Ramayan Leaks: రణ్‌బీర్ 'రామాయణ్' సెట్ నుంచి ఫోటోలు లీక్ - సీతగా సాయి పల్లవి ఎంత అందంగా ఉందో చూశారా?
Ramayan Leaked Photos:రణ్‌బీర్ కపూర్ రామాయణ్ మూవీ షూటింగ్ మొదలైంది. ఎలాంటి ప్రకటన లేకుండా మూవీని సెట్స్‌పైకి తీసుకువచ్చారు. తాజాగా షూటింగ్‌లో సాయి పల్లవి, రణ్‌బీర్ లుక్ లీక్ అయ్యాయి.
Ranbir Kapoor and Sai Pallavi as Sita Ram Look Viral from Set: ఎలాంటి ప్రకటన లేదు, హడావుడి లేకుండ సైలెంట్ రామాయణ్ మూవీని సెట్స్‌పైకి తీసుకువచ్చాడు బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి. ఆయన డ్రీం ప్రాజెక్ట్‌గా 'రామాయణ్'ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, సౌత్ బ్యూటీ సాయి పల్లవి ఇందులో సీతారాములుగా ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయిన, నితీష్ రామాయణ్‌ను రూపొందించడం మాత్రం పక్కా. అయితే, శ్రీరామ నవమికి రామాయణ్‌ను ఆఫీషియల్‌గా అనౌన్స్‌చేస్తారని, ఆ వెంటనే సినిమా షూటింగ్ మొదలుపెడతారంటూ వార్తలు వచ్చాయి. కానీ, శ్రీరామ నవమికి ఈ నితీష్ రామాయణ్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
అయితే ఇప్పట్లో ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చే చాన్స్ లేదని అంతా అభిప్రాయపడ్డారు. కానీ, సైలెంట్‌గా మూవీ షూటింగ్ మొదలుపట్టేశాడు డైరెక్టర్ నితీష్. తాజాగా ఈ సినిమా సెట్‌లో రణ్‌బీర్.. రాముడిగా, సాయి పల్లవి సీతగా లుక్‌లో ఉన్న ఫోటోలు లీక్ అయ్యాయి. వీటిని బాలీవుడ్‌కు చెందిన పలు మీడియా, ఆడియన్స్ సోషల్ మీడిమాలో లీక్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇవి చూసి అంతా షాక్ అవుతున్నారు. అదేంటి ఎలాంటి సమాచారం, ప్రకటన లేకుండానే షూటింగ్ మొదలెట్టేశారా? అంటున్నారు నెటిజన్లు. ఏదేమైనా రాముడి లుక్‌లో రణ్‌బీర్ చాలా అందంగా ఉన్నాడంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ముఖ్యంగా సీత సాయి పల్లవి లుక్ అదుర్స్ అని, ఈ లుక్‌లో నేచురల్ బ్యూటీ చాలా అందంగా, క్యూట్‌గా ఉందంటూ పొగిడేస్తున్నారు.ప్రస్తుతం రామాయణ్ లీక్ ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. అలాగే ఇందులో కైకేయి పాత్రలో లారా దత్తా లుక్ కూడా ఒకటి బయటకు వచ్చింది. కాగా భారతీయ గొప్పదనాన్ని చాటి చెప్పే పురణాల గాథలపై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి.
Leaks from the sets of '#Ramayana: Part One'..!!!#RanbirKapoor just looks so PERFECT as Lord Rama 🤌, so dies #SaiPallavi as Sita 🙌... Hats off to #NiteshTiwari's casting 💯#Bahubali2 Worldwide collection records definitely in danger now..!! pic.twitter.com/Y4pt6QjvSi
— Filmy Explorer (@filmyexplorer) April 27, 2024
ముఖ్యంగా 'రామయణం' మీద వచ్చిన సినిమాలన్ని సూపర్ హిట్ అయ్యాయి.అయితే గతేడాది వచ్చిన ఓంరౌత్ 'ఆదిపురుష్' మాత్రం బోల్తా కొట్టింది. ఈ మూవీకి దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. మరోసారి బాలీవుడ్ రామాయణాన్ని సినిమాగా తీస్తున్నారు. మరి ఈసారి నితీష్ రామాయణ్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. అయితే ఆయన నటీనటులు ఎంపిక, ఇప్పటి వరకు వినిపించిన అప్‌డేట్స్ చూస్తుంటే మాత్రం రణ్‌బీర్-సాయి పల్లవి 'రామాయణ్' అందరికి ఆకట్టుకోవడం పక్కా అంటున్నారు. ఈ సినిమా కోసం రణ్‌బీర్ అయితే ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు, రాముడిలా మెప్పించేందుకు మేకోవర్ కూడా అయ్యాడు. నితీష్ తీవారి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు కన్నడ రాకింగ్ స్టార్ యష్ రావణుడిగా నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారట నితీష్ తివారి.
Finally Ramayana 🚩#Ranbir & #SaiPallavi as #Ram & #Sita for #Ramayana@Sai_Pallavi92 pic.twitter.com/2kMf46u66W
— 𝗦𝗮𝗶_𝗣𝗮𝗹𝗹𝗮𝘃𝗶_𝗖𝗿𝗮𝘇𝘆_𝗙𝗮𝗻𝘀™︎ (@saipallavi_CF) April 27, 2024
Also Read: త్రివిక్రమ్ చెప్పిన పాయింట్ నాకు నచ్చలేదు, ఆ మూవీకి డైలాగ్స్ రాయనన్నారు: విజయ్ భాస్కర్