Rashmika Mandanna: ఏం జరుగుతోంది రష్మిక? బాయ్‌ఫ్రెండ్‌తో రొమాంటిక్ సాంగ్ రెడీ... రిలీజ్ ఎప్పుడంటే?
Rashmika Girlfriend Songs: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఫిమేల్ సెంట్రిక్ సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్'. అందులోని రెండో పాట 'ఏం జరుగుతోంది...' రిలీజుకు రెడీ అయ్యింది.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్న ఫిమేల్ సెంట్రిక్ సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్' (The Girlfriend Movie). ఇందులో ఆమెకు జంటగా 'దసరా' ఫేమ్, కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు. వాళ్ళిద్దరి మీద తీసిన మొదట పాట 'నదివే...' కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయ్యింది. ఇప్పుడు రెండో పాటను రిలీజ్ చేసేందుకు టీమ్ రెడీ అయ్యింది.
ఏం జరుగుతోంది?
The Girlfriend Second Single: 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాలో 'ఏం జరుగుతోంది...' అంటూ ఓ పాటను రూపొందించారు. ప్రముఖ గాయని, ఈ చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి పాడిన ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యం అందించారు. ఈ సినిమాకు మలయాళ 'హృదయం', విజయ్ దేవరకొండ 'ఖుషి' ఫేమ్ హేషమ్ అబ్దుల్ వాహెబ్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. 'ఏం జరుగుతోంది...' పాటను ఈ నెల 26వ తేదీన (మంగళవారం) విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
Also Read: పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ వీడియో... ఫ్రీగా హరిహర వీరమల్లు ఫస్ట్ ఫైట్ చూడొచ్చు... లింక్ క్లిక్ చేయండి
Everything that happens in love - from falling to the feeling - is special ❤️#TheGirlfriend second single out on August 26th 💕#EmJaruguthondhi #KyaHoRahaHaiYe #OKelvikkuriye #YaavKadegeKathe #NeeAriyunnundo
— Geetha Arts (@GeethaArts) August 24, 2025
A @HeshamAWMusic musical delight ✨
In the soulful voice of… pic.twitter.com/VsdKztFDvM
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంస్థలపై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి సంయుక్తంగా 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా నిర్మిస్తున్నారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో సినిమా విడుదల తేదీ అనౌన్స్ చేయనున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కృష్ణన్ వసంత్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహాబ్, కాస్ట్యూమ్స్: శ్రావ్య వర్మ, ప్రొడక్షన్ డిజైనర్: ఎస్ రామకృష్ణ - మౌనిక నిగోత్రి.
Also Read: పరదా వర్సెస్ శుభం కలెక్షన్లు... ఓపెనింగ్ డే రిజల్ట్ క్లియర్... సమంత క్రేజ్ ముందు అనుపమ వెలవెల!





















