అన్వేషించండి

Oye Re-Release: ‘ఓయ్’ మూవీ క్రేజ్ - వైజాగ్ థియేటర్‌లో యువతి అదిరిపోయే డ్యాన్స్, నెటిజన్స్ ఫిదా

సిద్ధార్థ్‌, షామిలీ జంటగా నటించిన ఈ ప్రేమకథా చిత్రం ‘ఓయ్‌’. వాలంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ రీ రిలీజ్ అయ్యింది. వైజాగ్ లో ఈ సినిమా చూస్తూ ఓ యువతి చేసిన డ్యాన్స్ నెట్టింట వైరల్ గా మారింది.

Oye Re-Release: టాలెంటెడ్ హీరో సిద్దార్థ్ హీరోగా, షామిలీ హీరోయిన్ గా నటించిన మూవీ ‘ఓయ్’. ఆనంద్ రంగ డైరెక్షన్ లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. 2009 లో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయినా, ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకుల మదిని దోచుకుంది. ఈ సినిమాను వాలెంటైన్స్ డే సందర్భంగా మేకర్స్ రీ రిలీజ్ చేశారు.  

ధియేటర్ లో డ్యాన్స్ తో అదరగొట్టిన యువతి

థియేటర్లలో ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తోంది. ఆడియెన్స్ ఈ సినిమా క్లిప్స్ షేర్ చేస్తూ  సోషల్ మీడియా వేదిగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2009లో ప్రేక్షకుల నుంచి అనుకున్న స్థాయిలో ఆదరణ లభించకపోయినా, రీ రిలీజ్ సందర్భంగా చాలా చోట్ల షోలు చాలా చోట్ల హౌస్ ఫుల్స్ అయ్యాయి. హైదరాబాద్ మొదలుకుని వైజాగ్ దాకా అన్ని చోట్ల ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. హీరోయిన్ షామిలికి సిద్దు పుట్టిన రోజు సందర్భంగా వరస కానుకలతో సర్ప్రైజ్ ఇచ్చే ఎపిసోడ్ కి ఈలలు కేకలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పాటలకు సీట్ల నుంచి లేచి మరీ డాన్సులు చేస్తున్న వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. వైజాగ్ లో ఓ యువతి స్క్రీన్ మీద పాట వస్తుంటే అదిరిపోయే డ్యాన్స్ వేస్తూ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. నెటిజన్స్ ఆమె జోష్ ఫుల్ డ్యాన్స్ కు ఫిదా అవుతున్నారు.  

View this post on Instagram
 
A post shared by Avinash Bommidi (Content creator) (@vizag_entrepreneur)

View this post on Instagram
 
A post shared by Avinash Bommidi (Content creator) (@vizag_entrepreneur)

డైరెక్టర్ ఆనంద్ రంగా ఏమ్నారంటే?

వాస్తవానికి 2009లో రిలీజైన ‘ఓయ్’ అప్పుడు అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. కావాల్సినంత ఎమోషన్ ఉన్నా, అభిమానులకు అంతగా ఎక్కలేదు. షామిలి పాత్రకు ‘గీతాంజలి’ తరహాలో ఎండింగ్ ఇవ్వడం ఆడియెన్స్ కు పెద్దగా నచ్చలేదు. సిద్దార్థ్ తన భావోద్వేగాలను గొప్పగా ప్రదర్శించినా, ఆనుకున్న స్థాయిలో ఆడియెన్స్ ఆదరించలేదు. ఈ సినిమా తర్వాత దర్శకుడు ఆనంద్ రంగా మరో సినిమా చేయలేదు. అయితే, యువన్ శంకర్ రాజా పాటలు మాత్రం బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు అప్పుడు పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా, రీ రిలీజ్ లో మాత్రం ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.  అంతేకాదు, ఇవాళ ప్రీమియర్లు వేస్తున్న ‘ఊరిపేరు భైరవకోన’ తర్వాత ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నది ‘ఓయ్’ మూవీకి మాత్రేమే కావడం విశేషం. ఈ సందర్భంగా దర్శకుడు ఆనంద్ రంగ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు. ‘గూస్ బంప్స్, హ్యాపీ టియర్స్, లవ్ యూ ఆల్’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

Read Also: రూ. 170 కోట్లకు మించి ఇచ్చినా రాజీపడను, ‘శ్రీమంతుడు’ కేసుపై శరత్ చంద్ర హాట్ కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget