By: ABP Desam | Updated at : 02 Sep 2023 02:03 PM (IST)
రామ్ గోపాల్ వర్మ, ‘ఓజీ‘లో పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఓజీ’. దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇవాళ పవర్ స్టార్ బర్త్ డే కావడంతో ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో పవన్ కల్యాణ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలు భారీగా పెంచగా, తాజాగా విడుదలైన గ్లింప్స్ ఆయన అభిమానులతో పాటు సినీ లవర్స్ ను ఉర్రూతలూగిస్తోంది. ‘హంగ్రీ చీతా అంటూ గ్లింప్స్ కు ఓ రేంజిలో హైప్ ఇచ్చిన చిత్రబృందం.. అంచనాలకు మించి అదిరిపోయేలా ఉన్న ఈ గ్లింప్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
సుమారు 100 సెకెన్ల నిడివి ఉన్న ఈ గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. పవన్ ఎంట్రీకి ముందు ఇచ్చిన ఎలివేషన్, ఆ డైలాగులు అదుర్స్ అనిపించాయి. “పదేళ్ళ క్రితం బాంబేలో వచ్చిన తుఫాను గుర్తు ఉందా? అది మట్టి చెట్లతో పాటు సగం ఊరిని ఊడ్చేసింది. కానీ, వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం, ఇప్పటికీ ఏ తూఫాను కడగలేకపోయింది. ఇట్ వాజ్ ఫ్రీకింగ్ బ్లడ్ బాత్! అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే, దెయ్యం కూడా భయపడుతుంది” అనే డైలాగులు ఓ రేంజిలో హైలెట్ అయ్యాయి. ఈ మాటలు పూర్తవుతుండగానే పవన్ పవర్ ఫుల్ ఎంట్రీ ఇవ్వడం అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా చేసింది. ఇక పవన్ కత్తి పట్టుకుని స్టైలిష్ గా నరకడం, గన్స్ పట్టుకుని దుమ్మురేగేలా కాల్చడం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాల్లోకెళ్లా ఆయన ఈ మూవీలో మరింత స్టైలిష్ గా కనిపించారు.
ఇక పవర్ స్టార్ ‘ఓజీ’ గ్లింప్స్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కల్యాణ్ అన్ని సినిమాల్లో ఇదే బెస్ట్ ట్రైలర్ అంటూ మెచ్చుకున్నారు. “ఇది పవన్ కల్యాణ్ కు నిజమైన హ్యాపీయెస్ట్ బర్త్ డే. ‘ఓజీ’ గ్లింప్స్ గురించి సింపుల్ గా చెప్పాలంటే అవుట్ ఆఫ్ ది వరల్డ్. పవన్ కల్యాణ్ అన్ని సినిమాల్లోకెల్లా ఇదే బెస్ట్ ట్రైలర్ అని నేను భావిస్తున్నాను. సుజీత్ చంపేశావ్” అంటూ ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు.
This has to be the HAPPIEST BIRTHDAY for @PawanKalyan #OGGlimpse is simply OUT OF THE WORLD ..This is the BESTEST among all P K trailers I have ever seen Hey #Sujeeth YOU KILLED IT 💪 https://t.co/yrcB6JMd9O
— Ram Gopal Varma (@RGVzoomin) September 2, 2023
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అందాల తార ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ నటుడు అర్జున్ దాస్, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, ప్రముఖ నటి శ్రీయ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది.
Read Also: మరణం లేని వాడికి సైతం చావు తథ్యం - కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్‘ యాక్షన్, టీజర్ చూశారా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
రణ్‌బీర్, యష్ ‘రామాయణం’, రామ్‌చరణ్, ధోని మీటింగ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Gayatri Joshi: ఇటలీ రోడ్లపై కార్ రేస్ - ‘స్వదేశ్’ మూవీ నటికి తీవ్ర గాయాలు, ఇద్దరు మృతి
Hebah Patel: ఆ ప్రశ్నకు హెబ్బా పటేల్ ఆగ్రహం - ఇంటర్వ్యూ మధ్యలోనే వాకౌట్
Month of Madhu: కథ వినకుండానే ఈ సినిమా చేశాను, కనీసం డైలాగ్స్ కూడా ముందు చెప్పలేదు: నవీన్ చంద్ర!
Rashmika - Gam Gam Ganesha Song : 'గం గం గణేశా'లో సాంగ్ విడుదల చేసిన రష్మిక - 'ప్రేమిస్తున్నా' కంటే పెద్ద హిట్ కావాలి ఆనందా
Talasani Srinivas : చంద్రబాబు అరెస్టు బాధాకరం - వైసీపీవి కక్ష సాధింపులు - మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు
మనీ లాండరింగ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ చేసిన ఈడీ
Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం
APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్ సర్వీసులు - ఈ నగరాల నుంచే
/body>