(Source: ECI/ABP News/ABP Majha)
Dubai Seenu Re Release: రవితేజ సినిమా రీ రిలీజ్ - మళ్లీ థియేటర్లలో దుబాయ్ శీను సందడి ఎప్పుడంటే?
Ravi Teja Dubai Seenu movie re release 2024 date: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన 'దుబాయ్ శీను' సినిమా ఈ నెలలో రీ రిలీజ్ కానుంది.
Dubai Seenu movie special shows: మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శ్రీను వైట్లది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. వాళ్లిద్దరూ కలిసి 'నీ కోసం', 'వెంకీ', 'దుబాయ్ శీను' వంటి మంచి సినిమాలు వచ్చాయి. తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదం అందించాయి. గత ఏడాది ఆఖరిలో 'వెంకీ' రీ రిలీజ్ చేయగా... భారీ వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు మరో సినిమా 'దుబాయ్ శ్రీను' రీ రిలీజ్ కోసం థియేటర్లు రెడీ అవుతున్నాయి.
ఫిబ్రవరి 24, 25న 'దుబాయ్ శీను' స్పెషల్ షోలు!
Dubai Seenu re release date: రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వహించిన 'దుబాయ్ శీను' చిత్రాన్ని ఈ నెల ఆఖరి వారంలో రీ రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 24, 25న రెండు తెలుగు రాష్ట్రాలు... ఏపీ, తెలంగాణలో ఎంపిక చేసిన థియేటర్లలో స్పెషల్ షోలు వేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత, ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా 'ఓయ్' సినిమాను రీ రిలీజ్ చేసింది కూడా ఆయనే.
Also Read: ‘ఓయ్’ మూవీ క్రేజ్ - వైజాగ్ థియేటర్‌లో యువతి అదిరిపోయే డ్యాన్స్, నెటిజన్స్ ఫిదా
'దుబాయ్ శీను' సినిమాలో రవితేజ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార యాక్ట్ చేశారు. విలన్ జిన్నా భాయ్ పాత్రలో సుశాంత్ సింగ్ నటించగా... బ్రహ్మానందం, సునీల్, వేణు మాధవ్, నేహా బాంబ్, భాను చందర్, షాయాజీ షిండే, రఘుబాబు, సుప్రీత్, కృష్ణ భగవాన్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
'దుబాయ్ శీను'లో హైలైట్ అంటే కామెడీ!
'దుబాయ్ శీను' సినిమాకు హైలైట్ అంటే... కామెడీ! ముఖ్యంగా దుబాయ్ వెళ్లాలని అనుకున్న తర్వాత వేణు మాధవ్ చేతిలో డబ్బులు పెట్టడం, ఆ తర్వాత వేణు మాధవ్ డబ్బుతో పారిపోవడంతో ముంబైలో రోడ్డు పక్కన వడా పాప్ షాప్ పెట్టడం, వాళ్ల శ్రమను కృష్ణ భగవాన్ దోచుకోవడం వంటి సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఇప్పటికీ నవ్విస్తున్నాయి. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు.
Also Read: ఊరు పేరు భైరవకోన ఆడియన్స్ రివ్యూ: సందీప్ కిషన్ పెర్ఫార్మన్స్ నెక్స్ట్ లెవల్ - మరి సినిమా ఎలా ఉంది?
ప్రస్తుతం రవితేజ చేతిలో ఉన్న సినిమాలకు వస్తే... హరీష్ శంకర్ దర్శకత్వంలో 'మిస్టర్ బచ్చన్' చేస్తున్నారు. హిందీ హిట్ 'రైడ్'కు రీమేక్ ఇది. అయితే... తెలుగుకు తగ్గట్టు హరీష్ శంకర్ పలు మార్పులు చేశారట. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఆయన నటించిన 'ఈగల్' ఫిబ్రవరి 9న థియేటర్లలో విడుదలైంది. ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ హాలీవుడ్ స్థాయిలో ఉందని మంచి పేరు వచ్చింది. పబ్జి ఫైట్ అదిరిందన్నారు ప్రేక్షకులు. అయితే ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదని ట్రేడ్ వర్గాల గుసగుస. ఆ సినిమా రిజల్ట్ పక్కనపెడితే... పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో మరో రెండు మూడు సినిమాలు చేయడానికి మాస్ మహారాజా రెడీ అవుతున్నారని టాక్.
Also Read: ఆశిష్ పెళ్లి - మనవరాలితో దిల్ రాజు డ్యాన్స్, కాబోయే భర్తకు అమ్మాయి ముద్దు!