అన్వేషించండి

Animal Movie : 'యానిమల్'లో రణబీర్, రష్మిక ఫస్ట్ నైట్ అంత వయలెంట్‌గా ఉంటుందా?

సందీప్ రెడ్డి వంగా ఫిల్మ్ మేకింగ్ స్టైల్ 'యానిమల్' టీజర్ అంతటా కనిపించింది. విలన్లపై గొడ్డలి వేటు గట్టిగా పడింది. సినిమాలో వయలెన్స్ గురించి హిట్ ఇచ్చింది. ఫస్ట్ నైట్ సీన్ మీద డిస్కషన్ జరుగుతోంది. 

'యానిమల్' (Animal Movie) టీజర్ చూశారా? విలన్ల మీద హీరోల గొడ్డలి వేటు చాలా గట్టిగా పడింది. రక్తం ఏరులై పారింది. సినిమాలో వయలెన్స్ ఏ విధంగా ఉంటుంది? అనే ప్రశ్నకు టీజర్ స్పష్టమైన జవాబు ఇచ్చింది. తెలుగులో 'అర్జున్ రెడ్డి', తర్వాత ఆ కథతో హిందీలో తీసిన 'కబీర్ సింగ్' సినిమాలతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మేకింగ్ స్టైల్ ఏంటనేది జనాలకు తెలుసు. అందువల్ల, ఆ టీజర్ చూసిన ప్రేక్షకులు సినిమా ఎలా ఉంటుందోనని ఊహించుకున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే కాదు, రొమాంటిక్ సీన్స్ కూడా చాలా వయలెంట్‌గా ఉంటాయట. 

రణబీర్ కపూర్, రష్మిక మధ్య ఫస్ట్ నైట్ సీన్!
'యానిమల్' సినిమాలో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) కథానాయకుడు. ఆయన జోడీగా రష్మికా మందన్నా (Rashmika Mandanna) నటించారు. టీజర్ చూస్తే... ఈ సినిమాలో ఇద్దరికీ పెళ్లైందని తెలుస్తుంది. ఫస్ట్ నైట్ సీన్ కూడా ఉందని బాలీవుడ్ టాక్. ఒకవైపు ఫస్ట్ నైట్... మరో వైపు విలన్స్ ఎటాక్... రెండిటినీ బాలన్స్ చేస్తూ సందీప్ రెడ్డి వంగా తీసిన సీన్స్ సినిమాలో హైలైట్ అవుతాయని టాక్. 

రణబీర్, రష్మిక పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ జరుగుతుండగా... విలన్స్ ఎటాక్ చేస్తారట! ఒకవైపు గాల్లోకి విలన్లను పంపిస్తూ... మరో వైపు రొమాన్స్ చేసిన సన్నివేశాలు బాగా వచ్చాయని ఇన్‌సైడ్ టాక్. సందీప్ రెడ్డి వంగా మేకింగ్ చూసి ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అవుతారట. ఇప్పటి వరకు రష్మిక ఇటువంటి సీన్ చేయలేదని ముంబై సినిమా జనాలు అంటున్నారట.  

Also Read : భార్య ఉండగా మరొక అమ్మాయితో - ఎఫైర్ రివీల్ చేసిన ఈటీవీ ప్రభాకర్

'యానిమల్' కథ చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందని, రణబీర్ కపూర్ ఈ సినిమాలో భిన్నమైన పాత్రలో కనిపిస్తారని చిత్ర బృందం పేర్కొంది. ఆల్రెడీ విడుదలైన టీజర్ చూస్తే... మాఫియా నేపథ్యంలో తీసిన సినిమా అని అర్థం అవుతోంది. యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన 'యానిమల్' కోసం ర‌ణబీర్ స్పెష‌ల్‌ మేకోవ‌ర్‌ అయ్యారట. ఆయనకు తండ్రిగా హిందీ సీనియర్ హీరో అనిల్ కపూర్ నటించారు. రష్మిక గీతాంజలి పాత్రలో కనిపించనున్నారు. 

Also Read 'మంత్ ఆఫ్ మధు' రివ్యూ : 'కలర్స్' స్వాతి బోల్డ్ సీన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?

'యానిమల్' తర్వాత టీ సిరీస్ సంస్థలో సందీప్ రెడ్డి వంగా మరో రెండు సినిమాలు చేయనున్నారు. అందులో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందే 'స్పిరిట్' ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేయనున్న 'భద్రకాళి' మరొకటి. ఆ రెండు సినిమాలు సైతం పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తూ తెరకెక్కించే సినిమాలే. ప్రస్తుతం 'యానిమల్' కాకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2'లో సైతం రష్మిక నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'రెయిన్ బో' సినిమా ఒకటి ఉంది. మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
Embed widget