Boyapati Srinu Ram Pothinen : బోయపాటి బర్త్ డేకు రామ్ సర్‌ప్రైజ్ - అన్ని కేజీల భారీ కేకుతో...
Boyapati Srinu Birthday : బోయపాటి శ్రీను బర్త్ డేకి హీరో రామ్ పోతినేని సర్‌ప్రైజ్ పార్టీ ఇచ్చారు. భారీ కేక్ కట్ చేయించారు. ఆ కేక్ వెయిట్ ఎన్ని కేజీలో తెలుసా?
విజయవంతమైన కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ బోయపాటి శ్రీను. వాణిజ్య విలువలు మాత్రమే కాదు... ఆయన సినిమాల్లో సమాజానికి చక్కటి సందేశం కూడా ఉంటుంది. ఆయన మంగళవారం (ఏప్రిల్ 25న) బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు.
ప్రస్తుతం యువ కథానాయకుడు రామ్ పోతినేని (Ram Pothineni)తో బోయపాటి ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ఆ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. యూనిట్ సభ్యుల సమక్షంలో బర్త్ డేను ఘనంగా సెలబ్రేట్ చేశారు. అయితే, ఆ పార్టీలో బోయపాటి శ్రీనుకు హీరో రామ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. అది ఏమిటంటే...
బోయపాటితో 85 కేజీల కేక్ కట్ చేయించిన రామ్!
రామ్ పోతినేనితో తెరకెక్కిస్తున్న సినిమా యూనిట్ సభ్యుల సమక్షంలో బోయపాటి శ్రీను కేక్ కట్ చేశారు. ఆ కేక్ బరువు ఎంతో తెలుసా? 85 కేజీలు. బోయపాటి కోసమే రామ్ ప్రత్యేకంగా ఆ కేక్ తెప్పించారు. బహుశా... బోయపాటి బరువు 85 కేజీలు ఏమో!? సినిమాలో కథానాయికగా నటిస్తున్న శ్రీలీల, సీనియర్ హీరో శ్రీకాంత్ సహా ఇతర యూనిట్ సభ్యులు ఆ కేక్ చూసి ఆశ్చర్యపోయారని తెలిసింది.
షూటింగ్ క్యాన్సిల్ చేసి నిద్రపోండి!
బర్త్ పార్టీలో సర్‌ప్రైజ్ ఇవ్వడానికి కంటే ముందు సోషల్ మీడియాలో బోయపాటి శ్రీనుకు రామ్ పోతినేని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ''మీ దర్శకత్వంలో నన్ను ప్రేక్షకులు అందరూ ఎప్పుడు చూస్తారా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. రేపు షూటింగ్ క్యాన్సిల్ చేసి, బాగా నిద్రపోండి'' అని ట్వీట్ చేశారు.
Happy Birthday Boyapati garu..can’t wait for everyone to witness this MAD version of me through your eyes! 🤗
— RAm POthineni (@ramsayz) April 25, 2023
Love..#RAPO
P.S. pls cancel shoot tomorrow & sleep well for once. 🙏#BoyapatiRAPO pic.twitter.com/ToRYQcEsXh
విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 20న బోయపాటి శ్రీను, రామ్ పోతినేని సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అది చూస్తే... దున్నపోతును రామ్ తీసుకుని వెళుతున్నారు. మాసివ్ లుక్ ప్రేక్షకులను అట్ట్రాక్ చేసింది. సినిమాలో ఫైట్స్ కూడా అంతే మాసివ్ గా ఉంటాయని తెలిసింది.
Also Read : సమంతకు గుడి కడుతున్న అభిమాని - ఇంత భక్తి ఏంట్రా బాబు!
సినిమాలోని హైలైట్స్‌లో ఆ బుల్ ఫైటింగ్ సీన్ ఒకటి అని తెలిసింది. సుమారు పదకొండు రోజుల పాటు ఆ ఫైట్ తీశారట. దానికి భారీ ఖర్చు అయ్యిందని, నిర్మాత శ్రీనివాసా చిట్టూరి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని టాక్. ఇది కాకుండా 1500 మందితో మరో ఫైట్ తీశారట. బుల్ ఫైటింగ్ యాక్షన్ సీక్వెన్సు కోసం భారీ లైట్స్ యూజ్ చేశారు. హైదరాబాదులోని ఓ ప్రయివేట్ స్టూడియోలో ఆ సీన్ తీశారు. షూటింగ్ చేసేటప్పుడు లైట్స్ కోసం పవర్ కావాలి కదా! వాటికి 28 జెనరేటర్లు అవసరం అయ్యాయని, స్టూడియోలో అన్ని లేకపోవడంతో బయట నుంచి చాలా తెప్పించారని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. 'ది వారియర్' తర్వాత రామ్ తో ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఇందులో ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేశారు.
Also Read : 'గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ'లో యంగ్ టైగర్ ఎంటరైతే? - ఇదీ హాలీవుడ్‌లో ఎన్టీఆర్ క్రేజ్