Rashmika Mandanna Engagement: సీక్రెట్‌గా విజయ్ దేవరకొండతో రష్మిక ఎంగేజ్‌మెంట్? - నేషనల్ క్రష్ వేలికి ఆ రింగ్ చూశారా?
Rashmika - Vijay Devarakonda Engagement: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పెళ్లి మరోసారి డిస్కషన్ టాపిక్ అయ్యింది. అందుకు కారణం రష్మిక వెలికి ఉన్న ఉంగరం.

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు ఆడియన్స్ అందరిలో క్యూరియాసిటీ క్రియేట్ చేసే లవ్ బర్డ్స్ ఎవరు? అంటే... రౌడీ బాయ్ ది విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) అని చెప్పాలి. తామిద్దరం ప్రేమలో ఉన్నామని ఎప్పుడూ ఓపెన్ అయ్యింది లేదు. కానీ వాళ్లు ప్రేమలో ఉన్నారనేది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు మరోసారి వీళ్ళిద్దరి పెళ్లి డిస్కషన్ టాపిక్ అయ్యింది. అందుకు కారణం రష్మిక!
రష్మిక వేలికి ఉన్న ఉంగరం చూశారా?
రీసెంట్‌గా రష్మిక మందన్న ముంబై వెళ్లారు. హైదరాబాద్, ముంబై ఎయిర్ పోర్టుల్లో ఫోటోగ్రాఫర్లకు నవ్వుతూ ఫోజులు ఇచ్చారు. ఆ తర్వాత జపనీస్ యానిమే 'డిమన్ స్లేయర్' స్పెషల్ ప్రీమియర్ షోకి రష్మిక అటెండ్ అయ్యారు. అక్కడ కూడా ఫోటోలు దిగారు. వీడియోలకు ఫోజులు ఇచ్చారు. సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ షేర్ చేశారు. వాటిని గమనిస్తే... రష్మిక వేలికి ఒక ఉంగరం ఉంది.
రష్మిక మందన్న చేతికి ఉన్నది ఎంగేజ్మెంట్ రింగ్ అని, విజయ్ దేవరకొండతో రహస్యంగా నిశ్చితార్థం జరిగిందని సినిమా ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో కూడా డిస్కషన్ జరుగుతోంది.
రష్మికతో విజయ్ దేవరకొండ పెళ్లి ఎప్పుడు!?
Vijay Deverakonda to marry Rashmika?: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అభిమానులతో పాటు పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖుల సైతం వాళ్ళిద్దరు పెళ్లి గురించి ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఏడాది క్రితం డిసెంబర్ నెలలో పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రచారం మొదలైంది. అయితే డిసెంబర్ 2024లో పెళ్లి జరగలేదు. మళ్లీ ఈ ఏడాది డిసెంబర్ నెలలో పెళ్లి అంటూ మరోసారి ప్రచారం మొదలైంది. 2025 ఎండింగ్ వచ్చేసరికి అయినా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారో? లేదో? చూడాలి. రష్మిక లేదా విజయ్ దేవరకొండ... ఇద్దరిలో ఎవరో ఒకరు ఓపెన్ అయ్యి చెప్పే వరకు వీళ్ళ ప్రేమ లేదా పెళ్లి విషయంలో క్లారిటీ రావడం కష్టం.
Rashmika Mandanna Upcoming Movies: ప్రస్తుతం రష్మిక చేతిలో పాన్ ఇండియా సినిమా 'తామా' ఉన్నాయి. 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అవుతుంది. దర్శకుడిగా మారిన హీరో రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఆ సినిమా నుంచి ఆల్రెడీ రెండు పాటలు విడుదల అయ్యాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో రష్మిక విలన్ రోల్ చేస్తున్నారని ప్రచారం మొదలైంది. విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే... 'శ్యామ్ సింగ రాయ్' ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఒకటి, 'రాజా వారు రాణి గారు' ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో మరొకటి... రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు విజయ్ దేవరకొండ.
Also Read: అల్లు ఫ్యామిలీకి మరో షాక్... జీహెచ్‌ఎంసీ నుంచి నోటీసులు - కేసు ఏమిటంటే?





















