By: ABP Desam | Updated at : 26 Apr 2023 03:48 PM (IST)
గుడి కోసం రూపొందుతున్న సమంత శిల్పం... పక్కన సామ్ (Image Courtesy : Google, Samantha Instagram)
సినిమా తారలకు అభిమానులు ఉంటారు. అందులో పెద్దగా ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే, కొంత మందిలో ఆ అభిమానం భక్తిగా మారుతుంది. తెలుగు నాట స్టార్ హీరోలకు తమను తాము భక్తులుగా ప్రకటించుకున్న దర్శక నిర్మాతలు ఉన్నారు. కథానాయికల విషయంలో చాలా మంది అభిమానం చూపిస్తారు గానీ భక్తులుగా మారిన అభిమానులు చాలా తక్కువ మంది కనపడతారు.
తమిళనాడులో సీనియర్ హీరోయిన్ ఖుష్బూకు గుడి కట్టారు. అటువంటి అరుదైన అభిమానం, భక్తి శ్రద్ధలు సమంతపై చూపిస్తున్నారు. ఇప్పుడు ఆమె కోసం ఓ గుడి కడుతున్నాడు అభిమాని. పూర్తి వివరాల్లోకి వెళితే...
సమంత బర్త్ డేకి గుడి ఆవిష్కరణ!?
సమంతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల నివాసి సందీప్ వీరాభిమాని. ఆమె మాయోసైటిస్ బారిన పడినప్పుడు కోలుకోవాలంటూ తిరుపతి, చెన్నై, నాగ పట్నంలో మొక్కుబడి యాత్ర చేశారు. ఇప్పుడు ఏకంగా సమంతకు గుడి కడుతున్నాడు.
బాపట్లలోని ఆలపాడు సందీప్ స్వస్థలం. ఆలపాడులోని తమ సొంత ఇంట్లో సామ్ కోసం అతను గుడి కడుతున్నాడు. ప్రస్తుతం గుడి నిర్మాణ పనులు జోరుగా, శర వేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 28న సమంత బర్త్ డే. ఆ రోజు గుడి నిర్మాణ పనులు పూర్తి అవుతాయట. ఆ రోజే టెంపుల్ ఓపెనింగ్ ఉంటుందని సమాచారం.
ఖుష్బూతో పాటు తమిళనాట నయనతార, నిధి అగర్వాల్, హన్సిక, నమితకు సైతం కొంత మంది అభిమానులు గుళ్ళు కట్టారు. అదీ సంగతి! జయాపజయాలతో సంబంధం లేకుండా సమంత అభిమానులు సొంతం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు.
పుట్టినరోజుకు నో హాలిడే!
ఇప్పుడు సమంత ఇండియాలో లేరు. కొన్ని రోజుల క్రితం లండన్ వెళ్లారు. అక్కడ ప్రియాంకా చోప్రా నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్ ప్రీమియర్ షోకి అటెండ్ అయ్యారు. సేమ్ టైటిల్ తో రూపొందుతున్న ఇండియన్ వెర్షన్ 'సిటాడెల్'లో ఆమె యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ వెబ్ సిరీస్ షూటింగ్ చేస్తున్నారు. బర్త్ డే రోజు కూడా షూటింగులో ఉంటారని, హాలిడే తీసుకోవడం లేదని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.
Also Read : 'గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ'లో యంగ్ టైగర్ ఎంటరైతే? - ఇదీ హాలీవుడ్‌లో ఎన్టీఆర్ క్రేజ్
అభిమానులతో పాటు విమర్శకులు కూడా!
సమంతకు ఎంత మంది అభిమానులు ఉన్నారో, ఆ స్థాయిలో విమర్శలు చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో ఆమె నటించిన పాన్ ఇండియా సినిమా 'శాకుంతలం' ఫ్లాప్ తర్వాత ఆ విమర్శలు ఎక్కువ అయ్యాయి. సమంత పని అయిపోయిందని నటుడు, నిర్మాత చిట్టిబాబు కామెంట్స్ చేశారు. ఆయనపై సామ్ పరోక్షంగా విమర్శలు చేశారు. దాంతో మళ్ళీ ఆయన విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు.
'సిటాడెల్' వెబ్ సిరీస్ కాకుండా ఇప్పుడు సమంత చేతిలో 'ఖుషి' సినిమా ఉంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా సామ్ నటిస్తున్నారు. మాయోసైటిస్ బారిన పడటంతో కొన్నాళ్ళు ఆ సినిమా షూటింగుకు బ్రేక్ పడింది. ఆ తర్వాత మళ్ళీ మొదలైంది. ఇప్పుడు మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయని తెలిసింది. నిజానికి, రష్మిక నటిస్తున్న 'రెయిన్ బో' సినిమా ముందుగా సామ్ దగ్గరకు వెళ్ళింది. ఆ తర్వాత ఏమైందో ఏమో... హీరోయిన్ మార్పు జరిగింది.
Also Read : 'గబ్బర్ సింగ్'కు 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ గిఫ్ట్ - హరీష్ శంకర్ ప్లానింగ్ మామూలుగా లేదుగా
త్రిషాకు తిరుగేలేదు - పెద్ద హీరోల పక్కన వరుస అవకాశాలు, ఆ ఒక్క సినిమాతో మారిన దశ!
Sulochana Passes Away: బాలీవుడ్లో తీవ్ర విషాదం, అలనాటి మేటి నటి సులోచన లట్కర్ కన్నుమూత
Pawan Kalyan Movie Kushi: ‘ఖుషి’ మూవీ చూసిన ఊర్వశి, పవర్ స్టార్ మూవీలో స్పెషల్ సాంగ్ కన్ఫామ్ అయినట్లేనా?!
Urfi Javed: బాబోయ్ ఉర్ఫీ! టీ బ్యాగ్స్ తో డ్రెస్సా? నీ ఫ్యాషన్ సెన్స్కు దండం అంటున్న నెటిజన్స్!
Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!
ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు
Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"
Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!
Byjus Loan Default: బైజూస్కు షాక్! రూ.329 కోట్ల వడ్డీ చెల్లించకుంటే లోన్ ఎగ్గొట్టినట్టే!