News
News
X

Ramarao On Duty Collections : మరీ ఇంత తక్కువా? 'రామారావు ఆన్ డ్యూటీ' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Ramarao On Duty Box Office Collection Day 1: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే...

FOLLOW US: 

Ravi Teja Movie Collections: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'. శరత్ మండవ దర్శకత్వం వహించారు. రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ కథానాయికలుగా నటించారు. సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ చుండు నిర్మించారు. థియేటర్లలో శుక్రవారం విడుదల అయ్యింది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ చాలా తక్కువ అని ట్రేడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 

విమర్శకులకు 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా నచ్చలేదు. ముక్త కంఠంతో సినిమా బాలేదని తేల్చారు. మరోవైపు ప్రేక్షకుల నుంచి కూడా సినిమాకు మరీ అద్భుత స్పందన ఏమీ రాలేదు. కనీసం ఏవరేజ్ అని కూడా ఎవరూ అనడం లేదు. సోషల్ మీడియా వేదికగా రవితేజ అభిమానులు కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా అందుకు తగ్గట్టుగా ఉన్నాయి.

ఏరియాల వారీగా 'రామారావు ఆన్ డ్యూటీ' కలెక్షన్స్ చూస్తే... : 
నైజాం : రూ. 85 లక్షలు
విశాఖ (ఉత్తరాంధ్ర) : రూ. 45 లక్షలు
సీడెడ్ : రూ. 45 లక్షలు
నెల్లూరు :  రూ. 12 లక్షలు
గుంటూరు :  రూ. 24 లక్షలు
కృష్ణా జిల్లా : రూ. 17 లక్షలు
తూర్పు గోదావ‌రి : రూ. 31 లక్షలు
పశ్చిమ గోదావ‌రి : రూ. 16 లక్షలు

ఆంధ్ర, తెలంగాణ మొత్తం మీద 2.82 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. గ్రాస్ వసూళ్ళు చూస్తే రూ. 4.75 కోట్లు అంట. 

క‌ర్ణాట‌కలో 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా 25 లక్షలు, విదేశీ మార్కెట్లలో 35 లక్షలు కలెక్ట్ చేసినట్లు తెలిసింది. మొత్తం మీద ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గ్రాస్ చూస్తే... 5.95 కోట్ల రూపాయలు, షేర్ చూస్తే... రూ. 3.42 కోట్లు వచ్చాయట.

Ravi Teja Last 5 Movies Collections : రవితేజ నటించిన లాస్ట్ ఐదు సినిమాలు ఏపీ, తెలంగాణలో ఎంత కలెక్ట్ చేశాయి? అనే విషయంలోకి వెళితే చివరి నుంచి 'రామారావు ఆన్ డ్యూటీ' రెండో స్థానంలో ఉంటుందని ట్రేడ్ వర్గాల ఖబర్.

Also Read : హీరో పక్కవాళ్ళ డ్రామా ఎక్కువ, టాలీవుడ్‌లో వివక్ష ఉంది - జయసుధ షాకింగ్ కామెంట్స్

ఏపీ, తెలంగాణలో రవితేజ సినిమా కలెక్షన్స్: 
'రామారావు ఆన్ డ్యూటీ' : రూ. 2.82 కోట్లు
'ఖిలాడీ' : రూ. 4.30 కోట్లు
'క్రాక్' : రూ. 6.25 కోట్లు
'డిస్కో రాజా' : రూ. 2.54 కోట్లు
'అమర్ అక్బర్ ఆంటోనీ' : రూ. 3.40 కోట్లు (ఈ కలెక్షన్స్ అన్నీ షేర్స్. గ్రాస్ కలెక్షన్స్ అయితే ఎక్కువ ఉంటాయి).  

Also Read : ఫుడ్ బిజినెస్‌లోకి మహేష్ బాబు - త్వరలో హైదరాబాద్‌లో రెస్టారెంట్

Published at : 30 Jul 2022 03:12 PM (IST) Tags: Ravi Teja Ramarao On Duty First Day Collections Ramarao On Duty Box Office Ramarao On Duty Collections Ramarao On Duty Is Flop

సంబంధిత కథనాలు

Dobaaraa: తాప్సీ సినిమాకి షాక్ - ఆడియన్స్ లేక షోస్ క్యాన్సిల్!

Dobaaraa: తాప్సీ సినిమాకి షాక్ - ఆడియన్స్ లేక షోస్ క్యాన్సిల్!

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?

Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?

టాప్ స్టోరీస్

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..

Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..

Raashii Khanna: అమ్మ బ్రహ్మ దేవుడో ఎంత గొప్ప సొగసురో- హాట్ ఫోజుల్లో హీట్ పెంచేస్తున్న రాశీ ఖన్నా

Raashii Khanna: అమ్మ బ్రహ్మ దేవుడో ఎంత గొప్ప సొగసురో- హాట్ ఫోజుల్లో హీట్  పెంచేస్తున్న రాశీ ఖన్నా