Shruti Hassan : హీరోయిన్లకు చీర, జాకెట్ తప్ప ఇంకేమీ ఉండదు - 'శ్రీదేవి చిరు' పాటపై శృతి సెటైర్స్
శృతి హాసన్ ఇటీవల తమిళ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో 'వాల్తేరు వీరయ్య' సినిమాలో పాటపై శృతి హాసన్ అసహనం వ్యక్తం చేశారు.
![Shruti Hassan : హీరోయిన్లకు చీర, జాకెట్ తప్ప ఇంకేమీ ఉండదు - 'శ్రీదేవి చిరు' పాటపై శృతి సెటైర్స్ Shruti Hassan gets trolled by Mega fans coz her comments on age gap with heros Sridevi Chiranjeevi song Shruti Hassan : హీరోయిన్లకు చీర, జాకెట్ తప్ప ఇంకేమీ ఉండదు - 'శ్రీదేవి చిరు' పాటపై శృతి సెటైర్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/09/aa9d2c4b08df213753525148c04997351681038678407313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సంక్రాంతికి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya Movie ), నట సింహం నందమూరి బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' (Veera Simha Reddy Movie)లో శ్రుతీ హాసన్ కథానాయికగా నటించారు. ఆ రెండు సినిమాల్లో నటించినందుకు సుమారు మూడు కోట్ల రూపాయలు పారితోషికం అందుకున్నట్లు ఫిల్మ్ నగర్ గుసగుస.
డబ్బు కోసం తన తండ్రి వయసు ఉన్న కథానాయకులతో శృతి హాసన్ (Shruti Hassan) నటించారని ఆమెను విమర్శించిన వ్యక్తులు ఉన్నారు. కన్న కుమార్తె వయసున్న అమ్మాయితో రొమాన్స్ ఏంటని హీరోలను విమర్శించిన వ్యక్తులు సైతం సోషల్ మీడియాలో మనకు కనబడతారు. ఆ విమర్శలపై తాజాగా తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతి హాసన్ స్పందించారు.
విమర్శలను పట్టించుకోను!
హీరో హీరోయిన్ల మధ్య ఏజ్ డిఫరెన్స్ గురించి వస్తున్న విమర్శలను తాను అసలు పట్టించుకోనని శృతి హాసన్ స్పష్టం చేశారు. తనను ప్రేక్షకులు ఇంకా చిన్న పిల్లలా చూస్తున్నందుకు ఆ వ్యాఖ్యలను ప్రశంసగా స్వీకరిస్తానని తెలిపారు. సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాదని, హిందీ ఇసినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం రెండు పెద్ద సినిమాల్లో హీరో హీరోయిన్స్ మధ్య ఏజ్ గ్యాప్ అంతే ఉందన్నారు.
లెజెండరీ హీరోలతో నటించే అవకాశం వచ్చినప్పుడు తాను ఎందుకు 'నో' చెప్పాలని శృతి హాసన్ ఎదురు ప్రశ్నించారు. విమర్శలు తనపై రావడం లేదని, చిరంజీవి గారు లేదా బాలకృష్ణ గారు లేదా తనను ఎవరూ విమర్శించడం లేదని, ఆ పాత్ర అలా రాసినందుకు దర్శకులను విమర్శిస్తున్నారు కనుక వాటికి తాను ప్రాముఖ్యం ఇవ్వనని ఆమె చెప్పేశారు.
మంచులో తీసే పాటలు ఆపేయండి! - శృతి హాసన్
చిరంజీవితో నటించడాన్ని తాను ఎంజాయ్ చేశానని చెప్పిన శృతి హాసన్... 'నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవినవుతా' పాటపై పరోక్షంగా విమర్శలు చేశారు. తనకు అటువంటి పాటలు ఎంత మాత్రం ఇష్టం లేదని చెప్పుకొచ్చారు.
''మంచులో డ్యాన్స్ చేయడం నాకు ఇష్టం లేదు. స్నోలో డ్యాన్స్ చేయడం చాలా కష్టం కూడా! హీరోలు జాకెట్ వేసుకోవచ్చు. అయితే... హీరోయిన్లు శారీ అండ్ బ్లౌజ్ తప్ప జాకెట్, శాలువా, కోట్ వంటివి ఏవీ వేసుకోకూడదు. ఇటువంటి పాటలు తీయడం ఆపేయండి. దయచేసి నా మాటలను ఓ పిటీషన్ కింద తీసుకోండి. నేను ఇటీవల అటువంటి పాట ఒకటి చేశా. దర్శకుడి దగ్గరకు వెళ్లి నా మనసులో మాట చెప్పే ప్రయత్నం చేశా. వాళ్ళకు మంచులో పాట అంటే చాలా ఇష్టం. నేను ఏమీ చేయలేకపోయా'' అని శృతి హాసన్ పేర్కొన్నారు.
'చిరు శ్రీదేవి' పాటలో చిరంజీవి జాకెట్ వేసుకున్నారు. స్లీవ్ లెస్ బ్లౌజ్ & శారీ మాత్రమే శృతి హాసన్ ధరించి కనిపించారు. అందువల్ల, ఆ పాట మీద శృతి హాసన్ సెటైర్ వేశారని అనుకోవాలి. అంతే కాదు... ఆమెను విమర్శల పాలు కూడా చేశాయి.
Also Read : ఎన్టీఆర్ సాంగులో హుక్ లైన్ టైటిల్ గా, సింగిల్ క్యారెక్టర్ తో సినిమా
శృతి హాసన్ కోట్ల రూపాయల పారితోషికం తీసుకుని సినిమాలు చేస్తున్నారని, ఆమె ఇటువంటి కామెంట్స్ చేయడం తగదని కొందరు కామెంట్ చేస్తున్నారు. అరవై ఏళ్ళ వయసులో చిరంజీవి అంత కష్టపడితే శృతి హాసన్ ఇలా కామెంట్ చేయడం ఏమిటని శృతి మీద విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
Also Read : మళ్ళీ లుంగీ కట్టిన పవన్ కళ్యాణ్ - 'ఉస్తాద్' సెట్స్ నుంచి లీకైన లుక్ చూశారా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)