News
News
వీడియోలు ఆటలు
X

Pawan Kalyan Lungi Photo : మళ్ళీ లుంగీ కట్టిన పవన్ కళ్యాణ్ - 'ఉస్తాద్' సెట్స్ నుంచి లీకైన లుక్ చూశారా?

Ustaad Bhagat Singh Leaked Pic : 'ఉస్తాద్ భగత్ సింగ్' సెట్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిక్స్ ట్విట్టర్ లో లీక్ అయ్యాయి.

FOLLOW US: 
Share:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా ఆయన వీరాభిమాని, తనకు తానుగా పవన్ వీర భక్తుడిగా పేర్కొన్న యువ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh Movie). ఈ నెల 5న రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం ఎర్రమంజిల్ ఏరియాలో పవన్, ఇతర తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. 

పవన్ లుంగీ లుక్ లీక్ చేశారుగా!
Pawan Kalyan Lungi Look : 'ఉస్తాద్ భగత్ సింగ్'లో కొన్ని సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ లుంగీతో కనిపిస్తారు. సెట్స్ నుంచి ఆయన ఫోటోలను ఎవరో లీక్ చేశారు. ఈ సినిమాలో పవన్ పోలీసుగా కనిపించనున్నారు. ఇంతకు ముందు హరీష్ శంకర్ దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్'లో సైతం పోలీస్ రోల్ చేశారు. అలాగే, 'భీమ్లా నాయక్' సినిమాలోనూ పోలీస్ రోల్ చేశారు. ఆ రెండు సినిమాల్లో కూడా లుంగీ లుక్ ఉంటుంది. మరోసారి లుంగీ వేయడంతో ఫ్యాన్స్ సూపర్ హిట్ పక్కా అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 

'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం పవన్ కళ్యాణ్ సన్నిహిత మిత్రుడు, ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్ సాయి భారీ సెట్ వేశారు. కొన్ని రోజుల తర్వాత ఆ సెట్ లో షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. 

Also Read : తారకరత్న మరణించి నేటికి 50 రోజులు - ఆయన భార్య లేటెస్ట్ పోస్ట్ చూశారా?

పదేళ్ళ తర్వాత...
'గబ్బర్ సింగ్' కాంబో!
పవన్ కళ్యాణ్ అంటే హరీష్ శంకర్ (Harish Shankar)కు విరీతమైన అభిమానం. తన అభిమాన హీరోను దర్శకత్వం వహించే అవకాశం 'గబ్బర్ సింగ్'తో ఆయనకు లభించింది. ఆ సినిమా మే 11, 2012న విడుదల అయ్యింది. బాక్సాఫీస్ బరిలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. అది విడుదలైన సుమారు పదకొండేళ్ళకు మళ్ళీ పవన్, హరీష్ శంకర్ కాంబినేషన్ కుదిరింది. అందుకని, షూటింగ్ మొదలైన రోజున 'ఎన్నాళ్ళో వేచిన ఉదయం...' అంటూ హరీష్ శంకర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.  

తమిళ హిట్ 'తెరి'కి రీమేక్ ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవన్ కళ్యాణ్ ఇమేజ్, తెలుగు నేటివిటీ దృష్టిలో పెట్టుకుని హరీష్ శంకర్ కథలో మార్పులు చేశారట. 'గబ్బర్ సింగ్' చూస్తే... సల్మాన్ ఖాన్ 'దబాంగ్' రీమేకేనా? అని డౌట్ వస్తుంది. ఈ సినిమాకు కూడా అలా చేశారట.

శ్రీలీల ఒక హీరోయిన్... 
పూజా హెగ్డే ఓకే అంటారా?
'తెరి'లో సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. మరి, పవన్ కళ్యాణ్ సరసన ఎవరు నటిస్తారు? ఇప్పుడీ ప్రశ్న ఎక్కువ మందిలో ఉంది. ఓ నాయికగా శ్రీలీలను ఎంపిక చేశారు. మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డే అని టాక్. అయితే, ఆమె ఇంకా సినిమాకు సంతకం చేయలేదు. త్వరలో చేసే అవకాశాలు ఉన్నాయట. 

'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించనున్నారు. సినిమాకు గత ఏడాది డిసెంబర్ లో పూజ చేశారు. ఇందులో వీజే సన్నీ ఓ రోల్ చేస్తున్నారు.

Also Read 'ఐ లవ్ యు ఇడియట్' రివ్యూ : తెలుగులో శ్రీలీల ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి రిలీజ్ చేశారా?

Published at : 09 Apr 2023 10:28 AM (IST) Tags: Harish Shankar Pawan Kalyan ustaad bhagat singh Sreeleela Pawan Lungi Look

సంబంధిత కథనాలు

మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!

మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!

Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ

Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ

సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో - ఆమెపై క్రష్ ఉందంటూ కామెంట్స్!

సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో - ఆమెపై క్రష్ ఉందంటూ కామెంట్స్!

Arjun Kapoor-Malaika Arora: బెడ్‌పై అర్ధనగ్నంగా బాయ్‌ ఫ్రెండ్ - మలైకా అరోరాపై మండిపడుతున్న నెటిజన్స్!

Arjun Kapoor-Malaika Arora: బెడ్‌పై అర్ధనగ్నంగా బాయ్‌ ఫ్రెండ్ - మలైకా అరోరాపై మండిపడుతున్న నెటిజన్స్!

‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్

‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్

టాప్ స్టోరీస్

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా

Jogi Ramesh: డర్టీ బాబు, టిష్యూ మేనిఫెస్టో - మంత్రి వ్యాఖ్యలు, చించేసి చెత్తబుట్టలో వేసి మరీ

Jogi Ramesh: డర్టీ బాబు, టిష్యూ మేనిఫెస్టో - మంత్రి వ్యాఖ్యలు, చించేసి చెత్తబుట్టలో వేసి మరీ

Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !

Andhra News  :  జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం  !

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!