: యంగ్ హీరో ప్రియదర్శి లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'మిత్ర మండలి' నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఆద్యంతం కామెడీ డైలాగ్స్‌తో నవ్వులు పూయిస్తోంది.

Priyadarshi's Mithra Mandali Trailer Released: టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి, నిహారిక ఎన్ఎం ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ 'మిత్రమండలి'. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ట్రెండ్ అవుతుండగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. సోషల్ మీడియా మీమ్స్ నుంచి డైలాగ్స్ వరకూ అన్నింటినీ మిక్స్ చేసి నవ్వులు పూయించారు.
నవ్వులు పూయిస్తోన్న ట్రైలర్
పోలీస్ స్టేషన్‌లో ఓ ఇంటరాగేషన్‌తో వెన్నెల కిశోర్ కామెడీ టైమింగ్ క్వశ్చన్స్‌తో ట్రైలర్ ప్రారంభం కాగా... ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్‌ల మిత్ర మండలిని ఇంట్రడ్యూస్ చేశారు. ఓ ఫ్యాక్షనిస్ట్ కుమార్తెను ముగ్గురు హీరోలు లవ్ చేయగా ఆ తర్వాత ఏం జరిగిందనేదే ప్రధానాంశంగా మూవీ తెరెక్కినట్లు తెలుస్తోంది. కుక్కలతో విష్ణు ఓయ్ కామెడీ, రాగ్ మయూర్ బైక్ జంపింగ్‌తో నవ్వులు పూయించారు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటూ కమెడియన్ సత్య పీఎస్‌లో ఎంటర్ కావడం... అతనితో వెన్నెల కిశోర్ కామెడీ డైలాగ్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి. సోషల్ మీడియా ఫేమస్ డైలాగ్స్, మీమ్స్‌ను ట్రైలర్‌లో చూపించారు.
ఓ అమ్మాయి లవ్ కోసం 'మిత్ర మండలి' సభ్యులు కొట్టుకుంటుండగా... 'మీలాంటి మహిళా మండలి వల్లేనే మాలాంటి మిత్ర మండలి అంతరించిపోతుంది. నువ్వు నాశనమైపోతావే. నీ ఇన్ స్టా గ్రాంకి లేట్ అయిపోను' అంటూ శాపనార్ధాలు పెట్టడం, కామెడీ డైలాగ్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి.
Also Read: దీపికాకు హీరోయిన్ 'త్రిప్తి డిమ్రి' సపోర్ట్ - 'స్పిరిట్' కాంట్రవర్శీ తర్వాత ఫస్ట్ రియాక్షన్
ట్రెండింగ్‌లో 'జంబర్ గింబర్ లాలా సాంగ్'
'వెంకీ' సినిమాలో బ్రహ్మానందం ఫేమస్ డైలాగ్ 'జంబర్ గింబర్ లాలా'తో ఓ సాంగ్ రిలీజ్ చేయగా ట్రెండ్ అవుతోంది. ఈ పాటలో బ్రహ్మానందం తనదైన కామెడీ స్టెప్పులతో సందడి చేశారు. ఈ పాటకు ఆర్ ఆర్ ధ్రువన్ మ్యూజిక్, లిరిక్స్ అందించగా... అదితి భవరాజు, ఆర్ఆర్ ధ్రువన్ పాడారు. మోయిన్ కొరియోగ్రఫీ అందించారు. టీజర్ నవ్వులు పూయించగా ఈ పాట సైతం వేరే లెవల్‌లో ట్రెండ్ అయ్యింది.
మూవీలో ప్రియదర్శి, నిహారిక్ ఎన్ఎంతో పాటు ప్రసాద్ బెహర, విష్ణు ఓయ్, రాగ్ మయూర్, సత్య, వీటీవీ గణేష్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ఎస్. విజయేంద్ర దర్శకత్వం వహిస్తుండగా... ఆర్ఆర్ ధృవన్ మ్యూజిక్ అందిస్తున్నారు. నిహారిక, విజయేంద్రలకు ఇదే ఫస్ట్ మూవీ. ఫేమస్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ న్యూ బ్యానర్ 'బన్నీ వాస్ వర్క్స్' సమర్పణలో... సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ దీపావళి సందర్భంగా అక్టోబర్ 16న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో దూసుకెళ్తోన్న ప్రియదర్శి మరోసారి ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు.
Unlimited FUN.
— Bunny Vas (@TheBunnyVas) October 7, 2025
Unlimited CHAOS.
Unlimited ENTERTAINMENT. 🎬🔥#MithraMandaliTrailer🕺
See you in theatres on October 16th! 💥😎#MithraMandaliFromOct16th pic.twitter.com/smeHVqw5W9





















