News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Ram Sreeleela Mass Steps : మాస్ స్టెప్పులతో ఇరగదీసిన రామ్, శ్రీలీల - 'స్కంద'లో ఫస్ట్ సాంగ్ చూశారా?

రామ్, శ్రీ లీల ఇద్దరూ మంచి డ్యాన్సర్లు. ఇద్దరు కలిస్తే... వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తే... ఎలా ఉంటుంది? 'స్కంద' సినిమాలో తొలి పాట చూస్తే ఈజీగా అర్థం అవుతోంది.

FOLLOW US: 
Share:

హుషారుకు, ఎనర్జీకి మారు పేరు అన్నట్లు ఉంటారు యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni). తెలుగు చలన చిత్ర పరిశ్రమలో డ్యాన్స్ ఇరగదీసే యంగ్ హీరోల్లో ఆయన ఒకరు. మరి, కథానాయికల్లో? అందంతో మాత్రమే కాకుండా డ్యాన్స్‌తోనూ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ముద్దుగుమ్మల్లో శ్రీ లీల (Sreeleela) ఒకరు. వీళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తే... 

మాస్ స్టెప్స్ ఇరగదీసిన రామ్, శ్రీ లీల
రామ్, శ్రీ లీల తొలిసారి జంటగా నటిస్తున్న సినిమా 'స్కంద - ది ఎటాకర్' (Skanda The Attacker Movie). ఆల్రెడీ సినిమాలో ఓ పాట 'నీ చుట్టూ చుట్టూ'ను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు, ఇప్పుడు రెండో పాట 'గండార బాయ్'ను విడుదల చేశారు. 

GandaraBai Song : 'స్కంద - ది ఎటాకర్' సినిమాలో రెండో పాట ప్రోమో గురువారం సాయంత్రం 6.21 గంటలకు విడుదల చేశారు. అప్పుడే ఇది మాస్ నంబర్ అని అర్థం అయ్యింది. మాస్ అంటే మామూలు మాస్ కాదు. ఈ రోజు విడుదలైన లిరికల్ వీడియో చూస్తే... రామ్, శ్రీ లీల మాస్ స్టెప్పులు ఇరగదీశారు. థియేటర్లలో ఈ పాటకు మాస్ జనాలు కూర్చుల్లోంచి లేచి మరీ స్టెప్పులు వేస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Also Read కాళహస్తిలో 'కన్నప్ప'ను ప్రారంభించిన విష్ణు మంచు - హీరోయిన్, దర్శకుడు ఎవరంటే?   

బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను సినిమాల్లో భారీ తనానికీ లిమిట్స్ ఉండవు. ఆయన దర్శకత్వానికి రామ్ ఎనర్జీ కలిస్తే... స్క్రీన్ మీద ఆటంబాంబు తరహాలో ఫైట్లు, సీన్లు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకు చక్కటి ఉదాహరణ 'స్కంద' ఫస్ట్ థండర్. ఆ విజువల్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. 

Also Read 'ప్రేమ్ కుమార్' రివ్యూ : పీటల మీద పెళ్లి ఆగితే? ఈసారైనా సంతోష్ శోభన్‌కు హిట్ వస్తుందా?   

సంగీత దర్శకుడు తమన్, బోయపాటిలది కూడా హిట్ కాంబినేషన్. 'సరైనోడు', 'అఖండ' తర్వాత వాళ్ళిద్దరి కలయికలో వస్తున్న చిత్రమిది. రామ్ చిత్రాలకూ తమన్ సూపర్ హిట్ ఆల్బమ్స్, రీ రికార్డింగ్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరితో కలిసి పని చేస్తున్నారు. బోయపాటి శ్రీను లాస్ట్ సినిమా 'అఖండ'కు తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించడంతో... 'స్కంద' సంగీతంపై అంచనాలు నెలకొన్నాయి. 

'స్కంద' చిత్రీకరణ పూర్తి
'స్కంద' చిత్రీకరణ కొన్ని రోజుల క్రితం పూర్తి అయ్యింది. హీరో హీరోయిన్లు రామ్, శ్రీ లీలపై పాటను చిత్రీకరించారు. ఆ పాటనే ఇప్పుడు విడుదల చేస్తున్నారు. 'స్కంద' సినిమాను పవన్ కుమార్, జీ స్టూడియోస్ సంస్థ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదల కానుంది. రామ్‌ పోతినేని ఫస్ట్‌ పాన్‌ ఇండియా చిత్రమిది. ఆయన సినిమాలు హిందీలో డబ్బింగ్‌ అవ్వగా... యూట్యూబ్‌లో మిలియన్‌ వ్యూస్‌ అందుకున్నాయి. బోయపాటి శ్రీను సినిమాలూ అంతే! ఉత్తరాది ప్రేక్షకులకు వీళ్లిద్దరూ కొత్త కాదు. అందువల్ల, 'స్కంద' కోసం నార్త్‌ ఇండియన్‌ ఆడియన్స్‌ కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 18 Aug 2023 07:15 PM (IST) Tags: Thaman Boyapati Srinu Ram Pothineni Sreeleela Skanda The Attacker Skanda Movie Songs

ఇవి కూడా చూడండి

Chiranjeevi Telangana Elections: నేను మౌనవ్రతం అంటూ స్వయంగా చెప్పిన చిరంజీవి - మీమర్స్‌కు ఫుల్ మీల్స్

Chiranjeevi Telangana Elections: నేను మౌనవ్రతం అంటూ స్వయంగా చెప్పిన చిరంజీవి - మీమర్స్‌కు ఫుల్ మీల్స్

Sandeep Vanga: మహిళను హింసించడం భావోద్వేగమా? ‘యానిమల్‘ దర్శకుడి కామెంట్స్‌పై నెటిజన్ల ఆగ్రహం

Sandeep Vanga: మహిళను హింసించడం భావోద్వేగమా? ‘యానిమల్‘ దర్శకుడి కామెంట్స్‌పై నెటిజన్ల ఆగ్రహం

Hi Nanna Pre Release Event: ‘హాయ్ నాన్న’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్-రష్మిక మాల్దీవుల పిక్స్ - నానిపై రౌడీబాయ్ ఫ్యాన్స్ గుర్రు

Hi Nanna Pre Release Event: ‘హాయ్ నాన్న’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్-రష్మిక మాల్దీవుల పిక్స్ - నానిపై రౌడీబాయ్ ఫ్యాన్స్ గుర్రు

Mrunal Thakur: అలా జరగకపోతే నా పేరు మార్చుకుంటా - ‘హాయ్ నాన్న’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మృణాల్

Mrunal Thakur: అలా జరగకపోతే నా పేరు మార్చుకుంటా - ‘హాయ్ నాన్న’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మృణాల్

Animal Movie: 'యానిమల్' బడ్జెట్, తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ - 'దిల్' రాజుకు ప్రాఫిట్ తెచ్చే సినిమాయేనా?

Animal Movie: 'యానిమల్' బడ్జెట్, తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ - 'దిల్' రాజుకు ప్రాఫిట్ తెచ్చే సినిమాయేనా?

టాప్ స్టోరీస్

Election News: శభాష్! ఆక్సీజన్ సిలిండర్‌తో పోలింగ్ బూత్‌కు, అలాంటి ఓటర్లు సిగ్గుపడాల్సిందే!

Election News: శభాష్! ఆక్సీజన్ సిలిండర్‌తో పోలింగ్ బూత్‌కు, అలాంటి ఓటర్లు సిగ్గుపడాల్సిందే!

Telangana Assembly Election 2023: 11 గంటలకు 20.64 శాతం పోలింగ్ - హైదరాబాద్ లోనే తక్కువ!

Telangana Assembly Election 2023: 11 గంటలకు 20.64 శాతం పోలింగ్ - హైదరాబాద్ లోనే తక్కువ!

Airtel Vs Jio: నెట్‌‌ఫ్లిక్స్‌ను ఫ్రీగా అందించే ఎయిర్‌టెల్, జియో ప్లాన్లు ఇవే - మినిమం రీఛార్జ్ ఎంతంటే?

Airtel Vs Jio: నెట్‌‌ఫ్లిక్స్‌ను ఫ్రీగా అందించే ఎయిర్‌టెల్, జియో ప్లాన్లు ఇవే - మినిమం రీఛార్జ్ ఎంతంటే?

Telangana Polling 2023 : హైదరాబాద్ బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్‌లా మారిందా - 11 అయినా 12 శాతమే పోలింగ్!

Telangana Polling 2023 : హైదరాబాద్ బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్‌లా మారిందా - 11 అయినా 12 శాతమే పోలింగ్!