By: ABP Desam | Updated at : 09 Apr 2023 05:22 PM (IST)
రష్మికా మందన్నా (Image courtesy - @Rashmika Mandanna/Instagram)
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'రెయిన్ బో' (Rainbow Movie). ఆల్రెడీ అల్లు అర్జున్ 'పుష్ప'తో పాన్ ఇండియా లెవల్ ఫేమ్ ఆమెకు వచ్చింది. హిందీలో కూడా సినిమాలు చేస్తున్నారు. అయితే, ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే... రష్మిక ఫస్ట్ పాన్ ఇండియా ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రమిది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... రష్మిక షూటింగ్ స్టార్ట్ చేశారు.
'రెయిన్ బో' సెట్స్ నుంచి...
సాధారణంగా ఆదివారం సినిమా షూటింగులకు సెలవు ఇస్తారు. కానీ, రష్మిక & మిగతా యూనిట్ సభ్యులు 'రెయిన్ బో' షూటింగ్ చేశారు. సెట్స్ నుంచి ఓ ఫోటో పోస్ట్ చేశారామె. అయితే, లుక్ బయటకు కనిపించకుండా దాచేశారు. అదీ సంగతి! ఈ నెల 3న పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం అయ్యింది.
రష్మిక జోడీగా దేవ్ మోహన్!
'రెయిన్ బో'లో రష్మిక జోడీగా మాలీవుడ్ యంగ్ హీరో దేవ్ మోహన్ (Dev Mohan) నటిస్తున్నారు. సమంతతో 'శాకుంతలం' తర్వాత ఆయన నటిస్తున్న చిత్రమిది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో శాంతరూబన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
సమంత నుంచి...
రష్మిక దగ్గరకు!
తొలుత 'రెయిన్ బో' సినిమాను సమంత రూత్ ప్రభు (Samantha)తో తీయాలని ప్లాన్ చేశారు. డ్రీమ్ వారియస్ పిక్చర్స్ సంస్థ నుంచి ఆమెతో సినిమా చేస్తున్నట్లు ఓ ప్రకటన కూడా వచ్చింది. అయితే, ఏమైందో? ఏమో? సమంత బదులు రష్మికతో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళారు.
'రెయిన్ బో' ప్రారంభోత్సవంలో నిర్మాత ఎస్.ఆర్. ప్రభును సమంతతో అనుకున్న సినిమా రష్మిక దగ్గరకు ఎలా వచ్చింది? అని ప్రశ్నించగా... ''సినిమా ఇండస్ట్రీలో ఓ మాట ఉంటుంది. కథే ఆర్టిస్టులను వెతుక్కుంటుందని! 'రెయిన్ బో' కథ కూడా ఆ విధంగా రష్మిక దగ్గరకు వెళ్ళింది. మేం ఈ ఫ్లోను డిస్టర్బ్ చేయాలని అనుకోలేదు'' అని సమాధానం ఇచ్చారు.
Also Read : హీరోయిన్లకు చీర, జాకెట్ తప్ప ఇంకేమీ ఉండదు - 'శ్రీదేవి చిరు' శృతి అసహనం
'రెయిన్ బో' సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. దీనిని హిందీ సహా ఇతర భాషల్లో కూడా విడుదల చేస్తామని నిర్మాతగా ఎస్.ఆర్. ప్రభు స్పష్టం చేశారు. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా... ఎం. భాస్కరన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు : ఇ. సంగతమిళన్, ప్రొడక్షన్ డిజైనర్ : వినీష్ బంగ్లాన్, కళా దర్శకత్వం : సుబెంథర్ పిఎల్.
రష్మిక చేతిలో భారీ సినిమాలు
'రెయిన్ బో' కాకుండా రష్మిక చేతిలో భారీ సినిమాలు ఉన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన 'పుష్ప 2'లో నటిస్తున్నారు. అదీ పాన్ ఇండియా సినిమాయే. ఇక, హిందీలో రణబీర్ కపూర్ జోడీగా 'యానిమల్' చేస్తున్నారు. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న సినిమా అది. తెలుగులో కూడా విడుదల కానుంది. ఈ రెండు కాకుండా ఇటీవల నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించారు రష్మిక.
Also Read : మళ్ళీ లుంగీ కట్టిన పవన్ కళ్యాణ్ - 'ఉస్తాద్' సెట్స్ నుంచి లీకైన లుక్ చూశారా?
Chiranjeevi Cancer : నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను - మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు
Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?
Bimbisara-2: ‘బింబిసార 2’ నుంచి తప్పుకున్న వశిష్ఠ్, కొత్త దర్శకుడు ఎవరో తెలుసా?
Kota Srinivasa Rao: పవన్ కళ్యాణ్ కు కోటా శ్రీనివాసరావు కౌంటర్, సినిమా సర్కస్ లా మారిపోయిందని ఆగ్రహం!
Coromandel Express Accident: రాంగ్ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్
Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?
Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?
BGMI Tips: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలనుకుంటున్నారా - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!