Ashish Wedding: ఈ రోజే ఆశిష్ పెళ్లి - మనవరాలితో దిల్ రాజు డ్యాన్స్, కాబోయే భర్తకు అమ్మాయి ముద్దు!
ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు సోదరుడు శిరీష్ రెడ్డి కుమారుడు, 'రౌడీ బాయ్స్' హీరో ఆశిష్ ఈ రోజు జైపూర్ సిటీలో ఏడడుగులు వేయనున్నారు. సంగీత్ వేడుక ఘనంగా జరిగింది.

అగ్ర నిర్మాత 'దిల్' రాజు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. జైపూర్ సిటీకి టాలీవుడ్ ప్రముఖులు పలువురు చేరుకున్నారు. 'దిల్' రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ కుమారుడు, వాళ్ల ఫ్యామిలీ నట వారసుడు, యువ కథానాయకుడు ఆశిష్ రెడ్డి ఈ రోజు ఏడు అడుగులు వేయనున్నారు.
ప్రేమికుల రోజు... ఆశిష్ రెడ్డి మ్యారేజు!
'రౌడీ బాయ్స్' సినిమాతో ఆశిష్ రెడ్డి కథానాయకుడిగా పరిచయం అయ్యారు. అది మంచి విజయంతో పాటు వసూళ్లు కూడా సాధించింది. హీరోగా మొదటి సినిమాతో రీల్ లైఫ్‌లో కమర్షియల్ సక్సెస్ అందుకున్న ఆశిష్ రెడ్డి రియల్ లైఫ్‌లో ఈ రోజు ఎప్పటికీ మెమరబుల్ మూమెంట్ అని చెప్పాలి.
ఆశిష్ రెడ్డి పెళ్లి చేసుకోబోయేది ఎవర్ని అంటే?
ఏపీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అద్వైత రెడ్డి మెడలో ఆశిష్ రెడ్డి ఈ రోజు మూడు ముడులు వేయనున్నారు. ఈ సంబంధం కుదరడంలో క్రియేటివ్ జీనియస్ సుకుమార్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు ఇండస్ట్రీ ఖబర్. ఆశిష్, అద్వైత పెళ్లి కోసం రెండు మూడు రోజుల క్రితమే దిల్ రాజు ఫ్యామిలీ జైపూర్ వెళ్లింది. తెలుగు చిత్రసీమ నుంచి కొందరు ప్రముఖులు కూడా వెళ్తున్నారు.
ఘనంగా సంగీత్ వేడుక... పెళ్లి కొడుక్కి వధువు ముద్దు
ఆశిష్ రెడ్డి, అద్వైతల సంగీత్ వేడుక మంగళవారం రాత్రి జైపూర్ సిటీలోని ఓ ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. పాటలు కాబోయే భార్యాభర్తలు ఇద్దరూ డ్యాన్స్ చేశారు. అద్వైతను ఎత్తుకుని ఆశిష్ రెడ్డి డ్యాన్స్ చేయగా... కాబోయే భర్తకు ఆమె ముద్దు పెట్టారు. మనవరాలు, 'బలగం' నిర్మాతల్లో ఒకరైన హన్షిత రెడ్డి కుమార్తెతో 'దిల్' రాజు వేసిన డ్యాన్స్ సంగీత్ వేడుకలో హైలైట్ అని అతిథులు చెబుతున్నారు.
మను దర్శకుడితో మైత్రి ప్రేమ సినిమా...
— ABP Desam (@ABPDesam) February 14, 2024
ఆసక్తి రేపుతున్న కాన్సెప్ట్ పోస్టర్#8Vasantālu #PhanindraNarsetti #NaveenYerneni #RaviShankar @MythriOfficial #manuhttps://t.co/8sqQdBuQLh
హైదరాబాద్‌లో 20వ తేదీన రిసెప్షన్!
జైపూర్‌లో ఈ రోజు వెడ్డింగ్ అయితే... ఈ నెల 20వ తేదీన తెలుగు సినీ, రాజకీయ ప్రముఖుల కోసం హైదరాబాద్ సిటీలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అయితే కొంత మంది సినిమా ప్రముఖులను జైపూర్ లో పెళ్లికి హాజరు కావాల్సిందిగా 'దిల్' రాజు ఫ్యామిలీ స్పెషల్ ఇన్విటేషన్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆశిష్ రెడ్డి రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో 'సెల్ఫిష్' ఒకటి. మరొక సినిమా చర్చల దశలో ఉంది. పెళ్లి తర్వాత మళ్లీ సినిమా పనుల్లో బిజీ అవుతారు.
Also Read: రకుల్, జాకీ అదిరిపోయే నిర్ణయం - పెళ్లి వేడుకలో వాటికి అనుమతి లేదట!
Thank you @KMuraliSurekha Garu for Supporting us. A little effort towards saving the environment is better than no effort.🙏 @revanth_anumula @TelanganaCMO @TSFDCL #MedaramJathara https://t.co/X7MdBlFpex
— ABP Desam (@ABPDesam) February 14, 2024
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

