(Source: Poll of Polls)
Karthika Puranam: పాపాత్ములు అంటే ఎవరు? ధర్మం అంటే ఏంటి? కార్తీకపురాణం DAY-9 (అక్టోబర్ 30) కథ!
Karthika Puranam: కార్తీకమాసంలో కార్తీకపురాణం చదువుతారు. రోజుకో కథ చొప్పున 30 రోజులు 30 కథలు. ఎనిమిదవ రోజు చదువుకోవాల్సిన కథ ఇది

కార్తీకమాసం DAY-9 అక్టోబరు 30: కార్తీకపురాణం తొమ్మిదో అధ్యాయం
అజామిళుడిని తీసుకెళ్లేందుకు యమదూతలు-విష్ణుదూతలు వచ్చారని కార్తీకపురాణం ఎనిమిదవ అధ్యాయంలో చెప్పుకున్నాం... తొమ్మిదో అధ్యాయంలో ఆ కథకి కొనసాగింపు..
"ఓ యమదూతలారా! మేము విష్ణు దూతలం. వైకుంఠం నుంచి వచ్చాం. మీ ప్రభువగు యమధర్మరాజు ఎలాంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్ముల్ని పంపించారని ప్రశ్నించారు. అందుకు జవాబుగా యమదూతలు "విష్ణుదూతలారా! మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశం, ధన౦జయాది వాయువులు, రాత్రి౦బవళ్లు, సంధ్యకాలం సాక్షులుగా ఉండి ప్రతి దినం మా ప్రభువు వద్దకు వచ్చి విన్నవించుకుంటారు. ఆ కార్యకలాపములను చిత్రగుప్తునికి చూపించి ఆ వ్యక్తి అవసానకాలమున మమ్మల్ని పంపించి రప్పించేదరు.
పాపులు అంటే ఎవరు?
వేదోక్త సదాచారాలు , ఆచరించాల్సిన ధర్మాన్ని విడిచి వేదాలను - దేవతలను నిందించేవారు
గోహత్య , బ్రహ్మహత్య, శిశుహత్యాది మహాపాపములు చేసినవారు
పరస్త్రీలను కామించినవారు
పరాన్నం కోసం ఆశపడేవారు
తల్లిదండ్రులను, గురువులను , బంధువులను , కులవృతిని తిట్టేవారు
దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పిడించు వారు
దొంగతనం చేయడం, ఇతరుల ఆస్తి కాజేసేవారు
చేసిన మేలు మరిచిన వారు, శుభకార్యములు జరగనివ్వక అడ్డుతగిలే వారు
ఇలాంటి వారు మరణించగానే తనవద్దకు తీసుకునివచ్చి నరకంలో పడేస్తారు. ఈ అజామిళుడు కూడా బ్రాహ్మణుడై పుట్టి దురచారాలకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేస్తూ, కామాంధుడై వావివరసలులేక సంచరించిన పాపాత్ముడు. విష్ణులోకానికి ఎలా తీసుకెళతారని అడిగారు.
ఓ యమకి౦కరులారా..మీరెంత అవివేకులు.. మీకు ధర్మసూక్ష్మములు తెలియవు అంటూ ధర్మ సూక్ష్మములు ఏంటో చెప్పారు విష్ణుదూతలు
ధర్మ సూక్ష్మములు ఇవే
సజ్జనులతో సహవాసం చేసేవారు
జప దాన ధర్మాలు చేసేవారు
అన్నదానము, కన్యాదానము, గోదానము , సాలగ్రామ దానం చేసేవారు
అనాధప్రేత సంస్కారములు చేసేవారు
తులసి వనము పెంచువారు
చెరువులు తవ్వించేవారు
శివకేశవులను పూజి౦చువారు
సదా హరి నామస్మరణ చేసేవారు
మరణ కాలమందు 'నారాయణా' అని హరిని , శివుడిని స్మరించేవారు
కాబట్టి..తెలిసో తెలియకో అజామిళుడు మరణం సమీపించే సమయంలో నారాయణ అని స్మరిస్తూ చనిపోయాజు. అందుకే వైకుంఠానికి తీసుకెళ్లాలని వచ్చాం అన్నారు.
అజామిళుడు విష్ణుదూతల సంభాషణలు విని ఆశ్చర్యపోయారు.."ఓ విష్ణుదూతలారా! పుట్టిన నాటి నుంచి నేటి వరకు శ్రీ మన్నారాయణ పుజకానీ, వ్రతాలుకానీ, ధర్మాలు చేసికానీ ఎరుగను. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు ప్రణమిల్లలేదు. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై, నీచకుల కాంతలతో సంసారం చేశాను. నా కుమారుడిపై ప్రేమతో 'నారాయణా' అని అన్నంత మాత్రాన నన్ను ఘోర నరక బాధల నుంచి రక్షించి వైకుంఠానికి తీసుకెళుతున్నారు. నేనెంత అదృష్టవంతుడను.. ఇది నా పూర్వజన్మ సుకృతము, నా తల్లితండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించింది అని సంతోషంగా విమానమెక్కి వైకుంఠానికి వెళ్లాడు.
ఓ జనక మహారాజా! తెలిసికానీ, తెలియకకానీ నిప్పును ముట్టుకున్నా బొబ్బలెక్కుతాయి. అలానే శ్రీహరిని స్మరించినా సకల పాపాలు నశించి మోక్షం పొందుతారు. ఇది ముమ్మాటికి నిజం
స్కాంద పురాణం వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యంలో తొమ్మిదో అధ్యాయం పారాయణం సమాప్తం
కార్తీక మహాపురాణం కథ DAY-1: కార్తీకమాస పవిత్రత, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, శివభక్తి, దీపారాధన మహత్యం!
కార్తీక మహాపురాణం కథ DAY-2 : కుక్కగా జన్మించిన నిష్టురికి మోక్షం ఎలా లభించింది?
కార్తీక మహాపురాణం కథ DAY-3 : బ్రహ్మరాక్షసులకు శాప విమోచనం






















