అన్వేషించండి

Rashmika Mandanna: రష్మికను పూర్తిగా మార్చేసిన శేఖర్ కమ్ముల - 'కుబేర'లో ఆమె ఫస్ట్ లుక్ చూశారా?

Kubera Movie - Rashmika Look: నేషనల్ క్రష్ రష్మికా మందన్నాను దర్శకుడు శేఖర్ కమ్ముల పూర్తిగా మార్చేశారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా 'కుబేర'లో ఆమె లుక్ నేడు విడుదల చేశారు.

Rashmika Mandanna Look In Kubera Movie: రష్మిక... అభిమానులు ముద్దుగా నేషనల్ క్రష్ అని పిలుస్తారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అయితే ఆమెను 'క్రష్మిక' అంటుంటారు. ఇప్పటి వరకు రష్మికా మందన్నాను ప్రేమ కథల్లో చూసి ఉంటారు. పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లలో చూసి ఉంటారు. అయితే, ఆమెను ప్రేక్షకులు ఎప్పుడూ చూడని పాత్రలో 'కుబేర'లో చూడబోతున్నారు. నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ మేకర్ శేఖర్ కమ్ముల ఆమెను అంతలా మార్చారు. 

'కుబేర'లో రష్మిక ఫస్ట్ లుక్ చూశారా?
కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush), కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'కుబేర'. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్. కథలో అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ రోజు ఆమె ఫస్ట్ లుక్, వీడియో గ్లింప్స్ విడుదల చేశారు.

భూమిలో పాతిన డబ్బులు వెలికి తీసిన రష్మిక!
'కుబేర'లో రష్మిక ఫస్ట్ లుక్ చూస్తే సాదాసీదాగా ఉంది. చుడిదార్ ధరించి పక్కింటి అమ్మాయి తరహాలో కనిపించారు. కానీ, ఆవిడ చేసిన పని చూస్తే ప్రేక్షకులకు షాక్ తగలడం ఖాయం. ఒక పలుగు, పార పట్టుకుని రాత్రి వేళలో నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. అక్కడ తవ్వడం మొదలు పెట్టారు. కాసేపటికి భూమిలో నుంచి బయటకు ఒక సూట్ కేస్ వచ్చింది. అది ఓపెన్ చేస్తే... సూట్ కేస్ నిండా డబ్బు. ఆ డబ్బును అక్కడి నుంచి తీసుకు వెళుతున్న రష్మిక! గ్లింప్స్ చూస్తే... ఆమె ఇప్పటి వరకు చేసిన పాత్రలకు ఎటువంటి సంబంధం లేనటువంటి పాత్ర చేశారని అర్థం అవుతోంది.

Also Read: థియేటర్లలో విడుదలైన ఏడాదికి ఓటీటీలోకి ఫహాద్ ఫాజిల్ మలయాళ థ్రిల్లర్... ధూమం తెలుగు డిజిటల్ రిలీజ్ ఎప్పుడంటే?

మైథలాజికల్ సోషల్ డ్రామాగా 'కుబేర' తెరకెక్కుతోంది. ఆల్రెడీ ధనుష్, నాగార్జున క్యారెక్టర్లకు సంబందించిన ఇంట్రడక్షన్ ప్రోమోలు విడుదల చేశారు. ఆ రెండిటికీ మంచి స్పందన లభించింది. ఇప్పుడీ రష్మిక వీడియో గ్లింప్స్ సైతం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. సినిమాపై ఆసక్తి పెంచుతోంది.

ప్రస్తుతం 'కుబేర' చిత్రీకరణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ప్రొడ్యూస్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న చిత్రమిది.

Also Readమీర్జాపూర్ 3 వెబ్ సిరీస్ రివ్యూ: మున్నా లేడు, కాలిన్ కనిపించేదీ తక్కువే - గుడ్డు గూండాగిరి హిట్టా? ఫట్టా?


'కుబేర' చిత్రానికి జాతీయ పురస్కారం అందుకున్న నటీనటులు, పలువురు సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. జిమ్ శరభ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. భారీ నిర్మాణ వ్యయంతో ఈ సినిమా రూపొందుతోంది. ఒక వైపు చిత్రీకరణ జరుగుతోంది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget