అన్వేషించండి

Rakul Wedding: రకుల్, జాకీ అదిరిపోయే నిర్ణయం - పెళ్లి వేడుకలో వాటికి అనుమతి లేదట!

Rakul Preet Singh: బాలీవుడ్ హీరోహీరోయిన్ రకుల్, జాకీ భగ్నానీ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఇక ఈ పెళ్లికి సంబంధించి వారు ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Rakul Preet Singh Wedding: టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమయ్యి.. ఇప్పుడు బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం బీ టౌన్‌లో తన పెళ్లి గురించే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నెలలోనే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడానికి సిద్ధమయ్యింది రకుల్. హీరో, ప్రొడ్యూసర్ అయిన జాకీ భగ్నానీతో ఫిబ్రవరీ 21న రకుల్ పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాకుండా తాజాగా వారి పెళ్లి ఎలా జరగాలో కూడా ఈ జంట నిర్ణయించుకుందట. రకుల్, జాకీ తీసుకున్న ఈ వినూత్న నిర్ణయాన్ని విన్న ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.

భిన్నంగా ఆలోచిస్తున్నారు..

గోవాలో జరగనున్న రకుల్, జాకీ పెళ్లి పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా జరగనుందని సమాచారం. అందుకే ఎవ్వరికీ వెడ్డింగ్ కార్డ్‌ను నేరుగా పంపలేదట. కేవలం వర్చువల్‌గానే అందరికీ ఇన్విటేషన్ వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా పెళ్లి వేడుకలో ఎక్కడా టపాసులు కూడా కాల్చకూడదని ఫిక్స్ అయ్యారట. ఇవన్నీ విన్న ప్రేక్షకులు.. రకుల్, జాక్నీ కాస్త భిన్నంగా మాత్రమే కాకుండా పర్యావరణానికి హాని కలిగించకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని అనుకుంటున్నారు. అంతే కాకుండా వీరి పెళ్లి వేడుక వల్ల ఎంత కార్బన్ డయాక్సైడ్ గాలిలో కలిసిందో కొలిచి.. దానికి తగినట్టుగా ఎన్ని మొక్కలు నాటాలో రకుల్, జాకీ డిసైడ్ అవ్వనున్నట్టు తెలుస్తోంది.

దగ్గర మనుషులు మాత్రమే..

గాలిలో కలిసిన కార్బన్ శాతాన్ని గమనించి మొక్కలు నాటడం అనేది ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. అందుకే రకుల్, జాకీలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్వయంగా రకుల్, జాకీ కలిసి పెళ్లి రోజు గానీ లేదా ఆ తర్వాత రోజు గానీ ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతారని తెలుస్తోంది. అంతే కాకుండా ఇప్పటివరకు ఎన్నో బాలీవుడ్ వెడ్డింగ్స్ తరహాలోనే ఇందులో కూడా గెస్టుల చేతిలో ఫోన్స్ ఉండకూడదు. చాలా తక్కువమంది సమక్షంలో రకుల్, జాకీ పెళ్లి చేసుకోనున్నారు. కేవలం వీరిద్దరికీ సంబంధించిన దగ్గర మనుషులు మాత్రమే ఈ వేడుకకు హాజరవ్వనున్నారట. అందుకే వారి ప్రైవసీకి భంగం కలగకుండా గెస్టులు ఫోన్ ఉపయోగించకూడదు అనే రూల్ పెట్టాలని రకుల్, జాకీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

దగ్గరుండి డెకరేషన్..

రకుల్, జాకీ పెళ్లిలో జరిగే ప్రతీ డెకరేషన్‌ను వారు దగ్గర ఉండి పరిశీలించడం మొదలుపెట్టారట. పెళ్లిలోని ప్రతీ డెకరేషన్‌లో వారి జ్ఞాపకాలని జతచేరుస్తారని సమాచారం. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం రకుల్, జాకీ వారి బిజీ లైఫ్‌ను కొన్నిరోజులు పక్కన పెట్టారు. రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ కలిసి స్క్రీన్‌పై నటించకపోయినా.. ఆఫ్ స్క్రీన్ మాత్రం వీరి మనసులు కలిశాయి. రకుల్ లీడ్ రోల్ చేసిన ‘రన్‌వే 36’ సినిమాను జాకీ భగ్నానీ నిర్మించాడు. సినిమా ఒప్పుకునేంత వరకు ఈ విషయం తనకు తెలియదని అప్పట్లో రకుల్ బయటపెట్టింది. ఇక వారిద్దరూ కలిసి పనిచేయడం అదే మొదటిసారి. రెండేళ్ల క్రితం వీరి ప్రేమ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది ఈ జంట. అప్పటినుండి పలుమార్లు వీరి పెళ్లి జరగనుందని రూమర్స్ వైరల్ అయ్యాయి. 

Also Read: తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న కల్ట్ లవ్ స్టోరీలు ఇవే - ప్రేమికులు తప్పక చూడాల్సిన చిత్రాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget